మంచి మాట

సత్యశోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓర్పుకు, సహనానికి మారుపేరు పుడమితల్లి. సకల దేవతల నిలయమైన గోమాత. మానవుల ఆరోగ్యాలకు పుష్టికి తుష్టికి మార్గం గోమాత. త్యాగానికి ప్రతిరూపంగా నిలిచి మానవాళికే కాక కోటానుకోట్ల జీవరాశికి ఆశ్రయం, ఆహారం, భద్రత కల్పించే తల్లి చెట్టుతల్లి. సర్వజీవుల దాహార్తి తీర్చే పునీతమైన మనస్సు, సవిశాలమైన హృదయంతో నిత్యమూ విరాజిల్లే పవిత్రనొందినది నదీమ తల్లి- ఈ నలుగురు తల్లుల త్యాగాలవల్లే ‘లోకాస్సమస్తా సుఖినోభవంతు’ అనే ఆర్యోక్తి నిలబడింది.
ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా పైకి కథల్లా కనిపించినా వాటిల్లో ఎన్నో సంకేతార్థాలు ఉన్నాయని పెద్దలు అంటారు.
గోక్షీరం, గోమూత్రం, గోమయం... ఇలా గోమాత నుంచి వచ్చేప్రతి పదార్థమూ ఎన్నో ఔషధీ గుణాలను కలిగియుండి ప్రాణాంతక వ్యాధులను సైతం దూరం చేసి ప్రాణులను కాపాడగలిగే అద్భుత శక్తిని తమలో ఇముడ్చుకుని ఉంది. అందుకే గోమాతను దానం చేసినా, గోపూజ చేసినాఎన్నోవేల సంవత్సరాలు స్వర్గం లభిస్తుందన్నమాటలో ని అంతరార్థం.
చెట్టు చనిపోయనా ఇతరులకు ఉపయోగపడుతుంది. ఇక బతికి ఉంటే ప్రాణవాయువునిచ్చే ఆ కల్పవృక్షం గురించే ఎంతచెప్పినా తక్కువే కదా. అట్లానే ఈ పుడమి - రామాయణంలో జానకి తల్లి భూదేవి. ఈ తల్లి సుగుణాలన్నీ పుక్కిట పట్టినఇల్లాలు జానకి. నారీశిరోమణి. నారీలోకమే కాదు నరలోకం అంతా ఈ తల్లిని కీర్తిస్తుంది. ఈ తల్లి సౌహార్థానికి మారుపేరు. ఈతల్లి నాగేటి చాలులో దొరికిందంటుంది రామాయణం. అపార నిధినిక్షేపాలు ఖనిజసంపదరూపంలో ఉన్నా యని తెలుపుతుందీఘట్టం. ఆ సంపద మిమ్ములను ప్రపంచంలో సాటిలేని మేటి వీరులుగా తయారు చేస్తుందనీ తెలుస్తుంది. కొమ్మలు నింగిని తాకేటట్లుగా సువిశాలంగా విస్తరించిన ఎంతటి గొప్ప వట వృక్షమైనా పుడమి తల్లి యొక్క పవిత్ర గర్భం నుండే తన జన్మ ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది ఒక్క చెట్లకే కాదు జలాశయాలకు, మానవులకు కన్నతల్లి పుడమినే. ఒక్క పృధ్వి లేకపోతే మిగతా వాటి ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. చెట్లు లేకపోతే మానవాళి మనుగడేకాదు ఫృధ్వీతలం కూడా సంతులనం కోల్పోతుంది.
ఇలా ఒకదానికొకటి పరస్పరపూరకాలుగా వీటిని చేసిన ఘనత మాత్రం ఒక్క పరమాత్మకే. అన్నింటికీ ఆధారం అన్నింటికీ కారణం మాత్రం పరమాత్మనే. విభిన్న రకాలకు చెందిన మొత్తం జంతుజాతి అంతాకూడా ఒకదానితో ఒకటి పరస్పర ప్రేరకాలుగా పూరకాలుగానే ఉన్నాయ. ఎవరికి వారికి గొప్పతనం ఉండేటట్టుగాను, ఆ గొప్పతనానికి వారుకారకులు కాదనే సత్యాన్ని చెప్పేవిధంగా సమకూర్చిన పరమాత్మ ఘనత ఇంతింత చెప్పనలవికాదు. అందుకే ఆయన ఉనికి నిముషాల్లో విస్తరించేదిగాను, మరోనిముషంలో ఉనికినేలేదా అనిపించేట్టుగా ను చేయగల శక్తిసంపన్నతను చాటడానికే వామనరూపం బలిచక్రవర్తి కథ మనకు గోచరిస్తాయ.
బుద్ధిజ్ఞానాలను ప్రసాదించిన పరమాత్మ విచక్షణనిచ్చి అటు జంతువులకు కాని, ఇటు దేవతలకు కాని లేని పుణ్యపాపసంచయాన్ని పెంచుకునే సౌలభ్యాన్ని మానవునికిచ్చాడు. ఆ సౌలభ్యంతో మానవుల్లో ధ్రువుడు, మార్కండేయుడు లాంటివారు ఉన్నతపథంలో నిలబడితే రావణుడు, నరకుడు లాంటి వారు తమ నాశనమే కాక తమ చుట్టు ఉండేవారి నాశనానికి కూడా కారణభూతులు అయ్యారు. వీరిని దృష్టిలో పెట్టుకుని ఆధునిక ప్రపంచంలో రాకెట్ వేగంతో ముందుకు దూసుకుపోతున్న మనిషి తిరిగి చూసుకోవాలని, తనవల్ల ఎవరికైనా లాభం కలుగుతోందో లేదో లేక ఎవరికైనా నష్టం కలుగుతున్నదో చూచుకోవాలని అన్ని ఇతిహాసాలు, పురాణాలు చెబుతున్నాయ.
సత్యశోధన చేసుకుంటూ తన్ను తాను పరిశీలించుకుంటూ ముందుకు పోతే మానవుడే మహనీయుడు అవుతాడు. సార్వకాలీన, సార్వజనీనతను, వసుధైక కుటుంబ భావనను, జాతీయ సమైక్యతా సదాలోచననుప్రోదిచేసే ఈ ప్రకృతి అంతా మానవునిలోని ఐక్యత బలమెంతోచెప్పక చెబుతుంది. కనుక అన్నింటినీ అవలోకించి అర్థం చేసుకొంటూ ఐక్యతతో పరోపకారం చేయాలని ఉద్బోధిస్తుంది ప్రకృతి. దాన్ని గ్రహించి మనమూ త్యాగజీవనం గడుపుదాం.

- చోడిశెట్టిశ్రీనివాసరావు