మంచి మాట

కార్తిక విశిష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివకేశవలకిద్దరికీ ప్రాణప్రదమైన మాసం కార్తికం. ఇటు కేశవుడికి సన్నజాజిపూదండలతో అర్చనాదులను చేస్తారు. అటు శివునికి జిల్లేడు మారేళ్లతో పూజ చేస్తారు. శివుడు అభిషేకప్రియుడని నిత్యాభిషేకాలు చేస్తుంటారు. ఈ పవిత్ర మాసం స్నానమునకు- దీపమునకు- దానాలకు ప్రసిద్ధియైనది. దీపదానం చేసినవారికి శివకేశవులిద్దరూ పుణ్యరాశులను అనుగ్రహిస్తారు. ఆహ్లాదకరమైన ఈ శరదృతువులో చంద్రుడు పుష్టి కలిగి తన చల్లని కిరణముల ద్వారా సమస్త జీవులకు ధీశక్తిని అందిస్తాడు.
శివకేశవుల నామోచ్చారణకు కూడా ఈ మాసం ప్రసిద్ధి చెందింది. ప్రణవ మంత్రమైన ఓమ్ కారం మంత్రాలన్నిటిలోకి ఉత్కృష్టమైంది. శబ్దబ్రహ్మమే ఓంకారం. అన్ని మంత్రాలకు పుష్ఠినిచ్చేది ఈ ఓంకారమే. మంత్రసాధనలో దేవతకు ప్రముఖ స్థానం ఉంది. ప్రతిమంత్రానికి ఒక దేవత ఉంటుంది. మంత్రసాఫల్యం ఆ దేవత వశమై ఉంటుంది. జపించే సమయంలో ధ్వని ప్రకంపనాలు ఆకాశంలోని అణువులను సైతం చీల్చుకొని తమ శక్తి కేంద్ర దేవతను చేరుకుంటాయి. ఉపాసకునికి శారీరక మానసిక లాభాలతో పాటు ప్రగతి మార్గంలో పయనించడానికి హేతువు అవుతాయి ఈ మంత్రాలు. ఈ మాసంలో ఓమ్‌నమఃశివాయ అన్న మంత్రాన్ని పఠిస్తే చాలు ఎన్నో జన్మల పాపరాశిని శివుడు దగ్ధం చేస్తాడు. శివ సాయుజ్యాన్ని సైతం అనుగ్రహిస్తాడు. కనుకనే కార్తికమంతా శివ నామంతో దేవాలయాలు, ఇండ్లు ప్రతిధ్వనిస్తూ ఉంటాయ.
పరమేశ్వరుడైన శివునికి సోమవారం చాలా యిష్టం గనుక ఆ రోజున ఉపవసించి శివనామాన్ని జపిస్తారు. కార్తికంలో వనభోజనాలకు ప్రశస్తం. కులమత రహితంగా జనులందరూ శివనామాన్ని ఉచ్చరిస్తూ ఉసిరిక, మారేడు ఉన్న వనాలల్లో విహరించి ఉసిరికచెట్టును పూజించి దాని క్రింద కూర్చుని పనస ఆకుల విస్తర్లలో భోజనం చేస్తారు. కార్త్తిక శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేస్తారు. నది దగ్గరలేని వారు పుణ్యనదులన్నింటినీ స్మరించుకుంటూ ఉన్న నీటితో అభ్యంగన స్నానాలు ఆచరిస్తారు. ఈ మాసంలో ఏ సత్కార్యం చేసినా ‘కార్తిక దామోదర ప్రీత్యర్థం’ అని ఆచరించమని శాస్త్రం చెబుతుంది.
నదులూ చెరువులు- బావుల నీరు తేటపడి సూర్యరశ్మి ప్రసారంవలన తేజస్సునూ, బలాన్ని సంతరించుకొని వుంటుంది. దానివల్ల నదీస్నానాలు బలవర్థకమూ పుణ్యప్రదమూ అయ ఉంటాయ. దేవుని ఆరాధనకు కావలసిన పుష్ప సమృద్ధిని ప్రకృతి ప్రసాదిస్తుంది. ఈ మాసం సాధనకు అనుకూలమైనదని పురాణ వచనం.
శరదృతువులోని పవిత్ర జలాన్ని ‘హంసోదకం’ అంటారు. ఈ జలస్నానం మానసిక శారీరక రుగ్మతలను పోగొట్టి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పైత్య ప్రకోపాలను తగ్గించే స్నానం యిది. అమృతతుల్యం. మానవాళికి ఉపయుక్తమైనది. నదీ ప్రవాహంలో ఓషధుల సారం ఉంటుందని కృష్ణయజుర్వేదంలో ఒక మంత్రం తెలుపుతుంది. అగస్త్య నక్షత్రం ఉదయించడంవలన ఈ హంసోదకం స్నానపానాదులకు అమృత తుల్యమని మహర్షి చరకుడు తెలిపినాడు. నదులు ప్రవహించే వేళ ఆ నీటిలో తెలియకుండా విద్యుత్ శక్తి ఉంది. శరీరానికి శక్తినిస్తుంది. మూడు దోసిళ్ల నీరు తీసికొని తీరానికి చల్లి, తరవాత బట్టలను పిండుకోవాలి. దీనినే ‘యక్షతర్పణం’ అంటారు. పొడి వస్త్రాలు ధరించి సంధ్యావందనం చేయాలి.
ఈ తులామాసంలో గోష్పాదమంత జల ప్రదేశంలో అనంత శయనుడైన విష్ణువు నివసించి ఉంటాడని ధర్మశాస్త్రాలు చెబుతాయ. కార్తీక శుద్ధ విదియనాడు సోదరి చేత భోజనం తిని ఆమెకు ఆనందం కలిగించిన సోదరులు తృతీయాతిథినాడు సోదరికి వస్త్రాలంకారాలు సమర్పిస్తారు. నాల్గవ రోజు శుద్ధ చవితి నాగుల చవితి పర్వదినం. ఈ రోజున స్ర్తిలు పుట్టలలో పాలు పోసి చలిమిడి- వడపప్పు- నువ్వులతో చేసిన తీపి వుండలు- నైవేద్యాలుగా సమర్పిస్తారు. శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. కృతయుగంలో దేవదానవులు క్షీర సాగర మథనం చేసిన రోజు. మరొకటి కార్తీక పౌర్ణమి. ఈ వేళ ఉసిరికాయలమీద వత్తులుంచి దీపాలు పెడతారు. నదుల్లో వదులుతారు. విప్రులకు, పండితులకు దీపదానం చేస్తారు.
ఈ మాసంలో ఇంగువ , ఉల్లి, వెల్లులి లాంటి ఘాటైన వాసనాగుణం ఉన్న తినగూడదని, గుమ్మడి, శనగ, పెసర అల్చందలు, నువ్వులు లాంటివి కూడా తినకూడదనేది శాస్త్రం చెబుతుంది.

- సాయఅఖిల్