మంచి మాట

ధర్మమే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మాన్ని ఆచరిస్తే దైవాన్ని పూజించినట్లే అంటారు పునీతులు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అని వేదాలు ఘోషిస్తున్నాయి. అది దైవదత్తం. అదే మానవునకు మహోత్తమమైన విత్తం.
ధర్మోపాసన, ధర్మాచరణ పశుపక్ష్యాదుల్లో, పవిత్ర ప్రకృతిలో పుష్కలంగా వుంది. ఇది నిత్యం మనం దర్శించే సత్యం జ్ఞాన శూన్యమైన పశువులు మనం వేసే గడ్డికి తగిన పాలనిస్తాయి. ప్రతిఫలం లేకుండా వృక్షాలు ప్రాణవాయువును కాయలను, పండ్లను మనకు విధిగా ప్రసాదిస్తున్నాయి. సెలయేర్లు మన నుంచి ఏమి ఆశించకుండా చల్లని నీటిని మనకు అందిస్తున్నాయి. మానవ మాత్రుడు ధర్మా ధర్మ విచక్షణాజ్ఞానాన్ని జన్మతః కలిగి వున్నాడు. దానితో సమస్త సౌకర్యాల్ని, అపార శాస్త్ర జ్ఞానాన్ని, మంచి చెడ్డల వివేకాన్ని, దాతృత్వ వికాసాన్ని, దైవప్రార్థన భాగ్యాన్ని, పరోపకార శక్తి సామర్థ్యాల్ని, సమాజ వికాస దక్షతను ఇంకా ఇంకా అనేక ప్రయోజనాల్ని తన హస్తగతం చేసికొన్నాడు మానవుడు.
కానీ నేటి సమాజంలో స్వార్థం- పరార్థం అనే భావాల్ని పరిశీలిస్తే స్వార్థమే బెబ్బులిలా విలయ తాండవం చేస్తూ ఉంది. విజ్ఞాన వికాసానికి అడ్డుకట్టలు వేస్తూ ఉంది. కొందరు మానవులు స్వార్థమనే బురదగుంటల్లో చిక్కుకొని తన విద్యుక్త ధర్మాన్ని వదిలివేసి దుర్లభమైన మానవ జన్మను చేతులారా కలుషితం చేస్తూ విశ్వవికాసాన్ని విఫలం చేస్తున్నారు. అమేయమైన జ్ఞాన సంపదను మానవునకందించిన మాధవుడు సైతం మానవుని భయంకర కృత్యాల్ని రూపుమాపడంలో సతమతవౌతున్నాడు.
అందుకే గుణపాఠం చెప్పే ప్రయత్నంలో వుంది ప్రకృతిమాత. నోట మాటరాని ప్రకృతి, మహాభయంకరమైన అతివృష్టి, అనావృష్టి, తుపాను లాంటి చర్యలతో స్వార్థమానవుల మానసాల్ని మార్చివేసి నిస్వార్థ జీవన విధానంలో పయనించే విధానం సూచిస్తూ ఉంది. ప్రకృతి మాతను పరిహసించే విధానానికి స్వస్తిచెప్పి ప్రకృతిని ఉపాసించే మార్గాన్ని అనే్వషిస్తే కాని ఈ నరలోకం వరలోకంగా మారదు.
మాధవుడు మానవునకు నియమించిన ఏ వృత్తినైనా అంకిత భావంతో నిర్వర్తించి, చిత్తశుద్ధితో పరోపకార పరాయణులై ధర్మదేవత తాండవించే ప్రయత్నం చేయాలి ప్రజాళి. ప్రపంచంలో ధర్మాచరణకు మించిన దైవం లేదు. ధర్మంలో రాజకీయ ధర్మం, వృత్త్ధిర్మం, పతివ్రతాధర్మం ధార్మిక ప్రసంగాల ధర్మం, దేశభక్త్ధిర్మం, మానవసేవాధర్మం, నిరాడంబరంగా జీవించే ధర్మం ఒకటేమిటి ఉర్విలో సర్వం ధర్మాచరణ, ధర్మోపాసన, ధర్మైకసాధన, ధర్మారాధనలతోనే ఉద్ధరింపబడుతుంది. కురుక్షేత్రంలో జరిగే ధర్మయుద్ధ సమయంలో అర్జునుడు క్షత్రియ ధర్మాచరణ నిరసించి, పాపభీతికి పట్టం కట్టి, తనను బరిమార్చుటకై మీదికి పరుగిడుతున్న కౌరవ సైన్యాన్ని మట్టుపెట్టుటకు వెనుకంజ వేసి అస్త్ర సన్యాసం చేశాడు. భయంతో గడగడ వణుకుతూ వున్న పార్థునకు, కృష్ణపరమాత్మ గీతోపదేశం చేయక తప్పలేదు. సవ్యసాచి సంకోశాన్ని పటాపంచలు చేశాడు. విజయుడు వీర విహారం చేసి దుర్మార్గ దుర్యోధనుని పక్షంలో పోరాడే వారిని హతం చేశాడు. ధర్మదేవత సహాయం సంపూర్ణంగా లభించింది. విజయలక్ష్మి విజయుణ్ణి వరించింది. కౌరవుల అన్యాయం, అక్రమం, దురాచారం, దుర్మార్గం, దౌర్జన్యం, దురభిమానం, దుర్వృత్తి పటాపంచలైపోయాయి. వంశ నాశనం సంప్రాప్తమైంది.
సత్య ధర్మాలు రెండు సన్మార్గ రథానికి చక్రాలు. అందులో ఏది లోపించినా సన్మార్గ రథం ముందుకు సాగిపోదు. మాట తప్పుట మహాపాపమని, సత్యమే నిత్యమని భావించిన బలి చక్రవర్తి మూడడుగుల దానంతో కీర్తి కిరీటాన్ని అధిరోహించాడు. అర్జునుడు ఎల్లవేళలా చల్లగా పాలించే ప్రభువు అయిన కృష్ణపరమాత్మతో వచ్చిన వైరానికి కుమిలిపోయాడు. కాని, మాట తప్పుట మంచిది కాదని, యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. ఆర్తుడగు గయుని ప్రాణాపాయానికి అడ్డుపడినాడు. ఆర్తరక్షకుడనే బిరుదు అర్జుననకు దక్కింది.

-విద్వాన్ వల్లూరు చిన్నయ్య