మంచి మాట

భగవంతుని లీలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుని గూర్చి తెలుసుకోవాలనుకొని అనే్వషిస్తూ ఉంటే భగవంతుని సృష్టిలోని ప్రతి లీలలోనూ పరమార్థం కనిపిస్తుంది. గాలి వీచడంలోను, నదీజలాలు పారడంలోను ఎన్నో నిగూఢార్థాలు కలిగిఉన్నట్టు కనిపిస్తుంది. సృష్టిలో ఏవస్తువు కూడా పనికిరానిది అంటూ ఏదీ లేదు. ఏ కారణం లేకుండా ఏ జీవి పుట్టదు. వస్తువువైనా, అ వస్తువువైనా దానికోసం ఏదో ఒక కారణంగా అది ఏర్పడుతోంది. ఎపుడైతే కారణం అయపోతుందో అపుడు ఆ ప్రాణి అదృశ్యవౌతుంది. మనుషు లైతే చనిపోయారంటాం. పక్షులు , జంతువులు చనిపోయాయ అంటాం. వృక్షాదులను ఎండిపోయాయ అంటారు. ఆఖరికి రాళ్లు సైతం కరిగిపో తాయ అంటే అవి వచ్చిన లేక చేయవలసి పని అయపోతే చాలు అవి కనిపించకుండా కాలగర్భంలో కలసిపోతాయ. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేసిన ఎన్నో అద్భుత లీలలున్నాయ. శ్రీకృష్ణుడు చేసిన ఏ పనికైనా సరే అంతరార్థం మరొకటి ఉంటుంది. అవి తెలుసుకొంటే భగవంతుని తత్వమేమిటో కొద్దిగా తెలిసే అవకాశం ఉంది అనిపిస్తుంది.
అమ్మదగ్గరపాలు తాగే వయస్సులో తనకు పాలిచ్చినట్లుగానే ఇచ్చి ప్రాణాలు తీద్దామని వచ్చిన పూతనను సంహరించాడు. అంటే - ‘పూతము’ అనగా పవిత్రము. పవిత్రము కానిది పూతన. అనగా అజ్ఞానము, అవిద్య, పవిత్రమైనది జ్ఞానము. అజ్ఞానమువలన వాసనలు బయలుదేరుతాయి. పూతన వాసనా స్వరూపమే. ఈ వాసన మన దేహంలో పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రిములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను పదు నాలుగు స్థానములలో తిష్ఠవేసి ఉంటుంది. మాయ త్రిగుణాత్మకం. పూతన శిశువులు, చిన్నపిల్లలను సంహరిస్తూ ఉంటుంది. మూడు సంవత్సరాలలోపు వారిని చూపుతూ ఉంటుంది. త్రిగుణాత్మకం అయిన మాయను జయించి గుణాతీతుడు అయిన వారిని పూతన ఏమీ చేయజాలదు. భగవంతుడు పూతనను సంహరించడంలో రహస్యం, తనని ఆశ్రయించినవారి అజ్ఞానాన్ని హరిస్తాడు అని అర్థం.
మనం సంసారం అనే బండిలో భగవంతుణ్ణి మన రథసారథిగా చేసుకుంటే ఇంద్రియములు అనే గుఱ్ఱాలు సక్రమంగా నడుస్తాయి. శకటాసుర భంజనంలో అంతరార్థం ఇదే. ఒకసారి శ్రీకృష్ణుడు యశోదను తనకు పాలివ్వమని అల్లరిచేస్తూండసాగాడు. అదే సమయంలో పొయ్యిమీద పెట్టిన పాలు పొంగితే యశోద అటు పరిగెడుతుంది. ఇక్కడ సామాన్య జీవికి భగవంతుని యందు భక్తికంటే ఇహముపై అనురక్తి ఎక్కువ అని తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు రాతితో పెరుగు కుండ పగులగొడతాడు. యశోద కోపముగా కఱ్ఱ తీసుకొని అతని వెంటబడుతుంది. ఇక్కడ కఱ్ఱ అభిమానానికి, గర్వానికి ప్రతీక. యశోద అలసిపోయి నిస్సహాయత ప్రకటించగానే శ్రీకృష్ణుడు ఆమెకి దొరికిపోతాడు. అహంకారం, అభిమానం, గర్వం విడిచిపెట్టి తనను సేవిస్తే తాను బంధీనవుతానని పరమాత్మ చెప్పకయే చెపుతాడు.
ఒకసారి శ్రీకృష్ణుడు అల్లరి మితి మీరుతోందని భావించిన యశోద త్రాటితో బంధించటానికి ప్రయత్నిస్తుంది. కాని త్రాడు రెండు అంగుళాలు తక్కువ అవుతుంది.అంటే ఆ రెండు అంగుళముల త్రాడే అహంకార, మమకారములు. అహంకార, మమకారములు కలవారు తన దరి చేరజాలరని కేవలము ప్రేమ అనే రజ్జువుకే తాను బందీనవుతానని భగవానుని చెప్పాడన్నమాట. ఎపుడైనా భగవంతుడినైనా, మనిషినైనా ప్రేమతో ఆకర్షించవచ్చుగాని మరి ఏ ఇతర కారణాల వల్ల ధగ్గరగా ఉన్నట్టు భ్రమ కల్గినా అది తాత్కాలికమే అవుతుంది. గోపికా వస్త్రాపహరణలో కూడా ‘లౌకిక సంస్కార శూన్యులై ఉన్న మీరు మాయ అనే తెరను (వస్తమ్రులను) తొలగించి నా దగ్గరకు రండి. మీ మోహమనే తెరను నేను తొలగిస్తాను’ అని భగవంతుడు చెబుతున్నాడన్నమాట.
ఇన్ని విధాలుగా చెబుతూ మనలను భగవంతుని గూర్చి తెలుసుకోమని భగవంతుడే చెబుతున్నాడు. కాని భగవంతుని మాయ లో చిక్కిన మనం మాత్రం మాయామోహితులయ దుర్లభమైన మానవ జన్మను వృథాచేసుకొంటున్నాం. కనుక ఇక నుంఛి యైనా భగవంతుని చింతన చేద్దాం.

- ఎస్. నాగలక్ష్మి