మంచి మాట

యోగసాధనామార్గమిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై పదవ పాశురం ‘నోత్తుచ్చువర్కం’

10వ పా. నోత్తు చ్చువర్కం పుకుగిన్ఱ, అమ్మవాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాతార్
నాత్త త్తుళాయ్‌ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱైతరుం పుణ్ణియనాల్ పణ్దోరునాళ్
కూత్తత్తిన్ వాయ్ వీళ్‌ంద కుంబకరుణనుం
తోత్తుం ఉనక్కే పెరుంతుయిల్ తాన్ తన్దానో
ఆత్త ఆనందలుడయాయ్ అరుంగలమే
తేత్తమాయ్ వన్దు తిఱ వేలోరెమ్బావాయ్

భావం: ‘‘నోత్తుచ్చువర్కం పుగుగిన్ఱ అమ్మవాయ్’’ నోము నోచి అప్పుడే ఫలస్వరూపమైన సుఖానందాన్ని, స్వర్గానుభవాన్ని పొందే ఇంకో గొప్ప గోపికను నిద్రలేపుతున్నది గోదాదేవి ఈనాటి పాశురంలో.
యోగసాధనలో సక్రమ సిద్ధిని పొంది, శక్తికల్గి జ్ఞానంతో ప్రకాశించే సౌందర్య స్వరూపమైన గోపికను (ఆత్మను) ధ్యాన స్థితినుండి లేచి వచ్చి భక్తులందరినీ కరుణించమని ప్రార్థిస్తున్నారు గోపికలు ఈనాటి పాశురంలో. నోము నోచి ఫలితంగా స్వర్గాన్ని (ఆనందానుభవాన్ని) పొందిన తల్లీ! నీ హృదయపు తలుపులు తెరువకపోయినా సరే (ఆనంద సమాధిలోనుండి బయటికి రాకున్నా సరే) మాటైనా పలుకువా? (్భగవన్నామ స్మరణైనా చేయరాదా?) జ్ఞాన పరిమళాలతో నిండిన తులసి చేత అలంకరించుకొనే భక్తుల మనసునే ముడిగా సమూహంగా ధరించిన నారాయణుడు, మన చేత మంగళాశాసనము పాడితే చాలు, మోక్షాన్ని అందిస్తాడు. (లేకుంటే) పూర్వం ఒకప్పుడు కుంభకర్ణుడు (్భక్తిగలవాడైనా) ఇంద్రియాధీశుడై మృత్యువు నోట్లో పడ్డాడు. ఆతడు నిద్రలో నీ చేత ఓడిపోయి, నీకు గాఢనిద్ర ఇచ్చాడా? అధికంగా నిద్రమత్తు గలదానా! (కర్మయోగాన్ని మరచి నీకు నచ్చిన ధ్యాన కర్మలోనే గడిపేదానా!) ఇదే భూషణంగాగల దానా! ప్రత్యేక వ్యక్తిత్వంతో ప్రకాశించేది) ఇప్పుడైనా మత్తు వదలి తేరుకొని వచ్చి తలుపు తీసి మా వ్రత గోష్ఠిలో చేరాలని ఆదేశిస్తున్నది ఆండాళ్ తల్లి ఈనాటి పాశురంలో.
ఆండాళ్ తిరువడిగళే శరణమ్

- డాక్టర్‌ పరవస్తు కమల