మంచి మాట

రామసేవకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేవక శబ్దం వినగానే లక్ష్మణ ఆంజనేయులే మనసులో మెదులుతారు. లక్ష్మణుడు రామానుజుడు. అతనికి అన్నపై అపారమైన గౌరవం ఉంది. తోబుట్టువు కనుక ఆ ప్రేమ భాత్రు ప్రేమగా మనం చెప్పుకోవచ్చు. అసలు రామలక్ష్మణ భరత శత్రుఘ్నలు నలుగురికీ ఒకరంటే మరొకరికి అభిమానం ఉంది. అందులో రామలక్ష్మణులు ఒక శ్వాసగా పెరిగారు. వారిద్దరూ శరీరాలు వేరైనా ఆత్మఒక్కటే నన్నట్లుగా అన్ని పరిస్థితుల్లో ఉన్నారు. రామునికి కోపం వస్తే లక్ష్మణుడు చల్లబరిచారు. లక్ష్మణుడు ఆవేశం తెచ్చుకుంటే రాముడు ఓదార్చాడు. వినయవివేకాలతో ఇద్దరూ ఎదుటివారికి న్యాయం చేశారు. ఉపకారం చేశారు కాని ఇద్దరిలో ఎవరూ తమ కోసం స్వార్థంగా ఆలోచించలేదు.
శ్రీరామ చరణ సేవా భాగ్యమే తప్ప అన్యమాసించని మనసు లక్ష్మణునిది! రామసేవే ధర్మం, కర్తవ్యంగా ఎంచిన నిష్ఠాగరిష్ఠుడు ఆ లక్ష్మన్న.ప్రేమ, ధీశక్తి, నిష్కపటత్వము, సోదర ప్రేమ, మంచి సలహాలివ్వగల శక్తి, ఆజ్ఞాపాలన, మైత్రీభావం, తేజస్సు వంటి విలక్షణ గుణ సమన్వితుడు లక్ష్మణుడు. ఆదర్శపాత్రుడు!!
కాని ఆంజనేయుడు వీరిద్దరూ సీతమ్మ అనే్వషణలో ఉన్నప్పుడు పంపానదీ తీరాన కనిపించాడు. వీరిని అనుమానించి సుగ్రీవుడు అసలు వచ్చే వారెవరో కనుక్కుని రమ్మని అంటే ఆంజనేయుడు రామ లక్ష్మణుల దగ్గరకు వచ్చాడు. రాముని చూచి చూడగానే తాను మారువేషంలో వచ్చినా సుస్వరంతో తాను ఎవరో నిజం పలికాడు. వచ్చిన వారెవరో తెలుసుకోవాలన్న ఉత్సుకతను ప్రదర్శించాడు. రాముడు కూడా ఆంజనేయుని భాషాసౌందర్యాన్ని అతని వ్యక్తిత్వాన్ని చూడగానే మారుతి పట్ల ఆకర్షితుడయ్యాడు. నాటి నుంచి నేటి దాకా ఆంజనేయుడు రాముని కింకరునిగానే మనకు ప్రత్యక్షమవుతాడు.
అడవుల్లో తిరుగుతూ దూరమైన సీతమ్మను తలుచుకుని దుఃఖభాజనుడయ్యే పరిస్థితుల్లోను ఆంజనేయుడు రాముని కింకరుడే. రాముడు పట్ట్భాషేకం చేసుకొని మహారాజైనా, మారుతి రామాంజనేయుడే. అంతేకాదు రావణాసురుని శక్త్యాయుధంతో లక్ష్మణుని మూర్ఛనొందినపుడు రాముడు ఆర్తిగా విలపిస్తుంటే ఆంజనేయుడు నీ సేవకుడను నేను ఉన్నానంటూ చిటికలో సంజీవనీ తెచ్చి లక్ష్మణుని సేద తీరుస్తానని బయలు దేరాడు. తనకు సంజీవరణి గుర్తు తెలియకపోతే ఆ పర్వతానే్న పెకిలించుకుని వచ్చి తాను ఎంతటి రామభక్తుడో తెలియచేశాడు ఆంజనేయుడు. అటువంటి ఆంజనేయుడు భూతపిశాచాదులను తరిమికొట్టడంలో అగ్రేసరుడు. గ్రహపీడలు తొలగించడంలో, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయనవారిలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని రగిల్చి వారిని చైతన్యవంతులను చేయడంలోను ప్రథమ శ్రేణిలో ఉన్నవాడే.
రాముడు పదకొండు వేల సంవత్సరాలు సుభిక్షంగా పాలన సాగించాడంటే దానికి కారకులల్లో లక్ష్మణ ఆంజనేయులు మొదటి వరుసలో ఉంటారు. తన పాలనలో సీతమ్మను అనుమానించిన వారు ఉన్నారని తెలుసుకొని గర్భవతి యైన సీతమ్మను అడవులకి పంపించినపుడు, ఆ సీతమ్మ వ్యాసుల వారి ఆశ్రమం చేరి అక్కడ జీవితాన్ని గడుపుతూ లవకుశలకు జన్మనిచ్చి వారిని పరాక్రమవంతులుగా చేసి రాముని కోసం ఎదురు చూస్తున్న సమయంలోను ఆంజనేయుడు సీతారాముల మధ్య సయోధ్యకు వారధిగానే నిలిచాడు. కాని ఆ తల్లి పరమార్థమెరిగిన జగన్మాత కనుక ఆ తల్లి భూదేవి కౌగిట చేరింది. రాముడు ఒంటరి వానిగానే రాజ్యపాలన సాగించాడు. అపుడూ లక్ష్మణ ఆంజనేయులే రామునికి బాసటగా నిలిచారు. ఇంతటి కైంకర్యాన్ని చేసిన ఆంజనేయుని సదా మనసున స్మరిస్తూంటే రామానుగ్రహం తప్పక దొరుకుతుంది. ఆంజనేయుడు మన ఫాలభాగంలో నిలిచి కష్టాలను కడుదూరంనుంచి నెట్టివేస్తాడు. కనుకనే అందరూ రాముణ్ణి ఎంతగా ఆరాధిస్తారో ఆంజనేయుణ్ణీ అంతగా ఆరాధిస్తారు. శ్రవణం, మననం, సఖ్యం, దాస్యం, వందనం, అర్చనం, ఆత్మనివేదనం, సేవనం (దాస్యం) సంకీర్తనం వీటిల్లో దాస్యమనగా సేవించుటయని బాహ్యార్థము. తమ ధన, మానప్రాణములు తనవికావని తత్పరతతో సేవించుట అనునది దాస్యమునకు ప్రధానమైంది. అట్టి దాస్యమను పదమునకు ఆద్యుడు ఆంజనేయస్వామి కనుకనే దాసాంజనేయునిగా ఆంజనేయుని కీర్తి అజరామరంగా నిలిచిఉంది.

- చివుకుల రామమోహన్