మంచి మాట

శాస్తమ్రే ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ,
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి’(్భ.గీత 16-24)
కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుటకు శాస్తమ్రే ప్రమాణం. కావున శాస్త్రోక్త కర్మలను గూర్చి పూర్తిగా తెలుసుకొని వాటిని ఆచరించాలని శ్రీకృష్ణుని ప్రబోధం.
జీవితాన్ని సమర్ధతతో మల్చుకొని మనగలిగే విధానాన్ని తెలుపుతుంది శాస్త్రం. అజ్ఞానాన్ని పారద్రోలి మానవులకు జ్ఞానాన్నందించేదే శాస్త్రం. వేదోపనిషత్తులు, భగవద్గీత, అష్టాదశ పురాణాలు, రామాయణ మహాభారతాది గ్రంథాలు, నీతి ధర్మశాస్త్రాదులు, శాస్తమ్రులనబడతాయి. ఉత్తములు దేనిని ఆచరిస్తారో, లోకంలో మానవులంతా దానినే అనుసరిస్తారని, వారు దేనిని ప్రమాణంగా భావిస్తారో, దానినే ప్రమాణంగా స్వీకరిస్తారన్న గీతాసందేశం ద్వారా అన్ని కర్మల విధానాలకు, సమస్యల పరిష్కారానికి శాస్తమ్రే ఆధారమని ప్రామాణికమని తెలియజేయబడుతుంది.
జీవుడు శాస్తజ్ఞ్రానంతో, ఆత్మజ్ఞానాన్ని పొంది మాయలోంచి బయటపడి, ముక్తిమార్గాన్ని అనే్వషించ గలిగిన వాడవుతాడని మహర్షులమాట. అట్టివాడు సుఖ దుఃఖాది ద్వంద్వములను దాటి, కోరికలను త్యజించి, ప్రాపంచిక విషయాలయందాసక్తిని విడనాడి, నిరంతరం ఆత్మస్థితియందుండే సాధనలో లీనమయేటందుకు తోడ్పడునదే శాస్తమ్రని పెద్దలంటారు.
తల్లి-తండ్రి, గురువు, అతిథి, జ్ఞాని, వయోవృద్ధులు మున్నగువారిని గౌరవించాలని అలాగే రోగగ్రస్థులు, వికలాంగులు, దీనులు, దుఃఖితులు, అభాగ్యులు, అనాథలు నిస్సహాయులు, నిర్బలులు మున్నగువారిని ఆదరించి సేవలందించాలని అప్పుడే జన్మకు సార్థకత చేకూరునని శాస్తవ్రచనం. సత్యం, అహింస, ప్రేమ, శాంతి, రుూ నాలుగూ మానవతా విలువలను మప్పుతాయని, ఏ మతం వారైనాసరే, రుూ గుణాలను కలిగియున్నప్పుడే మనిషి, మనీషిగా రూపొందుతాడని, తాను స్వేచ్ఛగాజీవిస్తూ ఇతరులనుకూడా స్వేచ్ఛగా బ్రతకనివ్వాలనే, సదాశయంతో సాగాలన్నదే శాస్త్ర సందేశం.
లోకంలో మానవ ధర్మం, పితృధర్మం, పుత్రధర్మం, గురుధర్మం, శిష్య ధర్మం, రాజధర్మం, పౌర ధర్మం, స్నేహధర్మం, వైవాహిక ధర్మం ఇలా ఎన్నో ధర్మాలు ఆయా వ్యక్తులద్వారా సదా ఆచరింపబడాలని అలా ఆచరింపబడితేనే, ‘సర్వేజనా సుఖినోభవన్తు’అనే వేద సూక్తి సాధ్యవౌతుందని, ఇలపై స్వర్గం దిగి వస్తుందని నిత్యం ప్రతి వ్యక్తీ ఎవరికివారుగా తమతమ విద్యుక్త ధర్మాలను నిర్వహించాలని, అలక్ష్యింపరాదని అప్పుడే రుూ లోకమనే బృందావనం మూడు పూవులారుకాయలుగా వర్ధిల్లునని శాస్త్రం నిర్వచిస్తోంది. మనిషి స్వశక్తిపై ఆధారపడి జీవించాలి గాని ఎవరిపైనో ఆధారపడటం, ఎవరి సహాయంకోసమో చేతులుచాచి నిరీక్షించడం వంటి చర్యలు, సమర్ధనీయం కాదని మనిషి సదాచైతన్యశీలుడు కావాలని శాస్త్రం హెచ్చరిస్తోంది.
ప్రతి మనిషీ, తనకుతానుగా చేయు తన విద్యుక్తకర్మలను, వివేకంతో ఆలోచించి విధిగా నిత్యం ఆచరించాలని, అది వాని ధర్మమని, కర్తవ్యమని శాస్త్రం సూచిస్తోంది. సర్వజీవులను తనయందును, తనను సర్వప్రాణులందును ఆత్మస్వరూపుడై దర్శించగలగాలని, అందుకు వలయు సాధనతో బ్రహ్మైక్యస్థితిని గాంచాలని, అదే ముక్తిమార్గానికి మూలమని శాస్త్ర ప్రబోధం.
సత్కర్మలు పవిత్రములేకాక మనలను కాపాడునని, దుష్కర్మలు శాస్త్ర నిషిద్ధములని అవి పాపాలకు పుట్టినిళ్ళని, వాటిని సర్వదా విడిచిపెట్టాలని శాస్త్రం ఆదేశిస్తోంది. మంచిసంకల్పం, మంచి పని, మంచి మాట-ఇవే మానవ జీవితానికి మూలమని చెబుతూ మనిషిగా పుట్టినందుకు మానవీయ విలువలకే పాటుపడాలని, దైవం మనలోనే ఉన్నాడన్న సత్యాన్ని అనే్వషించగలగాలని పురుషార్థసాధన ద్వారా శాంతిమార్గాన్ని యోగమయ జీవనాన్ని స్వాగతించాలి.

- చెళ్ళపిళ్ళ సన్యాసిరావు