మంచి మాట

జ్ఞానకాంతిరేఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై తొమ్మిదవ పాశురం తూమణి..
తూ మణి మాడత్తు శట్రుం విళక్కు ఎరియ
తూమం కమళ త్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే మణిక్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్ అవళై ఎళుప్పీరో ఉన్మగల్ దాన్
ఊమైయో అన్ఱిచ్చెవిడో ఆనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర పట్టాళో
మా మాయన్ మాదవ న్ వైకుందన్ ఎనె్ఱన్ను
నామం పలవుం నవిన్ఱు ఏలోరెమ్భా వాయ్

భావం: ‘తూమణి మాడత్తు’ పరిశుద్ధమైన మణులతో నిర్మించిన భవనంలో నిద్రించే ఇంకో గొప్ప గోపికను మణి కవాటాలు తీయమని నిద్ర లేపుతున్నది ఆండాళ్ తల్లి ఈనాటి పాశురంలో.
పరమాత్మను చేరక నిరోధించే శక్తులు నశింపగానే ఆత్మ నిర్మలంగా, పరిశుద్ధంగా ప్రకాశిస్తూ భక్త్భివాల పరిమళాలతో ఆనందిస్తూ ధ్యానస్థితిని పొందుతుంది. ఆ స్థితి పొందిన భక్తుని, తమను కూడా కరుణించమని నిద్రలేపుతున్నారు (గోపికలు) భక్తులు ఈనాడు.
పరిశుద్ధమైన మణులతో నిర్మింపబడిన భవనంలో చుట్టూ దీప కాంతులు ప్రకాశిస్తుండగా (జ్ఞానకాంతులు) ధూపముల పొగలు (్భక్తి గాలులు) పరిమళిస్తూండగా నిరంతరం నిద్రావస్థలో ఉండునట్లు చేసే శయ్యమీద కన్నుమూసి నిద్రించే మామ కూతురా!
మణులతో ప్రకాశించే అద్దాల మేడ కనుక మాకు తెలిసిపోతూనే వున్నది. ఓ అత్తా! నీవైనా ఆమెను లేపరాదా? ఎంతో కష్టపడి వచ్చి నిల్చున్నాము. నీ కూతురు మూగదా! లేక చెవిటిదా? లేక ఏమైనా పిచ్చా? ఎవరైనా లేవనీయకుండా మంత్రం వేసి నిద్రించేటట్లు చేసి కావలి ఉన్నారా?
‘‘మాయవీ’, మాధవా, వైకుంఠవాసా!’’ అంటూ శ్రీమన్నారాయణుని నామాలతో కీర్తించండి. ధ్యానావస్థలో ఉత్తముడైన ఆళ్వార్ (గోపికను) లేపి తమను కృపజూడమని, తమకు కూడా ఆ స్థితిప్రజ్ఞత్వాన్ని కల్గించమంటున్నారు గోపికలు ఈనాటి పాశురంలో.
పరిశుద్ధమైన మణులతో నిర్మించిన భవనంలో ఆత్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఆనందావస్థలో నిద్రించే ఉత్తమమైన గోపికను నిద్ర లేపి తమ వ్రతంలో చేర్చుకున్నది ఆండాళ్ తల్లి ఈ నాటి పాశురంలో.
ఆండాళ్ తిరువడిగళే శరణమ్

- డాక్టర్. పరవస్తు కమల