మంచి మాట

నమ్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సాయభక్తుడు తనకు కళ్లకలక వచ్చిందని దానిని పోగొట్టమని సాయిబాబా దగ్గరకు వెళ్లాడుట. సాయబాబా రెండు జీడిగింజల్ని నూరి ముద్దగా చేసి కంటిపై పెట్టికట్టుకట్టి వెళ్లి రేపు వచ్చి కనిపించమన్నారు అతణ్ణి. ఆ భక్తుడు ఆనందంగా వెళ్లాడట. యథావిధిగా మరునాడు ఆ భక్తుడు వచ్చాడు. ఆ కంటి ఉన్న కట్టును విప్పి ధారాపాతంగా నీళ్లను పోశారు. అంతే కలక అంతా పోయింది. కళ్లు నిర్మలంగా కనిపించాయి. ఇది బాబాకంటి వైద్యం. సాధారణ వైద్యులైతే కంటి ఆపరేషను అని ఇంకా ఎనె్నన్నో మందులు మాకులు ఇస్తారు. బాబా అనుకొంటే ఆ జబ్బుకు మందు వేయకుండానే తగ్గిపోతుంది. నమ్మకమే మందు అని చెప్పడానికి గాను బాబా ఇట్లాంటి వైద్యాలు చేసేవారు అన్న అంతరార్థాన్ని ఆ భక్తులు అర్థంచేసుకొని బాబా పై అచంచలమైన నమ్మకాన్ని పెంచుకునేవారు. ఇదే విషయం బాబా ఎందరికో చేసిన వైద్యాన్ని పరిశీలించినపుడు మనకు అర్థం అవుతుంది.
మరోసారి సాయి భక్తుడైన బూటీకి కలరా వచ్చింది. బూటీ మంచి ధనవంతుడు అతడికి వైద్యమేమీ కష్టమేమీ కాదు. కాని అతనికి సాయ పై ఉన్న భక్తి నమ్మకం వల్ల అతడు సాయబాబా దగ్గరకు వచ్చి తనకు వైద్యం చేయమనిప్రార్థించాడు. సాయి ‘బాదంపప్పు, పిస్తా, ఆక్రోటులూ నానబెట్టి పాలూ పంచదారతో ఉడికించి నీవు తీసుకో నీ కలరా పోతుంది’ అని సలహా ఇచ్చారు. బూటీ అలానే చేసాడు. కాని వైద్యులంతా దాన్ని చూచి కళ్లు తేలేశారట
ఓ సారి బాలాగణపతి షింఫీ అనునతను చాలాకాలంనుండి మలేరియా జబ్బుతో చాలా బాధలు పడుతున్నాడు. ఈ బాధలకు కారణం పూర్వజన్మ పాపమే ననుకొన్నాడు. ఈ జబ్బును దూరం చేసుకోవాలంటే భగవంతుని శరణు ఒక్కటే మార్గమని నమ్మాడు. ఆ సమయంలో శిరిడిలో ఉన్న బాబా గురించి ఎవరో ఇతనికి చెప్పారు. ఆ బాలగణపతి వెంటనే శిరిడీ ప్రయాణం కట్టాడు. బాబాను దర్శించుకుని ‘‘బాబా నన్ను పట్టుకున్న ఈ మలేరియాను దూరం చేయి’’ అని వేడుకొన్నాడు. బాబా ‘‘దీనికి ఇంత ప్రయాస ఎందుకులక్ష్మీదేవి గుడి దగ్గర వున్న నల్లకుక్కకు పెరుగన్నం పెట్టు నీకు జబ్బు ఉండదు’’ అన్నారు. అంతే ఆ భక్తుడు పరుగెత్తుకుంటూ వెళ్లి నల్లకుక్కకు పెరగన్నం పెట్టాడు. అప్పటివరకు బాధించిన మలేరియా మాడి మసైపోయింది.
సాయభక్తులు అగ్రగణ్యుడు బాలక్‌రాం దురంధర్ అనువాడొకడు. ఆయన ఆరేళ్లనుంచి ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. కాని ఎపుడూ బాబా తన రోగం తగ్గించమని చెప్పేవాడు కాదు. ఈయన రోగాలను తగ్గించమని బాబాకు చెప్పటం ఎందుకు? సర్వం తానే అయనవారికి సర్వం తెలిసిన వారికి నాగురించి వేరుగా చెప్పాల్సిన అవసరం ఏముంటుంది అని తన్ను బాబా దగ్గరకు వెళ్లి మందు తెచ్చుకోండి అన్నవాళ్లతో అనేవాడు.
ఒకసారి ఎప్పటిలా బాబా దర్శనానికి బాలక్‌రాం వెళ్లాడు. బాబా దర్శనం చేసుకొని తాను బాబా సేవ చేస్తే చాలు తనకు రోగం పోతుందనుకొన్నాడు. అక్కడొక వింత జరిగింది. బాబా బాలక్‌రాం ను దగ్గరకు పిలిచి తానుపీల్చుకొనే చిలుం ఇచ్చి దాన్ని పీల్చమని చెప్పాడు. బాలక్ రాంకు చిలుం పీల్చడంరాదు కాని బాబా చెప్పాడని ఆ పని చేసాడట. కాని ఆశ్చర్యంగా బాలక్‌రాంను అప్పటివరకు వేధించిన ఉబ్బసం పారిపోయందట.
భవరోగాలను బాపే భగవంతుడికి ఈలౌకిక దుఃఖాలు, రోగాలు దూరం చేయడం కష్టం కాదుగదా. పూర్వ జన్మసంస్కారం వల్ల రోగాలు కలిగినా, దుఃఖం ఆవరించినా, కష్టాలు వచ్చినా అచంచలమైన నమ్మకంతో భగవంతుని పూజిస్తే చాలు దుఃఖం దూరమవుతాయ. సాటివారికి చేతనైనంత దానం చేయాలి. వారికి వలసిన సాయం నిరాపేక్షగా అందించాలి. ఇదంతా భగవంతుడే తన చేత చేయస్తున్నాడన్న నమ్మకంతో ఉండాలి. ఎక్కడా కూడా నేనే చేస్తున్నాననే అహంకారాన్ని పొటమరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లా పనులు చేసేవారికి భగవంతుడే తోడునీడగా ఉంటాడు.

- ఎ. రాజమల్లమ్మ