మంచి మాట

ఆలోచనామృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచనలు రెండు రకాలు. ఒకటి సదాలోచన. రెండు దూరాలోచన. సదాలోచన అంటే సరిగ్గా ఆలోచించడం, సమయానికి సరిపడే నిర్ణయాన్ని తీసుకునేందుకు ఉపయోగపడే సముచితమైన ఆలోచన చేయడమన్నమాట. ఇది సదురు వ్యక్తికే కాదు సమాజం మొత్తానికి ఉపయుక్తమైన విచిత్రాలు సృష్టిస్తుంది. ఇక, దురాలోచన అంటే నిరుపయోగమైన యోచన. దీనివలన అలా ఆలోచించే వ్యక్తికే కాదు యావత్సమాజానికే కీడు జరుగుతుంది.
పైగా అటువంటి ఆలోచన శ్రేయస్కరం కూడా కాదు. అరికట్టలేని అరిషడ్వర్గాల ప్రమేయంతో జనించిన ఈ దురాలోచన అనేకానేక అనర్థాలకు కారణభూతమై లోకంలో అల్లకల్లోలాలు సృష్టిస్తుంది.
మారణకాండకు,దానవ ప్రవృత్తికి జీవం పోస్తుంది. పురాణేతిహాస కాలంలో అస్తవ్యస్త స్థితిగతుల్ని కలిగించిన అసురలను తలపింపచేసే అటువంటి ఆలోచనలను ఎప్పటికీ క్షేమదాయకం కాదు. గీతాకారుడు ప్రవచించినట్లు ‘‘్ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’’అనే భగవంతుని భరోసా వాక్యానికి, అవినీతి, అన్యాయం పెచ్చు పెరిగి పోతూన్న ఈ కలియుగంలో నిజమై ఋజవుతుందన్న నమ్మకం సన్నగిల్లుతోంది.
ధనదాహం పెరిగిపోయి పదవీ వ్యామోహం సర్వవ్యాప్తమై పోతున్న తరుణంలో, ధర్మసంస్థాపన కొరకు ఆ దేవదేవుడు దివినుంచి దిగి వచ్చి అవతారమెత్తుతాడని ఎలి విశ్వసించగలం. ఒకవేళ నిజంగా నిలువెత్తు మంచితనం రూపేణా మానవావతారుడై అవనికి అరుదెంచినా అవినీతి అనునీం అంతటా వ్యాపించి వున్నీ కలికాలంలో ఎంత మంచితనమున్నా అది చేతకాని తనంగా ముద్రవేయబడి - నేర్పుగా నేరాలబరిలోకి నెట్టి వేయబడటం కచ్చితంగా ఖాయం.
దూరాలోచనలు మాని - దురాలోచనలు చేస్తున్న నేటి మానవుని జీవన శైలి మానవీయతకు నిదర్శనమైన మంచితనమను మాట ఎప్పుడో మరిచిపోయింది. కాని కలి కాల మహత్వంతో మంచితనం మంచులాగా కరిగిపోతోంది. స్వార్థంతో నిండిపోయిన మానవుల మనసులు మలిన భూయిష్టాలు అవుతున్నాయి. పాపపుణ్యాలు పరమాత్మ కెరుక అని తెలివిగా తప్పించుకోజూస్తున్నారు.
కాని సర్వసాక్షి యైన భగవంతుడు మనలను ఎల్లవేళలా చూస్తునే ఉంటాడు కనుక ఎవరికి ఏమి ఇవ్వాలో దానే్న ఇస్తాడు. ఎవరికి ఏ శిక్ష వేయాలనుకొంటాడో దానే్న వేస్తాడు. నాచేత చేయిస్తున్నాడంటూ చెడుపనులు చేయడం చేస్తూ పోతే దేవుడే నీకే నీచేతనే శిక్ష వేయిస్తాడన్న నిజం కూడా ఒకరోజు తెలుస్తుంది. మానవులకిచ్చిన వివేక విచక్షణలు ఉపయోగించకుండా గుడ్డిగా చేయడమూ తప్పే నన్నది ప్రతివారు తెలుసుకొని తీరాలి.
మనస్సాక్షి చెప్పినట్లు వినాలి. మనస్సాక్షి ముందు దోషులు అవకండి అంటే మనసు మంచి మార్గంలో వెళ్లమని చెబుతుంది. కాని ఆ మనసుకే రకరకాల ఆకర్షణలు చూపితే వెంటనే ఆకర్షణలకు లోనై చెడుమార్గం తొక్కడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే అనుక్షణం చంచలించే మనస్సును ప్రయత్నం చేసి మంచిమార్గంలోకి తెచ్చుకోవాలి. బుద్ధితో ఆలోచించి మంచి పనులను మాత్రమే చేయాలి. అపుడే అవి సదాలోచనలు అవుతాయి. మన పెద్దలు చెప్పినట్లు సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుకోవడమే కాక దానికి తగ్గ పనులు చేయాలి. అపుడే పాపము పిడుగై భక్షించకుండా మనం రక్షించబడుతాం.
పుణ్యకార్యాలుచేస్తూ పోతుంటే కేవలం తనకొక్కరికే కాక నలుగురికీ ఉపయుక్తమయ్యే కార్యాలు చేస్తూ పోతే ఆ పనులకు లభించిన పుణ్యమే మనలను సదా గొడుగు వలె రక్షిస్తుంది. సదా భగవంతుని అనుగ్రహం తోడుగా ఉంటుంది. కల్యాణకారకమైన ఆలోచనలు సర్వవేళలా ఆచరణీయాలు అవుతాయి. అదే అతిగొప్ప మానవవాదంగా , మన జీవన వేదంగా భవిష్యత్తును బంగారు మయం చేస్తుంది. ప్రతివారు సొంతపనులను స్వార్థాన్ని పక్కన పెట్టి సమాజానికి ఎంత సేవ చేయగలం మనతోటివారికి మనమేదైనా సహాయం అందించగలమా అని ఆలోచించిన రోజు దారిద్య్రం ఏ ఒక్కరి ఇంట్లోనే తొంగిచూడదు. ఏకొందరో అదృష్టవంతులుగా కాక జనులందరూ అదృష్టవంతులే అవుతారు.

-మరువాడ భానుమూర్తి 8008567895