మంచి మాట

భగవదనుభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుఫ్పావై ఎనమిదవ పాశురం కీళ్వానం
కీళ్‌వానమ్ వెళ్ళెన్ఱు ఎఱుమై శిఱు వీడు
మేయ్‌వాన్ పరందనగాణ్ మిక్కుళ్ళప్పిళ్ళై గళుమ్
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్‌క్కాత్తు ఉన్నై
క్కూవువాన్ వన్దు నిన్ఱోమ్ కోదుకలముడైయ
పావాయ్ ఎళుందిరాయ్ పాడి పఱైకొణ్డు
మా వాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాదిదేవనై శెన్ఱు నామ్ శేవిత్తాల్
ఆవావెన్ఱు ఆరాయ్‌న్దు ఆరుళ్ ఏల్ ఓర్ ఎంపావాయ్
భావం:ఈ పాశురంలో ఆచార్య శ్రవణం వల్ల జ్ఞాన ధ్వనిని విన్న తర్వాత కలిగే జ్ఞానోదయపు కాంతులు తెలియజెప్పి, పరమాత్మను శరణువేడితే ఆత్మను అతనిలో చేర్చుకుంటాడు. పరమాత్మను చేరాక నిరోధించే శక్తులను నశింపజేస్తాడు అని చెప్తున్నారు.
తూర్పు దిక్కున తెల్లవారుతూ హృదయంలో కలిగే జ్ఞానోదయాన్ని సంకేతిస్తున్నారు. గేదెలు మేయటానికి (తాత్కాలికంగా) చిన్న బీడు (పొలం)లోకి పోతున్నాయి. మిగిలిన పిల్లలందరూ వ్రతం కోసం (ఆచార్యుల నాశ్రయించడానికై) పోతూ వున్నారు. వారిని పోనివ్వకుండా ఆపి వచ్చి నిలిచాము. ఎందుకంటే నీవు (ఈనాడు లేపబడుతున్న గోపిక) పవిత్రమైన భక్తి కల్గి ఆచార్యుల నాశ్రయించాలనే ఆసక్తి గలదానివి కనుక లేచిరా! శ్రీకృష్ణుని భక్తితో గానం చేసి ప్రణవ వాద్యాన్ని పొందుదాం. గుఱ్ఱం రూపంలో వచ్చిన కేశి అనే రాక్షసుని చంపినవాడిని, చాణూర ముష్టికులనే మల్లులను చంపినవాడిని, దేవతలకే ఆదిదేవుడైన వాడిని శరణువేడుదాము. అప్పుడాయన అయ్యో నాకోసం ఇంత శ్రమపడుతున్నారా? అని కరుణించి రక్షిస్తాడు.
ఈ పాశురంలో ‘కీళ్వానం వెళ్ళెన్ఱు, కోడుకల ముడయ పావాయ్’ అంటూ భగవదనుభవనమునందు కుతూహలము కల్గిన పవిత్రమైన ఒక గోపికను నిద్రలేపి తమ వ్రతంలో చేర్చుకున్నది. దీనివలన భగవదనుభవం వలన ప్రత్యాసన్నులై ఉన్నవారికి, ఇష్టంలేనివారైనా, వారిని ముందుంచుకొని స్వామిని కీర్తించడమే శ్రీ వైష్ణవుల స్వరూపమని చెప్పబడింది. ఇది నిష్ఠాక్రమమము ఈ ఎనిమిదవ పాశురంలో చెప్పబడుతున్నది.
ఆండాళ్ తిరువడిగళే శరణమ్

- డాక్టర్. పరవస్తు కమల