మంచి మాట

ప్రథమ పూజనీయురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లి అన్న పదం తనపర భేదాల్లేకుండా పిల్లలందరినీ సమానంగా చూడడానికి ఇచ్చిన నిర్వచనం. ఈర్ష్యాసూయలు లేకుండా గురుపత్ని వారి ఆశ్రమంలో ఉన్న శిష్యులందరికీ తన సొంత బిడ్డలతో సమానంగా చూసేది. ఈ గురపత్నిని తల్లిగా భావించేవారు శిష్యులు. ఇట్లాంటి స్ర్తీల గురించిన ఎన్నో సత్యాలు మనకు వేదంలోను, పురాణాల్లోను కనబడుతాయ. తల్లిని పూజించిన వారికి ఇహపరసుఖాలు రెండు లభ్యమవుతాయని మన శాస్త్రాలు చెప్తాయ. అసలు స్ర్తిని ఆదిపరాశక్తిగా పూజిస్తారు.
కుంతి పాండురాజు భార్య. ఈమె తన కొడుకులనే కాదు పాండురాజు మరోభార్య మాద్రి కొడుకులను సమానంగా చూసింది.అందుకే కుంతికొడుకులు ముగ్గురు అని ఎవరూ చెప్పరు పాండవులు ఐదుగురు అనడంలో కుంతి వారినేవిధంగా పెంచిదో మనకు తెలుస్తుంది.
అంతేకాదు ఒకసారి దుర్యోధనుడితో గంధర్వులు పోరుకు వచ్చినపుడు పాండవులు వెళ్లి ఆ గంధర్వులతో యుద్ధాన్ని చేసి గెలిచి వస్తారు. అపుడుగంధర్వులు మేము కౌరవులతో పోట్లాడుతుంటే మీరు మధ్యలో వస్తారేమని ప్రశ్నించారట. దానికి యుధిష్టరుడు దుర్యోధనుడు ఒక్కడు కాదు మేమంతా 105మందిమి అన్నాడట. మాతో పోరు అంటే మా నూటైదు మందిని గెలిస్తే అది మీ విజయం ఒక్క దుర్యోధనుడిపై కాదు అన్నాడట. అంతటి హృదయవైశాల్యం ఉండేటట్లుగా పిల్లలను పెంచిన కుంతిని మనం ఆదర్శమాతృమూర్తిగా భావిస్తాం కదా.
అట్లానే రామాయణంలో కౌసల్య రాముడు అడవులకు వెళ్తున్నపుడు ‘అమ్మా నీ ముద్దుల గారాలకొడుకు ఉన్న ఒకడు అడవులకు వెళ్తున్నాడు కదా’ అని ఒకరు అంటే ఆమె అందట ‘కాదు ఈ అయోధ్యలోని ఉన్న బిడ్డలందరూ నాబిడ్డలే, అయినా ఈ రామునికోసం నా హృదయం విలపిస్తోంది ’ అన్నదట. అంటే కౌసల్య తమ రాజ్యంలోని బిడ్డలందరినీ కూడా మాతృహృదయంతోనే చూచేదట.
ధ్రువుని తల్లి కూడా ‘‘నన్ను నాన్న తన అంకపీఠం మీద కూర్చోబెట్టుకోవడం లేదు’’అని ధ్రువుడు విలపిస్తే ‘తండ్రీ! ఆ విశే్వశ్వరుని కరుణకోసం నీవు విలపిస్తే ఆ దేవాది దేవుడు కరుణిస్తాడు. అపుడు మీ తండ్రే నిన్ను పిలిచి తన అంకపీఠం మీద కూర్చోబెట్టుకొంటాడు నీవు చేయాల్సింది భగవంతునిధ్యానం ’’ అని చెప్పిందట. అలా అమ్మ చేసిన బోధ వల్లే ధ్రువుడు శ్రీమన్నారాయణుడిని మెప్పించి ధ్రువమండలానికి అధిపతి అయ్యాడు.
మొట్టమొదటి గురువు తల్లే. అందుకే అమ్మను ప్రథమ పూజనీయురాలు అంటారు. ఆ తల్లి ఆశీస్సులు అందుకున్న ఎవరైనా సరే తాము అనుకొన్న రంగంలో ప్రథమ శ్రేణిలో నిలుస్తారు. తల్లిని ప్రేమాదరములతో చూచే గరుత్మంతుని ఆ మహావిష్ణువే మెచ్చుకుని తన వాహనంగా చేసుకొన్నాడు.
పుండరీకాక్షుడు అను భక్తుడు అల్లరి చిల్లరిగా తిరిగినా తల్లి దండ్రుల విలువను తెలుసుకొని వారికి సేవ చేయడమే తన కర్తవ్యం అనిభావించాడు. అలా పుండరీకాక్షుడు తన తల్లిదండ్రుల సేవలో ఉన్నప్పుడు ఆ శ్రీహరి వస్తే ఆ పుండరీకాక్షుడు కాసేపు అలా కూర్చో నేను మా తల్లిదండ్రుల సేవ పూర్తి చేసుకొని వచ్చి మీతో మాట్లాడుతాను అని చెప్పాడట. ఆ శ్రీహరి ఎంతో మురిసిపోయి తన భక్తునికి తల్లిదండ్రుల మీద ఉన్న భక్తికి మురిసిపోయి నడుములపై చేతిని పెట్టుకుని చూస్తూ నిల్చున్నాడట. దానివల్లనే ఆ శ్రీహరినే మనకు పాండురంగనిగా శ్రీరంగంలో దర్శనమిస్తాడు.
ఇలా తల్లిదండ్రుల సేవ చేసిన వారంతా ధన్యులు. నేటి కాలంలో కూడా తల్లిదండ్రుల సేవ చేసినవారు ఎంతో ఉన్నతస్థానంలో నిలిచినవారే. కన్నతల్లి తనబిడ్డలు ప్రగతి పథంలో నడవాలని తాను ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది. అట్లాంటి అమ్మను ప్రతివారు పూజించాలి. సమాజం నాకేమి ఇచ్చిందని అనుకోక సమాజ శ్రేయస్సుకై శ్రమించేలా చేసే పౌరులను తయారు చేసే తల్లిని పూజించినవారే ధన్యులు.

- కె. యాదయ్య