మంచి మాట

వినయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినయానికి, భక్త్భివనకు సంకేతం వందనం. పరిచయస్తులు తారసపడినప్పుడు వాళ్లకి మనం రెండు చేతులు జోడించి నమస్కరిస్తాం. అది మన సంప్రదాయం. అంతమాత్రాన వారికంటే మనం తక్కువ అన్న భావన కాదు. అందుకు ఆస్కారం ఉండకూడదనే అవతల వ్యక్తి కూడా ప్రతి నమస్కారం చేస్తాడు. అలా చేయడం సభ్యత అనిపించుకుంటుంది. ఇక్కడ నమస్కారమన్నది ఆత్మీయతతో కూడిన పలకరింపు మాత్రమే.
దైవాన్ని రెండు చేతులు జోడించి ధ్యానిస్తాం. అది మన భక్త్భివనను తెలియజేస్తుంది. అయితే కంటికి కనిపించని ఆ దేవుడు తిరిగి మనకు దణ్ణం పెట్టడు. దీవెనలను అందిస్తాడు. అలాగే పెద్దల్ని, గురువుల్ని, తల్లిదండ్రుల్ని నమస్కరించేటప్పుడు వాళ్లు మనకి ఆశీస్సులు అందజేస్తారే తప్ప తిరిగి దణ్ణం పెట్టరు. వాళ్లకు దణ్ణం పెట్టడమన్నది మనం వారిపట్ల కనపరిచే వినయవిధేయతలే. మనకు మంచేదో, చెడేదో వివరించి చెప్పేవారు, విద్యాబుద్ధులు నేర్పించేవారు, జన్మనిచ్చిన వారు దైవంతో సమానం. అందువల్ల వారినుంచి ప్రతి నమస్కారాన్ని ఆశించం.
ఇక అధికారిపట్ల తమ వినయ విధేయతల్ని చాటుకోవడానికి అతడి కింద పనిచేసే సిబ్బంది చేతులెత్తి నమస్కరించడం సర్వసాధారణం. అందుకు ప్రతిగా తను కూడా వాళ్ళకి చేతులు జోడించి నమస్కరించడం సంస్కారమనిపించుకుంటుంది.
పదవుల్లో ఉన్నవారిని, శ్రీమంతుల్ని ప్రసన్నం చేసుకుని తమ పనులు చక్కబెట్టుకోవడం కోసం కొందరు రెండు చేతులు జోడించి వంగి వంగి సలామ్ కొడుతూ అతివినయం ప్రదర్శిస్తుంటారు. అయితే అవి వంక దండాలని అంటారు. దీనివల్ల వారి పని సులువు అవుతుందని వారు నమ్ముతారు. పొగడ్తలకు పొంగిపోయ పనిచేసేవారు వారిని పొగడనప్పుడు చేయరు కనుక నిజమే నాలుగు కాలాలపాటుఉంటుందికాని పొగడ్త ఉండదు. లేని గొప్పతనాన్ని అపాదించి పొగడేవాళ్లకు ఎపుడైనా దూరంగా ఉంటేనే మంచిది. లేకపోతే అది ఒకనాడు గోతిలో పడవేస్తుంది.లేనిదాన్ని ఉన్నట్టుగా భ్రమించి బతకడం అనేది కొంతకాలం బాగుంటుంది కాని అది తరువాత దుఃఖానికి చేరువ చేస్తుంది. కీడు కలుగజేసేది కాని కీర్తినిచ్చేది కాదు. కనుక నిజమే మాట్లాడాలి. సత్యంతో పనులను చక్కబెట్టుకోవాలి. ఇంకొందరైతే పెద్దలను కలిసేటప్పుడు వారికి ఒంటి చేత్తో దణ్ణం పెడుతుంటారు. అది పాశ్చాత్య సంప్రదాయం. వాళ్లు ఒకరినొకరు కలిసినప్పుడు చేయి ఎత్తి గుడ్‌మార్నింగ్ అనిగాని, చేతులు కలపడం గాని చేస్తుంటారు. వాటిని మనం గుడ్డిగా అనుకరించడం శోచనీయం. ఎవరి ఆచార వ్యవహారాలు వారికుంటాయి కదా! వాళ్లలాగే మనం కూడా వ్యవహరించాలనుకోవడం అవివేకమే అవుతుంది.
రెండు చేతులు జోడించి వినయంగా నమస్కరించినప్పుడు ఒక వ్యక్తి మరో వ్యక్తికి దణ్ణం పెట్టడమంటే అవతల వ్యక్తిలో ఉన్న పరమాత్మకి దణ్ణం పెడుతున్నామని అనుకోవాలే గాని తనకి మనం నమస్కరించడమేంటి? అతగాడేమైనా దేవుడా? మహాత్ముడా? ఎందుకు నమస్కారం చెయ్యాలి అని అనుకోకూడదు. ఎందుకంటే జీవాత్మ ప్రతిబింబమే పరమాత్మ. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడెవడూ అలాంటి వికృత ఆలోచనలు చేయడు. మనం ఒకరినొకరం గౌరవించుకోవడం మానవధర్మం. ఈ ధర్మం వల్ల మానవ సంబంధాలు బలోపేతం అవుతాయ. అభిమానాలు పెరుగుతాయ. కక్షలు కార్పణ్యాలు దూరమవుతాయ.
చిన్నవారికి దీవనెలందించడం, పెద్దవారిని గౌరవించడం అనే భారతీయ సంప్రదాయం ఎన్నో విలువలను నిగూఢమైన అర్థాలను పొందుపరచబడి ఉన్నాయ. ఒకరకమైన ఆత్మనూన్యతలోబాధపడేవారిలో గౌరవించబడకపోవడం కూడా ఒక కారణమే. ఆత్మాభిమానాన్ని దురభిమానంగా మార్చుకున్నవారిలో కూడా అతిగా గౌరవించడం అనేది వారిలో దురభిమానంగా మారడానికి ఆస్కారం కూడ ఉందనిపిస్తుంది . కనుక ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు కదా. అందుకని విలువ తెలిసి మసులుకుంటే అందరికీ ఆనందం వస్తుంది.

-దూరి వెంకటరావు