మంచి మాట

పార్వతీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్మితి నా మనంబున సనాతనులైన .... అంటూ పోతన ఆంధ్ర మహా భాగవతములో రుక్మిణీ కల్యాణ ఘట్టంలో శ్రీ కృష్ణుడిని తన పతిగా చేయమని పార్వతీదేవిని ప్రార్ధిస్తుంది రుక్మిణీదేవి. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు. శివుడిని పురుషుడిగా, పార్వతీదేవి ప్రకృతిగా పురాణాలు వివరించాయి. దాంపత్య ధర్మానికి మూల పురాణ దేవతలు వారు. ఆలు మగలకు కొండంత గుర్తు. అర్ధనారీశ్వర రూపం. పురుషుని జీవిత భాగంలో స్ర్తి అంతర్భాగమని, ఆకాశంలో సగమని శరీరములో సగభాగమని శంకరుని జీవితము ద్వార మనం తెలుసుకోవచ్చు.
పార్వతి..ఆదిపరాశక్తి...హిమవంతుడు, మైనాదేవిల కుమార్తె పార్వతి. పర్వతరాజ పుత్రిక కనుక పార్వతి అని పిలుస్తారు. శైలజ, అద్రిజ, నగజ, శైలిపుత్రిక, హైమవతి, గిరిజాపుత్రి, గిరిజ అని పలు పేర్లు గలవు. ఆమెకు అనేక నామాలు గలవు. ఉమ, అంబిక, అపర్ణ, శాంభవి, మాత,దుర్గ, భవాని, శివాని, శివరాజ్ఞి, కామాక్షి, గౌరీ, కాళి, శ్యామల, చండీ అను పేర్లు గలవు. శివపురాణంలో ‘సతీ ఖండం’ గలదు. దక్షుని కుమార్తె సతీదేవి. పరమేశ్వరుని గుణగణములు తెలిసినదై తండికి అంతగా ఇష్టంలేకున్నా శివుణ్ణి వివాహమాడింది. సకల సుఖాలను తృణప్రాయంగా వదిలి పతియే దైవముగా కాపురం చేసింది. మంచుకొండలలో, ఆకాశం కప్పుగా కైలాసము నివాసంగా, నంది, భృంగి వంటి గణాలు సేవించుచుండగా నిరాడంబరియై, ఆత్మసంతృప్తితో భర్తననుసరించింది. కోరుకుంటే పుట్టినింటివారు అపూర్వ ధనరాశులు గలవారు, హంసతల్ప తూలికలు, వజ్ర మణి మాణిక్యాదులు, పట్టు పీతాంబరాలు, సేవలు చేసే దాసీ జనం, షడ్రషోపేత ఆహారములు, సేవకులు, పరిచారకులు, సకల సుఖాలు ఆమె కాలిదగ్గర నిలుస్తాయి.
అయినను కోరి వరించిన మహా శివుణ్ణి అతని నిరాడంబరతను, విబూది యోగమును, భక్తిమార్గమును అనుసరించి శంకరుని కొలిచిన మహా ఇల్లాలు-విఘ్నేశ్వర, కుమారస్వామిలు తన సంతానము. ప్రేమానురాగాలు పంచిన అమృతమూర్తి.ఆడంబరాలకు, అట్టహాసాలకు పోని ఇల్లాలు. జటాఝూటములు, మూడు కన్నులు, భస్మాంగ నేత్రుడు, కరిచర్మాంబరుడు, కరుణాంతరంగుడు బోళాశంకరుని నమ్మింది-నందిని వాహనంగా లోకాలను పాలించే శివుడే తన ఆరాధ్య దైవం.
దక్షుడు అహంకారపూరితుడై నిరీశ్వరయాగం చేయసంకల్పించి పలువురు బంధుమిత్ర, పరివారములను సకల దేవతలను బ్రహ్మ, విష్ణు మూల పురుషులను పిలిచి, శంకరుడికి కావాలనే ఆహ్వానించక అవమానించాడు. లోకలా చెప్పుకునేట్టు యజ్ఞమును అలంకరించి పెద్ద ఎత్తున ప్రారంభించాడు. సహజమగు కుతూహలముతో పిలవని పేరంటానికి వెళ్లి తండ్రిచే భర్తను దూషించబడి అవమానాన్ని భరించలేక దేహత్యాగం చేసింది.
భార్య వియోగం పరమశివుని కలిచివేయగా దక్షయజ్ఞ విధ్వంసం కావించాడు. వేలాది గణాలు ద క్షుని నగరంపై బడి భయంకరముగ పోరాడారు. వచ్చిన బంధువులు, మునులు, ఋషులు భయంతో పారిపోయిరి. యాగభగ్నమయ్యాడు. అపుడే శంకరుడు దక్షుని సంహరించాడు. దక్షుని భార్య శివభక్తురాలు. ఆమె ప్రార్ధనతో అతడిని తిరిగి పునర్జీవితుడినిచేశారు. ఈసారి మేక తలను ధరింపచేశారు. దక్షుని అహం అంతరించింది. కాని సతీదేవి దేహం విడిచింది. తిరిగి సనాతునురాలైన పార్వతి హిమవంతుని కుమార్తెగా జన్మించింది. భార్యావియోగ పరమశివుని హృదయం తీవ్ర దుఃఖంలో మునిగి నిరాసక్తుడైయున్నాడు. తపస్సులో మునిగిపోయాడు. త్రిమూర్తులలో ఒకడు త్రినేత్రుడగు పరమేశ్వరుని సంతృప్తికై దేవతలు పార్వతీ కల్యాణమునకు శ్రీకారం చుట్టిరి. పరమశివుని తపమునుండి బయటకు తీసుకు రావడానికై మన్మధుని ప్రేరేపించారు. కాముడు తన సుమశరములతో శివుని నొప్పించి పరమేష్టి తీవ్ర కోపానికి గురైనాడు. ఫలితంగా బూడిదగా మారి అనంగుడయ్యాడు. రతీ మన్మథులు బ్రహ్మదేవుని ఆనతితో ప్రజల హృదయాలలో భార్యభర్తల నడుమ సృష్టి కార్యమును జరుపు మూల కారణములైనారు. పార్వతీదేవి శివుని కల్యాణముతో లోకములు సుఖములు పొందారు. పార్వతీపరమేశ్వర్లు మానవులకు, దేవతలకు, రాక్షసులకు ఆరాధ్య దైవాలు. ఎవరు ఏ రూపంతో కొలిస్తే ఆరూపంలో పరమేశ్వరుడు పూజలందుకుంటాడు.

-లక్కరాజు శ్రీనివాసరావు