మంచి మాట

అశుతోషుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుగయుగాలలో పరమశివ తత్త్వం ఎంతో ప్రాముఖ్యత వహించినది. పరమశివుని నిలయం కైలాసం. జ్ఞానమునకు సంకేతం. శివుడు ఉద్ధరించే శక్తికి ప్రతిరూపం. అసాధారణ సౌందర్యవంతుడు. పాలనాశక్తికి అధిష్ఠాత. జీవులకు ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులను అందించి పతనాలనుండి రక్షించేవాడు శశాంక శేఖరుడు. శివునికి అశుతోషుడు- అభయంకరుడు- కల్యాణశక్త్యాధికారి అని పిలుస్తూ వుంటారు. శివునికీ, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమాసం కార్తీకమాసం. స్నానమునకు- దీపానికి- దానానికీ ప్రసిద్ధి చెందినది. శరతృతువులో చంద్రుడు పుష్టితో తన చల్లని కిరణాల ద్వారా జీవులందరికీ ధీశక్తిని ప్రసాదిస్తాడు.
చన్నీటి స్నానం- దీపదానం- ఇతర దానాలు- జపాలు- ఉపవాసాలు- వనభోజనం వంటివి చేయాలని శాస్తవ్రచనం. ఈనెలలోనే వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువును తులసీ, జాజిపూలతోనూ, శివుని మారేడు దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ పూజించాలని పురాణోక్తి. ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు పవిత్రమైనది. మహిమాన్వితమైనది. ఈ నెలలో ఏ పనిచేసినా ‘కార్తిక దామోదర ప్రీత్యర్థం’ అని స్మరిస్తూ ఉండాలని శాస్త్రోక్తి.
నదులు ప్రవాహోదకాలు అవడంవలన అందులో విద్యుత్ ఉంటుంది. శరీరానికి శక్తినిస్తుంది. ఓషధీ ప్రభావం కల మాసం ఇది. ఉషఃకాలంలో ఆచరించే స్నానం మంత్రయుక్తంగా వుండాలంటూ ఇలా తెలిపారు.ప్రవాహానికి ఎదురుగా, వాలుగా తీరానికి పరాఙ్మఖంగా స్నానం చేయాలి. అరుణోదయ వేళ శివాలయంలో గడపాలని ధర్మశాస్త్ర ప్రవచనం. జనులు జాగరూకులై విష్ణు- శివాలయాలలో దైవధ్యానం, స్తోత్రం- జపం మున్నగునవి గొప్ప ఫలాన్ని అందస్తాయి. ఈ మాసంలో దీపదానం ఉత్తమ ఫలాన్నిస్తుంది. తులసి, మారేడు, ఉసిరికలయందు- శివాలయం- విష్ణ్వాలయంలోనూ దీపాలు వెలిగించడం పుణ్యప్రదం. తద్వారా అఖండ ఐశ్వర్యం లభిస్తుంది.
కార్తికమాసంలో సోమవారానికి ఎంతో ప్రత్యేకత వున్నది. దీనినే ఇందువలాసరమంటారు. ఈశ్వరునికి ఈరోజు విశేషమైనది. శివాలయాలలలో అభిషేకాలు- స్తోత్రాలు- భజనలు ఆచరిస్తారు కార్తీక సోమవార వ్రతం చేస్తే శివసాయుజ్యం లభిస్తుందని శాస్త్రం. శివార్చనవలన ఈతిబాధలు- గ్రహదోషాలుండవు. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ పూజ చేసి వనోభజనాలు చేసినచో ఇక పర దాయకంగా వుంటుంది.
శారద రాత్రులు ఉజ్జ్వల తారాహార కాంతి సౌరభంతో ఆరోగ్యాన్ని, ఆముష్మికాన్ని భద్రపరిచే దివ్యమాసం ఈ కార్తికమాసం. భవ భయ స్వాంత చరణం కార్తీకార్చనం. శివాలయాల్లో నెల రోజులలు ఆకాశదీపాలు వెలిగిస్తారు. భక్తి తాదాత్మ్యతలను ఉద్దీపింపచేసి, ఆత్మప్రబోధం చేసే పవిత్ర పర్వదినాలు ఈ మాసంలో రావడం అదృష్టదాయకంగా భావిస్తారు. ఉత్తమ గురువు వద్ద మంత్రదీక్ష తీసుకొంటే మోక్ష పుణ్యఫలం అని పురాణోక్తి. ‘కార్తికేతు కృతాదీక్షా నృణాంజన్మ విమోచన’ అని మంత్రం.
దీనిని కార్తీక ఏకాదశి నుండి పూర్ణిమ వరకు స్మరిస్తూ శివవిష్ణుదేవుల ఆరాధన చేయాలి. కార్తీకదీపదానం వలన నరక ప్రాప్తి నివారణ కల్గుతుంది అని వ్రత చూడామణి తెల్పుతుంది. పార్వతీ పతి దయా సముద్రుడుగదా! కార్తికమాస వ్రతాన్ని ఆచరించినచో జీవునికి పాపనాశనమై జ్ఞానమును పొంది, పునరావృత్తి రహితమన మోక్షము కల్గుతుంది. వైకుంఠప్రాప్తి కల్గుతుంది. ఈ కార్తికమాస మహాత్మ్యం మహర్షి ప్రోక్తమైనది. తమనస్సును పారద్రోలేవి కార్తికదీపాలు.
కార్తిక పూర్ణిమనాడు కామ్య వృషోత్సర్గము ప్రముఖమైనది. దీనికి ఆశ్వయుజ పూర్ణిమ- సూర్యచంద్ర గ్రహణాలు- కర్కట- మకర - మే- తులా సంక్రాంతులని యుక్తకాలాలు. ఇది ఎంతో విస్తృతమైన విషయ పరంపర అని స్మృతికౌస్త్భుంలో తెలుపబడినది.
కార్తిక బహుళ అమావాస్యనాడు పోలిని స్వర్గానికి పంపుతారని ప్రశస్తి. అరటి దొనె్నలలో ‘పోలి’ అనే భక్తురాలు పడవ వలె చేసి నూనె పోసి, వత్తివేసి పడిపోని విధంగా చేసి ప్రవాహ జలంలో వదలుట వల్లనే పోలి స్వర్గం అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ పతివ్రత పెట్టిన దీపాలవల్ల ఆమెకు సశరీర స్వర్గప్రాప్తి కల్గిందట.
పరమశివుని మానవ రూపంలోనూ, లింగరూపంలోను మహన్యాస, నమక - చమక రుద్ర మంత్రాలతో అభిషేకాలు శివాలయాలలో భక్తి ప్రపత్తులతో చేస్తూ వుంటారు.

- పి.వి.ఎస్.రామమూర్తి