మంచి మాట

కలియుగ దైవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాధ నాధుడుగా, ఆర్త జన దీక్షాదక్షుడుగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా, శ్రీనివాసుడుగా అన్నింటికీమించి గోవిందుడుగా కొనియాడబడుచూ కొలువబడుతున్నాడు. పద్మావతీదేవి, అలివేలుమంగ పతిగా, సప్తగిరీశుడుగా, తిరుమలేశుడుగా భక్తకోటికి దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నాడు. వేంకటాద్రికి సరితూగే స్థానంగాని వేంకటేశ్వరుడికి సమాన దైవంగాని లేరని శాస్త్ర కథనం. భృగుమర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భువికి రావడం శ్రీనివాసుడుగా వేంకటాద్రిపై అవతరించడం- ఇదంతా విష్ణులీలా విశేషమని మహర్షుల మాట. శ్రవణం నక్షత్రంనాడు, మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు. కావున ప్రతీ శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేరులతో కూడియున్న మలయప్పస్వామివారు తిరువీధుల్లో బంగారు రథంపై విహరిస్తూ భక్తులను తరింపజేస్తారు.
స్వామివారి పుష్కరిణిలో స్నానం, శ్రీ వరాహస్వామి దర్శనం, కటాహతీర్థపానం- ఈ మూడూ ముల్లోకాలలో దుర్లభాలని స్కాందపురాణం తెలుపుతోంది. ‘వినా వేంకటేశం, ననాదో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి’- స్వామీ నీవే మాకు దిక్కు తప్ప మరో దిక్కు లేదు. నినే్న నిరంతరం స్మరిస్తూ ఉంటాం. మాపై నీ అనుగ్రహాన్నుంచు గోవిందా! అంటూ భక్తులు శ్రీహరి నామానే్న సదా స్మరిస్తూ పులకితులవుతూ వుంటారు. క్రీ.శ.1360వ సం.లో ప్రారంభమైన వసంతోత్సవాలు ప్రతి సంవత్సరం వసంత ఋతువునందు చైత్రమాసంలో శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, ఈ మూడు తిథులందును ఘనంగా నిర్వహింపబడి, స్వామివారిని లక్షలాది భక్తులు దర్శించుకొని తరిస్తూ వుంటారు. స్వామివారి కృపా వీక్షణాలతో, మూగవాడు మాట్లాడగలుగుతాడని, కుంటివాడు నడువగలుగుతాడని భక్తుల విశ్వాసం. అజ్ఞానంతో తెలియక చేసే దోషాలకు క్షమార్హత ఉందని, ‘అజ్ఞానినా మయాదోషాన్ అశేషాన్, విహితాన్ హరేః క్షమస్వతం క్షమస్వతం- శేషశైల శిఖామణే’ అంటూ భక్తులు రెండు చేతులూ జోడించి శ్రీహరి వేంకటేశ్వరుని వేడుకుంటూ ఉంటారు.
తిరుమల శ్రీ వేంకటేశుడు ఐదు విగ్రహమూర్తుల రూపాలతో భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తాడు. అవి- 1. ఆదంద నిలయంలో ఉంటూన్న సాలగ్రామ శిలామూర్తి (్ధృవమూర్తి) 2.్భగ శ్రీనివాసమూర్తి (నిత్య పెళ్లికొడుకుగా దర్శమిస్తూ అనుగ్రహిస్తాడు) 3. కొలువు శ్రీనివాసమూర్తి (మూల విరాట్‌కు ప్రతీగా శోభించే పంచలోహ ప్రతిమ మూర్తి), 4.ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన తిరుమంజనాదులుంటాయి, క్షీరాబ్ది ద్వాదశినాడు ఆస్థానం నిర్వహించబడుతుంది), 5.మలయప్ప స్వామి (ఉత్సవమూర్తిగా పలు వాహనాలపై ఊరేగుతూ, భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహించే దివ్యస్వామి). మట్టిముద్దలని పిసికి పిసికి కుండలుగా తయారుచేసి అమ్ముకుంటూ జీవితాన్ని కొనసాగించే భక్తుడు, భగవంతుని దర్శనానికి వెళ్లలేను కదా అని అనుకొని, ఆ భగవంతుని రూపాన్ని మట్టితోనే తయారుచేసి, ఆ మట్టినే పువ్వులుగా రూపుదిద్ది స్వామికి రోజూ అర్చించేవాడు. కొన్నాళ్ళకు భగవంతుని కృప కలిగి స్వామియే భక్తుని వద్దకు నడిచి వచ్చి దర్శనమిచ్చి, అనుగ్రహించినట్లుగా శ్రీవేంకటేశ్వర మహత్మ్యం చెబుతోంది.
శ్రీ మార్కండేయ మహర్షివారు, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యంలో వజ్ర కవచ స్తోత్రాన్ని రచించినట్లు ప్రసిద్ధి. ఇందులో శ్రీ వేంకటేశుని స్మరిస్తూ వుంటే, మనకు సంపూర్ణ రక్షణ వుంటుందని తెలియజేయబడుతుంది.
ప్రతిరోజూ వేలకొలదీ భక్తులలు ఏడుకొండలస్వామిని దర్శించి తరించగా, యేటా బ్రహ్మోత్సవాలు ఇతర వసంతాది మహోత్సవాలు, స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలు దర్శించే లక్షలాది భక్తులు దైవానుగ్రహ పాత్రులవుతారు. ఏడుకొండలస్వామివారి లీలలు వర్ణనాతీతములు. ఆపదలలో చిక్కుకున్న కోట్లాది భక్తులకు కొంగు బంగారమై వారి కోరికల్ని సఫలం చేస్తూ ఆదుకొనే ఆపద మొక్కులవాడుగా, అపార కృపా దృష్టిగల దైవంగా దీన భక్తజన బాంధువుడగా, కలియుగ దైవంగా కొలువబడుచున్నాడు కోనేటిరాయుడు.స్వామివారికి ప్రతిరాత్రి ఏకాంతసేవ చివరి కార్యక్రమంగా జరుగుతుంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్మారక మంగళ కర్పూర నీరాజనంతోపాటు తాళ్ళపాక వంశీయులచే జోలపాట వినిపించబడుతుంది.స్వామిని సేవిద్దాం, తరిద్దాం, దైవకృపకు పాత్రులవుదాం.

-చెళ్ళపిళ్ళ సన్యాసిరావు