మంచి మాట

రుద్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకరా! ఈ అవనీతలంలో నీకన్నా గొప్ప దైవము లేడు. నీ నామోచ్ఛారణ చేయువారికి అభయంకరుడివై, సురాసురల నెందరినో నీ కటాక్ష వీక్షణములతో కాపాడినావు. మానవులము మేము నీ ముందెంత తండ్రీ! నీ దయార్ద్ర హృదయంలో మాకింత చోటివ్వు స్వామి! ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం సర్వజనులకు మోక్షదాయం.
ఈశ్వరా! నీ నామ మహిమను ఏమని పొగడను. వజ్రము కఠినముగానుండును. అట్టి వజ్రము సైతం పువ్వుగా మారును. భగభగమండు అగ్ని సైతం మంచుగా మారును. అగాథమగు జలరాశియు మహాసముద్రము సైతం నేలగా మారును. శత్రువు మిత్రుడుగను, విషము అమృతాసారమగును. పరమశివా! ఈ లోకమంతా తరచి చూసినా నీ మహిమలే గదా! శివునాజ్ఞ లేనిదే చీమైనా కదులునా అనెడి నానుడి గలదు.
మాయామోహిత కర్మలనెన్నో నిత్యము చేస్తుంటాము. రోగాలు ఈ దేహాన్ని బాధిస్తుంటాయి. కోపతాపాలు, కుళ్లు, కుత్సితాలు, ద్వేష రోషాలతో నిరంతరం మా మనసులు మలినవౌతుంటాయి. మణుగులకొలదిగల ఆ పాపములను నీ నామముతో తొలగించుము తండ్రీ!
ఓ సర్వ జగద్రక్షకా పాహి పాహి అన్న శ్రీకాళహస్తులకు మోక్షము ప్రసాదించావు. ఏ వేదములు పఠించే సాలెడు, ఏ ధర్మశాస్త్రాలు నేర్పింది ఏనుగు, ఏ పూజ రహస్యములు సాలీడుకు తెలిసియుండెను కనుక, అట్టి క్షుద్రజీవుల సైతము కరుణించిన మహానుభావుడవు నీవు. ఈ మాఘమాసమున ప్రాతఃకాలమున స్నానం చేసి, విభూదిని నుదుటిపై ధరించి, మెడలో రుద్రాక్షలు దాల్చి, శుభ్ర వస్తమ్రుతో నీ లింగమునకు చెంచెడు గంగోదకముతో అర్చన చేసిన చాలు. హర హర మహాదేశ శంభోశంకర అని ప్రార్థింప సర్వ పాపములు హరించును.
కాళహస్తి, శ్రీశైలం, ద్రాక్షారాము వంటి పంచారామాలు, పుణ్యక్షేత్రములో నీ ఆవాసము దర్శించిన చాలు. భక్తులమైన మమనుగ్రహించుటకు నీవు సదా మా ఎడల దయ చూపుము. అభిషేక జలాలతో అభిషేకించటం శివునికి పరమ ప్రీతికరం. పంచామృతాలతో, పాలతో అభిషేకించడంవలన దుఃఖ నివృత్తి అయి మనశ్శాంతి కలుగును. పెరుగు, నెయ్యిలతో కావించటంవలన గుణవంతులు, తేజోవంతులగుదురు.
శివలింగాన్ని తేనెతో అభిషేకించిన ఐశ్వర్యం, పంచదారతో అభిషేకము బుద్ధివికాసం, సుగంధ ద్రవ్యాలతో నభిషేకించిన భోగప్రాప్తి, చెరుకు, కొబ్బరి నీళ్ళతో అభిషేకించిన ఆనందం, తైలంతో శతృనాశనం, విజయప్రాప్తి కల్గును. నమక చమకాదులతో పూజించిన సర్వ సుఖములు కల్గును.
రుద్రాభిషేకాలు వలన రోగాలు, పీడలు నివారణయగును. శివనామ సంకీర్తనం నిరంతరం శుభప్రదాయకం. శివుని భక్తులను దర్శించినంతనే త్రివేణీ సంగమ స్నాన ఫలం కల్గును. శివనామం గంగానదికి, విభూతి యమునా నదికి, రుద్రాక్షలు సరస్వతీ నదికి ప్రతీకలు. శివలింగం అలంకరించడం పరమ శివునికి ప్రీతికరమగు చర్య అగును.
ఎందరో ఎందరెందరో మహానుభావులు నీ నామ స్మరణముతో తరించిరి. మార్కండేయుడు, దుర్వాసుడు, పరశురాముడు, శ్రీరాముడు, బ్రహ్మ విష్ణువుల వంటి అధిదేవతలు, ఇంద్ర గణాలు, రావణుడు, భస్మాసురుడు వంటి రాక్షసులు సైతం నిను సేవించి తరించిరి. నీ మహాత్మ్యము బ్రహ్మ, విష్ణు, లింగ, నారద, భారత భాగవతాది పురాణాలను తెలియచేయుచున్నది. నాగేంద్రహరాయ, త్రిలోచనాయ, భస్మాంగరాగాయ, మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై నకారాయ నమఃశివాయ.

-లక్కరాజు శ్రీనివాసరావు