మంచి మాట

భగవద్దర్శనము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారణజన్ముల ఆలోచనలు ఉదాత్తమైన గొప్ప విషయాలపై లగ్నం కాబడి ఉంటాయి. స్వామి వివేకానందుని మనస్సు చిన్నతనం నుండీ భగవంతుని ఉనికిని అనే్వషిస్తూ ఉండేది. నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో తపించిపోయేవారు. భగవంతుడు ఉన్నాడా? ఉంటే కనపడతాడా? అని తమలో తాము మదనపడుతూ ఉండేవారు. మతమునకు సరైన నిర్వచనము లభించక సతమతమైపోయేవారు. కనబడిన గొప్ప పండితులను, మత పెద్దలను భగవంతుని గురించి ప్రశ్నించి విఫలమయ్యారు. ‘నదీనాం సాగరోగతిః’ అన్నట్లు చివరకు తన కోసం కారణజన్మనెత్తిన శ్రీరామకృష్ణ పరమహంసను దర్శించడానికి కామార్పకూరు చేరుకున్నారు.
నిత్య జప, ధ్యాన, భక్తి సంకీర్తనామయులైన శ్రీరామకృష్ణులు వివేకానందుని రాక కోసం ఎదురుచూస్తున్నారు. అప్పటి వివేకానందుని నామం నరేంద్రుడు. వారిరువురిది జన్మ జన్మల బంధం. వారిద్దరి కలయికతో వారికి జన్మరాహిత్యం కలిగినది. ఆత్మస్వరూపులై వారి శిష్య పరంపరను చైతన్యపరచుచున్నారు.
చార్వాక వాదము ప్రబలిపోతున్న తరుణంలో వారిద్దరి కలయిక ఒక గొప్ప సంఘటన. భగవంతుణ్ణి ఎలా ప్రత్యక్షం చేసుకోవాలో అనుభవైక వేద్యం చేసిన మహత్తర దృశ్యం ప్రదర్శింపబడింది. మొదటి కలయికలోనే ‘‘మీరు భగవంతుణ్ణి చూసారా?’’ అని సూటిగా ప్రశ్నించిన నరేంద్రునికి అంతే సూటిగా ‘‘ఔను నినె్నంత స్పష్టంగా చూస్తున్నానో అంత స్పష్టంగా భగవంతుని చూశాను’’ అని సమాధానమిచ్చిన శ్రీరామకృష్ణులను చూసి పులకించిపోయారు నరేంద్రుడు. భగవంతుణ్ణి చూసిన ఒక గొప్ప మహనీయుని కలిసానన్న ఆనందంతో తన్మయులైనారు నరేంద్రుడు. ఏదీ అనుభవిస్తేగాని నమ్మని నరేంద్రులు ఒంటరిగా తిరిగి శ్రీరామకృష్ణులను చేరుకున్నారు. రెండవసారి కూడా అతని రాకకోసం ఎదురుచూస్తున్న శ్రీరామకృష్ణులు సాదరంగా ఆహ్వానించి, అక్కున చేర్చుకొని స్పృశించగానే నరేంద్రునికి సుమస్త లోకములు తనలో లీనమైపోయినట్లు అనుభూతి చెందాడు. భగవంతుని దర్శనం ఇంత భయంగా ఉంటుందా! అని ఆశ్చర్యపోయాడు. కాని ఆ సంఘటన ఒక ఆధ్యాత్మికోదయం. సర్వమానవాళికి నవోదయం. ఆ క్షణంలోనే నరేంద్రుడు వివేకానందుడై ప్రపంచానికి ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి నియమించబడ్డారు. అప్పటినుండి శ్రీరామకృష్ణులు వివేకానందులకు ప్రత్యక్ష భగవంతుని రూపముగా కనపడి, సఖ్యమే భక్తిమార్గము కాగా గురుస్వరూపమై భవిష్యద్దర్శనం నిర్దేశించారు.
వివేకానందులు స్వామియై ప్రపంచానికి భారతదేశ ఔన్నత్యమును చాటి చెప్పి ఆధ్యాత్మిక జీవన మార్గము యొక్క విధానాలను విశదపరచారు. నాస్తికుడంటే తనపై తనకు నమ్మకము లేనివాడు. భారతదేశము అందించే ఆధ్యాత్మిక జ్ఞానమును ప్రపంచం మనఃస్ఫూర్తిగా ఎప్పుడు అందుకుంటుందో అప్పుడే ప్రపంచ శాంతికి నాంది. అటువంటి సమయం ఆసన్నం కావడానికి ధైర్యసాహసములు ఊపిరిగా, వజ్ర సంకల్పమైన శీల సంపదతో, సునిశిత బుద్ధి కలిగి ప్రపంచ ప్రయోజనం కొరకు నిలబడే నిస్వార్థ్ధీరులు అవసరం. అటువంటి ధీరులను తయారుచేసే విద్య, గరువులు అవసరమని స్వామి బోధించారు.
ఆత్మవిశ్వాసం కలిగి అసూయ, అనుమానాలను విడనాడి మంచివారికి అండగా నిలబడేవారే అసలైన విద్యావంతులని ఉద్ఘాటించారు. విద్యార్థి దశలో బ్రహ్మచర్యం ఒక వజ్రాయుధం. దాని నుండి పవిత్రత చేకూరుతుంది. పవిత్రతతో సాధించలేనిది ఈ విశ్వంలో ఏదీ లేదు. మూఢ విశ్వాసాలను ప్రోత్సహించేదేదీ మతం కాదు. నిజమైన మతంలో వంచన, మోసం ఉండదు. మహిమ ఉంటుంది. అది పవిత్రతతోనే దర్శనమవుతుంది. ఆత్మవంచనే మరణం. మూఢ విశ్వాసాలతో కలిగే భయమే మరణం. మనలో ఉన్న దివ్యత్వమును వ్యక్తపరచడమే మతం. ఇతరులకు సహాయపడేదే మతమని పూర్తిగా నమ్మి ఆచరించారు స్వామి.

వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు