మంచి మాట

సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు మకరరాశిలోనికి పరివర్తనం చెందే రోజు సంక్రాంతి. మకర సంక్రమణం అని కూడా అంటారు. ఆ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం సంక్రాంతి. మకర రాశిలో సూర్యుని ప్రవేశంతో పండుగ ప్రారంభమైన సంక్రాంతి పండుగ ముచ్చటగా మూడు రోజులు సాగుతుంది.
ఇంటిముందరపండుగవేళ ప్రత్యేకమైన రంగురంగుల రంగ వల్లులను తీరుస్తారు. ఈ రంగవల్లులల్లో సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నంగా చేస్తుంటారు. తొలిరోజు చిన్ననాటినుంచి శ్రీహరి పై ప్రేమపాశాన్ని పెంచుకుని మాలాకైంకర్యం చేసి కోరి శ్రీవారి మెప్పు పొందిన ఆండాళ్ తల్లి శ్రీరంగనాయకులను వివాహమాడుతుంది. భోగాలను తాను పొంది సర్వమానవాళికి భోగాలను ప్రసాదిస్తుంది కనుక ఆ రోజు భోగి పండుగదినంగా జరుపుకుంటారు. పొద్దుపొద్దునే్న భోగిమంటలు వేసిఅందులో పాత చేట, చీపురు లాంటవి వేసి తమకు పట్టిన దృష్టిదోషం, చీడపీడలు దూరమయ్యాయని భావిస్తారు. ఇంటిముంగిట నెలరోజులనుంచి పెట్టిన గొబ్బిళ్లల్లచుట్టూ గొబ్బియల్లో అంటూ పాటలు పాడుతూ కన్యలంతా ప్రదక్షిణలు చేస్తూ గౌరీదేవిని పూజిస్తారు. సాయంవేళ చిన్నపిల్లలకు భోగిపళ్లు పోసి పేరంటం చేస్తారు.
రెండవనాడు మరక రాశిలోసూర్యుని ప్రవేశంతో సంక్రాంతి ఈరోజు జానపద కళాకారులను సన్మానించేరోజు. వారి జానపద కళలను ప్రదర్శించేరోజు, పిల్లపెద్దా అంతా అభ్యంగన స్నానాలు చేసి సంక్రాంతి నూతన వెలుగు తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తారు. పెద్దలంతా తిలతర్పణాలు వదిలి తమ పితరులను స్మరిస్తారు.
పిల్లలంతా జానపద కళారూపాలైన బుడుబుక్కలవాళ్ల పాటలు, దాసరుల వైష్ణవ సంకీర్తనలు, జంగందేవర శైవనామాలు, గంగిరెద్దుల వాళ్ల ఆట పాటలు, సన్నాయి మేళాలు వాయంచేవారిని చూస్తూ, రంగురంగుల గాలిపటాలను ఎగుర వేస్తూ ఆకాశాన్ని పగలే నక్షత్రాలు వెలిగేట్టు చేస్తారు. దశవిధదానాలు కూడా సంక్రాంతిరోజున ఇస్తారు. నువ్వుల ఉండలను చేసి ఒకరికొకరు పంచు కోవడమూ ఆచారమే. ఇక మూడవ రోజు పశువుల పండుగ కనుమ. సంక్రాంతి మూడుదినాలలో బొమ్మల కొలువులను అమరుస్తారు.ముతె్తైదువులను పిలిచి తాంబూలాలను పంచుతారు. కొత్త అల్లుళ్ళను, కూతుర్లను పిలుస్తారు. వారికి కొత్తబట్టలు పెడతారు. బంధు జనంతో కూడి మూడురోజులు విందుభోజనాలు చేస్తారు. వ్యవసాయంలో సాయపడిన పశువులకు కొత్తపంటతో వండిన పొంగళ్లను పెట్టి కొమ్ములకు రంగులు పూసి ఉత్సవాలు చేసే పండుగే కనుమ. ఈరోజున కోడి పందేలు, పొట్టేలు, దున్నపందేలు ఇలా రకరకాల జంతువులకు పందేలు వేస్తారు. పశువులను కడిగి అలంకరించి వాటిని పూజించి సాయంత్రంవేళ ఎడ్లబండ్లకు కట్టి ఊరు ఊరంతా తిప్పుతారు. దీన్ని బండ్లు తిప్పేపండుగ అని కూడా అంటారు. జాజు, సున్నం పట్టీలతో తీరుస్తూ బండ్లకు అలంకారం చేస్తారు.
స్ర్తిలు సావిత్రి గౌరీవ్రతం చేస్తారు. సంక్రాంతి నోములను నోస్తారు. కొంతమంది దేవునికి ఇంటిలోని చిన్నపిల్లలకు సంక్రాంతికి హారతుల నిస్తారు. సంక్రాంతినాడు నువ్వులు బియ్యం కలిపి శివుణ్ణి అభిషేకిస్తారు. సంక్రాంతి రోజున శివునికి నువ్వుల నూనెతో దీపం పెడితే శని దోషాలు దూరమవుతాయని అంటారు.
ఇవేకాక శ్రీమద్భగవద్గీత పఠనం, గంగాస్నానం, త్రికాల గాయత్రి సంధ్యావందనం, గోవిందనామ స్మరణం చేయాల్సిన పనులుగా నిర్ణయసింధు, ధర్మసింధువులు చెప్తున్నాయ. ఈరోజున కూష్మాండం, కంబళి, ధాన్యాదులు, లోహాలు, వస్త్రాలు, తైలదీపదానాలు చేస్తే మంచిదని శాస్త్ర వచనం. బూడిద గుమ్మడికాయను దానం చేసిన వారికి భూదానం చేసిన ఫలం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయ. పెరుగును దానం చేయడం వల్ల అనారోగ్యబాధలు తీరుతాయ. బుద్ధివికాసం కలుగుతుంది. శబరిమలైమీద వెలిసిన హరిహరపుత్రుడు స్వామి అయ్యప్ప జ్యోతిరూపంలో మకరసంక్రాంతి రోజు దర్శనమిస్తాడు. ఈరోజున ఈ జ్యోతిస్వరూపుణ్ణి దర్శనం చేసుకొంటే ఎంతో పుణ్యమని అంటారు.

- జంగం శ్యామసుందరి