మంచి మాట

సాత్వికాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహారం సాత్వికంగా ఉండాలని పెద్దలంటారు. ఇందులోని మర్మం ఏమిటంటే సాత్వికమైన ఆహారం వల్ల మంచి ఆలోచనలు కలుగుతాయి. ఆ మంచి ఆలోచనల వల్ల సజ్జన స్నేహం లభ్యమవుతుంది. సజ్జన స్నేహం వల్ల పొరుగువారికి సాయం అందించాలన్న ఆలోచనలు రేకెత్తుతాయి.
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు నందయశోదమ్మల ముద్దు బిడ్డడుగా ఎదుగుతున్నాడు. ఆ కాలంలో ఇతర గోపాలురతో కలసి శ్రీకృష్ణుడు కూడా ఆవులను మేపడానికి వెళ్లేవాడు. వారితో కలసి ఆడిపాడి వారితోనే కలసి చల్ది ఆరగించేవాడట. యాగభోక్త అయిన కృష్ణుడు ఆ చల్దిని తినడాన్ని చూడడానికి దేవతలు ఆకాశాన గుమికూడేవారని పురాణ వేత్తలు అంటారు. ఈ చల్ది తినడాన్ని పోతన మహాశయుడు మహాభాగవతంలో అద్భుతంగా వర్ణించాడు.
కృష్ణయ్య సంగడీలతో కలసి వేళ్ల సందుల్లో ఊరగాయ ముక్కలు పెట్టుకుని మీగడ పెరుగుతో మేళవించిన అన్నాన్ని దోసిలిలో పెట్టుకుని తినడానికి ఉపక్రమించే వాడట. అయితే వారు కూర్చున్న చందాన్ని కూడా పోతన కనుల పండుగగా వర్ణించాడు. చిన్ని కృష్ణుణ్ణి తమ నేస్తాన్ని వారు మధ్యలో కూర్చుబెట్టుకుని అందరినీ కృష్ణయ్య చూచేవిధంగా కూర్చున్న తరువాత కృష్ణు ని స్నేహితులందరూ చుట్టూ రా కమలంలోని రేకుల వలె కూర్చునేవారట. వారిలో ఒకరు ‘‘కృష్ణా నా చల్దిని రుచి చూడు ఎంత మధురంగా వుందో’’ అంటే మరొకరు ‘ఇదిగిదిగో నేను పెడుతున్నాను నాది తిను దామోదరా’’అంటూ పెట్టినట్లే పెట్టి కృష్ణుని చేతిలోది తినేస్తుండేవారట. వారంతా కలసి నవ్వుతూ నవ్విస్తూ ఆ చల్దిని ఎంతో ఆనందంగా తినేవారట. ఒకరిని మోసం చేసి మరొకరు తింటూ,మరికొందరు వేరే ఎవరినో చూస్తూ తమ చేతుల్లోది కిందపోసుకుంటూ మైమరిచి వాళ్లు తినడం - చూసినవారికి అపురూపంగా కనిపించేదట.
నిజమే కదా. సర్వసృష్టికి కారణాకారణుడు అవ్యక్తుడయిన పరమాత్మ వ్యక్తమవడమే కాదు వారితో పాటు కూర్చుని , తిని, తిరిగి, వారిలో ఒకడిగా మెలుగుతుంటే వారికి మైకం కమ్మక ఏం చేస్తుంది. అట్లాగే మనం కూడా మన దగ్గర వున్నదాన్ని ఇతరులకుపెట్టాలని ఆ తరువాతనే తినాలని శిరిడీ సాయిబాబా చెప్పడంలోని ఈ అంతరార్థంగా గ్రహించమని పెద్దలు చెప్తారు. ఎవరికైనా పెట్టి అంటే అతిథి పూజ చేయకుండా అన్నదానం చేయకుండా ఇంతకుముందుకాలంలో భోజనం చేసేవారు కాదు అని అంటారు.
మన భారతీయ సంప్రదాయంలో కర్మసిద్ధాంతానికి ప్రాధాన్యం ఇచ్చేవారు ఎక్కువ. కనుకనే ఎదుటి వారిని నారాయణ స్వరూపులుగా భావించాలని పొరుగువారికి సేవ చేస్తే అది నారాయణుడికి చేసినసేవ అవుతుందని ఈవిధమైన విధులను పెద్దవారు పెట్టారు. మనకున్న ఆచారాలన్నీ కూడా వాటివెనుక ఎన్నో అంతరార్థాలను కలిగి ఉన్నాయి కనుక వాటిని అర్థం చేసుకొని ఆచారాలను ధర్మం తప్పకుండా పాటిస్తే భారతీయ వైభవం ఎన్నటికీ తరగని గని లాగా ఉంటుంది. ప్రపంచం యావత్తు ఈ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించడానికి ముందుకువస్తారు. భారతీయులమైన మనం మన వేదం చెప్పినట్లుగా సత్యధర్మాలను పాటించటం మన కర్తవ్యంగా భావించాలి.
అంతేకాదు ఇతరులకు ఏదైనా సేవ చేసినపుడు ఆ సేవను పొందినవారి కళ్లల్లో ఆనందం చూస్తే సేవచేయడంలోని మాధుర్యం రుచి ఎరిగిన వారు మరలా మరలా సేవ చేయడానికి ముందుకు వస్తుంటారు అని పెద్దలంటారు. పరోపకారం మిదం శరీరం అనడంలో ని అంతరార్థం అదే. నాలుగు రోజులు వుండే ఈ దేహాన్ని ఎన్ని పాలుమీగడలు పెట్టి జాగ్రత్తగా కాపాడినా చివరకు ఓనాడు కట్టెల్లో భగభగమండి పోతుంది. కాని చేసిన మేలు మంచి మనతో కూడా మరో జన్మకు వస్తాయ. పూర్వజన్మ వాసనలనుబట్టి తరువాతి జన్మ వస్తుందంటారు. కనుక మరలా కూడా మనుష్య జనే్మ రావాలని దానికోసం ఈ లభ్యమైన మానవ జన్మను సార్థక్యం చేసుకోవడానికి తెలుసుకొని మరీ పుణ్యకార్యాలు చేయమని చెప్పేది మన భారతీయం.

- ఎస్. నాగలక్ష్మి