మంచి మాట

త్యాగపురుషుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవద్గీత తృతీయాధ్యాయం 21వ శ్లోకంలో శ్రీకృష్ణ్భగవానుడు అర్జునునికీవిధంగా బోధించాడు. ‘‘శ్రేష్టులగు వ్యక్తులు ఏ కర్మను చేయుదురో సామాన్య జనులు దానినే చేయుదురు. వారు లౌకిక వైదిక వ్యవహారములందు దేనిని ప్రమాణముగా గ్రహింతురో లోకులు కూడా దానినే అనుసరింతురు’’. మహాత్ములు ఏది ఆచరించి చూపించారో ఆ అడుగుజాడల్ని అనుసరించే మహోన్నత సంతతికి చెందినవారు హిందువులు. ఇతరుల శ్రేయస్సు కోసం జీవితాల్ని త్యాగం చేసిన ఎంతోమంది మహర్షులు, యోగులు, రాజులు, చివరకు సాధారణ మనుష్యులను సహితం మన దేశ చరిత్రలో చూడవచ్చు. సాధు పురుషులు మరణించిన తరువాత వారి మృతదేహాలను దహనం చేయకుండా గంగానదిలో నిమజ్జనం చేసే సంప్రదాయం ఒకటి ఉంది. అలా చేయడం మృతదేహం కూడా నదిలోనున్న ఎన్నో జలచరాలకు ఆహారంగా ఉపయోగపడుతుందన్న సద్భావంతోనే. మృతదేహాలను నదిలో నిమజ్జనం చేస్తే జల కాలుష్యం అవుతుందని, దానివలన ఎన్నో రోగాలు వస్తాయంటారు పర్యావరణ విశేషజ్ఞులు. అయితే వందలకొలది వేలకొలది మృతదేహాలను నీటిలో వేస్తే వారు శంకించిన కీడు జరుగుతుందేమోకాని ఒకటి రెండు మృత శరీరాలవలన ఔషదీయుక్తమైన గంగానదీ జలాలకు ఎలాంటి అపకారం జరగదని కొందరు అభిప్రాయపడతారు. ఏది ఏమైనా ఈ సంప్రదాయం యుగయుగాలుగా వస్తోంది.
దానగుణానికి మించిన ఉత్తమ గుణం వేరొకటి లేదు. మనం చేసే దానం ఇతరులకు శ్రేయస్సునిస్తుందంటే దానం చేయడం మంచిది అని స్వామి వివేకానంద అంటారు. మరణించిన తరువాత మన శరీర అవవయాలను ఇతరుల ప్రయోజనార్థం దానం చేసేవారు మరణంలోనూ జీవిస్తారు. తమ జీవితాలు ఆరిపోయినా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేవారు నిజంగా ధన్యులు. తను జీవించి ఉండగానే దేహాన్ని త్యాగం చేసిన త్యాగపురుషుడు దధీచి మహర్షి. మరణించిన తరువాత శరీర అవయవాలను దానం చేయడంకన్నా ఇతరుల శ్రేయస్సుకోసం బ్రతికి ఉండగానే దేహాన్ని త్యాగం చేయడం మిన్న. అందరూ ఇంతటి సాహసం చేయలేరు. కాని దధీచి అందుకు భిన్నంగా బ్రతికి ఉండగానే మన శరీర భాగాల్ని దానం చేసి మరణిస్తాడు. అందుకే అతను అమరుడు.
వృతాసురుడనే రాక్షసుడు అంతులేని దురాగతాలకు పాల్పడుతూ మానవులనే కాక దేవతల్ని హింసించేవాడు. ఆ రాక్షసుడు పెడుతున్న బాధలను భరించలేక అతడ్ని సంహరించే మార్గం తెలియజేయమని దేవతలు బ్రహ్మను ప్రార్థిస్తారు. ఒక మహాదాత యొక్క వెనె్నముకతో వజ్రాయుధాన్ని తయారుచేసి దానితో దండెత్తుతే ఆ రాక్షసుడు మరణిస్తాడు. వేరు మార్గం లేదు అని బ్రహ్మ వారికి చెప్తాడు. ఇది సాధ్యమా? ఎవరు మాత్రం బ్రతికి ఉండగానే వెనె్నముకను దానం చేసి తమ చావు తామే తెచ్చుకుంటారు? దేవతలు నిస్పృహ చెందుతారు. అలాంటి దాతలు భూలోకంలో భరతఖండంలో ఉన్నారు. వారికి శరీరం తుచ్ఛప్రాయమైనది. మీరు మహర్షి దధీచిని ప్రార్థించండి, అతను లోక శ్రేయస్సుకోసం అంగీకరిస్తాడు అని బ్రహ్మదేవుడు సలహా ఇస్తాడు. దేవతలందరిని తీసుకొని దధీచి మహర్షి దగ్గరకు మహేంద్రుడు వస్తాడు. అంతా వివరంగా చెప్పి లోక కళ్యాణం కొరకు వెనె్నముకను దానం చేయమని కోరతారు. మహర్షుల ధ్యేయం లోక కళ్యాణం. తన వెనె్నముక ఒక అస్త్రంగా మారి దాని ద్వారా లోక కంటకుడైన రాక్షసుడు మరణించగలడని తెలుసుకున్న దధీచి ఇంద్రుని కోరికను మన్నించాడు. అలా అతను జీవించి ఉండగానే శరీరం నుంచి వెనె్నముకను వేరుచేయగా దధీచి మరణిస్తాడు. విశ్వకర్మ ఆ వెనె్నముకను వజ్రాయుధంగా మలచుతాడు. ఇంద్రుడు ఆ వజ్రాయుధంతో వృతాసురుడిని సంహరిస్తాడు. ఇతరుల శ్రేయస్సుకోసం శరీర అవయవాలను దానం చేయడం ఉన్నతమైన కార్యమేనని మన పూర్వీకులు ఆచరించి చూపించారు.మనం మరణించిన తరువాత మనతో వచ్చేవి మనం చేసిన మంచి, చెడు కర్మ ఫలాలు మాత్రమే. మంచి కర్మలు చేస్తే మంచి జన్మ, చెడు కర్మలు చేస్తే చెడ్డ జన్మ కలుగుతుందన్నది ఋషివచనం.

- గుమ్మా ప్రసాదరావు