మంచి మాట

సూర్యపేటకు బాయె మాయన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మగారిల్లు అత్తగారిల్లు అనేవి మాతృస్వామ్య వ్యవస్థకు ప్రతీకలు. ఆడపిల్లకు పుట్టింటి మమకారం ఎక్కువగా ఉన్నట్టు నేటికి కనిపిస్తుంటుంది. ఆడపిల్లను పుట్టిన నాటి నుంచి ....ఆడ ... పిల్ల అని అన్నా బతకనివ్వకుండా చేసినా, అసలు పుట్టకుండా చేసినా కూడా ఆడపిల్లకు తన తోబుట్టువులపైనా, తల్లి తండ్రుల పైనా అపారమైన ప్రేమ వాత్సల్యాలు ఉంటూనే ఉన్నాయి. ఈ పుట్టింటి ప్రేమలను జానపద గేయాల్లో బాగా కనిపిస్తాయి. అమ్మాయికి పుట్టిన పిల్లవాడు ఏడుస్తుంటే వాడిని ఊయలల్లో పడుకోబెట్టి నీకోసం నీ మేనమామలు ఏదో తెచ్చారని దాన్ని నీవు తీసుకోవడానికి తయారు గా ఉండాలని చెబుతూ దానికోసం నీవు మంచి నిద్ర పోయ శక్తివంతంగా తయారు కావాలని చెబుతూ వారిని జోకొట్టి ఏడుపు పోగొట్టి నిద్రపుచ్చుతుంటారు. అట్లాంటి పాటల్లో మచ్చుకు మేనమామ గురించి పాటను చూద్దాం
అబ్బాయి మామలు యెటువంటి వారు
నిలువుబొట్టుల వారు నియ్యోగి వారు
అంచు పంచెల వారు అంగీల వారు
పట్టుపంచెల వారు పాగాల వారు
చెవిచెలికి చేరడేసి పోగుల్ల వారు
పెసర కాయల వంటి పెదిమల్ల వారు
కందికాయల వంటి కనుబొమల వారు
మిరప కాయల వంటి మీసాల వారు
వారు మా అబ్బాయి మేనమామల్లు...
మా పాప మామల్లు మత్స్యావతారం
కూర్చున్న తాకల్లు కూర్మావతారం
రక్షించు మామయ్య రామావతారం
వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు తండ్రి
లాలి, లాలి, లాలమ్మ, లాలీ
అబ్బాయి మామల్లు ఎటువంటివారు
ఎక్కంగ తెచ్చేరు ఎర్రగుర్రాలు
పట్టంగ తెచ్చేరు పట్టుగొడుగల్లు
పులిగోరు పతకాలు పూసలా పేర్లు
అబ్బాయి మామల్లు తెచ్చి యిచ్చేరు ...
ఇలా మేనమామల గొప్పతనాన్ని ఈ పాటలు చెబుతాయి. అంతేకాదు మేనమామ బాధ్యతను చెప్పే సామెతలూ కూడా జానపదంలో కనిపిస్తాయి. బావమరిది బతుకగోరుతాడని, తల్లి వెనుక తల్లంతటి వాడు మేనమామ అని మేనమామ ప్రాశస్యాన్ని తెలుపుతారు.
సూర్యపేటకు బాయె మాయన్న
సూసిన రైకలు దెచ్చె మాయన్న
నల్లగొండకు బాయె మాయన్న -
నక్కి రైకలు దెచ్చె మాయన్న
పట్నంబాయె మాయన్న -
పట్టు చీరలు దెచ్చె మా యన్న
ముగ్గురన్నల తోటనే బుట్టినాను -
నానడుము మువ్వంచు చీర గోరింది
నలుగురన్నల తోడనే బుట్టినాను -
నా నడుము నల్లంచ చీర గోరింది
....
ఇలా అన్నదమ్ముల అక్కచెల్లెళ్ల అనుబంధం ఒక్కనాటిది కాదు. కులాలనుబట్టి కాదు, మతాలను పట్టికాదు అక్కచెల్లెళ్ల మీద ప్రేమ ఒక్కరకంగానే ఉంటుంది.
మా మల్లు చందమామల్లు
నాయన్న మామల్లు రామలక్ష్మణులు
పాలుతాగేవాడు పారాడేనాడు
పాడియావు పంపించు నీకు మీ మామ....
ఇంతటి ప్రాధాన్యం ఇచ్చిన మేనమామలు కొన్ని ప్రాంతాలల్లో వారి అక్కకూతుర్లనే పెళ్లిళ్లు కూడా చేసుకోవడం ఉంది.
ఎన్నివిధాలు తరచి చూసినా మేనమామ ప్రాధాన్యత తండ్రి కంటె ఎక్కువనే తెలుస్తుంది. మెట్టినిల్లు చేరిన తన అక్కను ఇంటికి తీసుకొనిరావడం ఒడిబియ్యం పోయడం, పండుగకు పిలవడం సారె పెట్టడం మేనల్లుళ్లను, మేనకోడళ్ల ముచ్చట్లు తీర్చడంలో మేనమామదే పైచేయిగా కనిపిస్తుంది.

- డా. దాసరి రంగ