మంచి మాట

రామావతారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మం నాలుగు పాదాలు నడవటానికి దేవదేవుడు శ్రీమహావిష్ణువు దశావతారాలు దాల్చాడు. ధర్మం నశించినపుడు ధర్మ సంస్థాపన కోసం అవతారాలు ఎత్తి ధర్మాన్ని కాపాడతానని శ్రీకృష్ణ్భగవానుడు స్వయంగా చెప్పాడు. అందులో భాగమే రామావతారం.
వైకుంఠం నుంచి కదలి వచ్చి అయోధ్యలోని దశరథ మహారాజుకు జ్యేష్ఠపుత్రునిగా అవతరించాడు శ్రీరామచంద్రస్వామి.ఆయన చరిత్రనే రామాయణ కావ్యం.
లోకకంటకుడైన ఠావణాసురుడు దేవతలను చెరపట్టాడు. సజ్జనహింసచేశాడు. దేవతలు శ్రీ మహావిష్ణువును శరణువేడారు. రామునిగా వచ్చి రావణుని అంతం చేస్తానని అభయమొసంగాడు మహావిష్ణువు. మహావిష్ణువు దాశరథి అయ్యాడు. కాలక్రమంలో రామలక్ష్మణభరతశత్రఘు్నలు పుట్టారు. రామచంద్రస్వామి పట్ట్భాషేకం చేయాలని దశరథుడు నిశ్చయించాడు. పట్ట్భాషేకానికి భంగం కలిగింది. కైకేయ నెపంతో సీతారామ లక్ష్మణులు వనవాసం చేయాల్సివచ్చింది.
రావణుని చెల్లెలు శూర్పణఖ రామాదుల దగ్గరకునాందీ ప్రస్తావనగా వచ్చింది. రావణాసురుడు తాను నాశనం కావటానికి జంగందేవుని వేషంలో వచ్చి సీతాదేవిని అపహరించాడు. రామలక్ష్మణులు సీతాదేవి కోసం వెతుకుతూ గంధమాదన పర్వతం దగ్గరకు వచ్చారు. ఆంజనేయ, సుగ్రీవులు రామాదులకు పరిచయం అయ్యారు.
సుగ్రీవుని రాజ్యాధిపతిని చేసి, శ్రీరాముడు సీతాదేవి అనే్వషణలో సుగ్రీవుని సహాయం కోరాడు. సీతాదేవి కోసం అందరూ అంతా వెతికారు. ఆ తల్లి జాడ దొరకలేదు. శ్రీరామచంద్రస్వామి వద్ద అంగుళీయకాన్ని తీసుకొని సీతానే్వషణ నిమితతం ఆంజనేయుడు బయలుదేరాడు. మార్గమధ్యలో సంపాతిని కలిశాడు ఆంజనేయుడు. సంపాతి సాయంతో రావణుని లంకలో సీతమ్మ బంధింపబడి ఉందని ఆంజనేయా దులకు తెలిసింది. సముద్రం దాటడానికి ఎవరికి చేత కాలేదు. జాంబవంతుని సలహాతో ఆంజనేయుని నిన్ను మించిన వారు ఎవరూ లేరని, నీవు మాత్రమే సముద్ర లంఘనం చేయగలవంటూ అందరూ పొగిడారు. జైశ్రీరామ్ అంటూ సముద్ర లంఘనానికి ఆంజనేయుడు నిలిచాడు. లంకలోకి ప్రవేశించబోయన ఆంజనేయునికి లంకిణి అనే రాక్షసి అడ్డుతగిలింది. లంకిణిని చంపి లంకలోకి ప్రవేశించాడు మారుతి.
రావణాసురుడు గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు పరమేశ్వరునికి అభిషేకం, అర్చనలు చేసి తరువాత కాని మంచినీళ్లు ముట్టని భక్తిపరుడు. కాని సీతమ్మ అపహరించి దుష్టత్వంలో పరాకాష్ఠకు చేరుకున్నాడు. ఆంజనేయుడు లంకలో ప్రవేశించిన సమయం రాత్రి కావడంతో రాక్షసులందరూ నిద్రపోయారు. ఇదే మంచి సమయ మని లంకలో సీతాదేవి కోసం వెతికి వెతికి చివరకు ఆంజనేయుడు అశోకవనంలోకి వచ్చాడు. మారుతి దుఃఖిత అయన సీతమ్మను చూచాడు. ఆంజనేయుడు బాగా ఆలోచించాడు. ఇక రామకథాగానం చేయాలని సంకల్పించాడు.
ఆంజనేయుడు రామనామ సంకీర్తన చేస్తున్నాడు. ఏడుస్తున్న సీతాదేవి రామానామాన్ని వినింది. దుఃఖం పటాపంచలైంది. రామనామంతో హృదయభారం తగ్గించుకొంది. ఎక్కడా ఆ రామనామగానామృతం వినవచ్చేది అని చూచింది. ఆంజనేయుడు క్రిందకు వచ్చి సీతాదేవికి నమస్కరించాడు. రామచంద్రస్వామి ఇచ్చిన ఉంగరాన్ని సీతాదేవికి సమర్పించాడు. తన చూడామణిని ఇచ్చి సీతమ్మ తన విషయాన్ని రామునికి ఎరిగింపుమని చెప్పింది. ఆంజనేయుడు విషయం రామునికి వివరించాడు. వానరుల సాయంతో రాముడు సేతువును నిర్మించాడు. అందరూ సేతువు దాటారు. రామరావణ యుద్ధంజరిగింది. ఆ యుద్ధంలో రావణుడు నేలకొరిగాడు. సీతాదేవిని తీసుకొని శ్రీరామచంద్రస్వామి అయోధ్యకు వచ్చాడు. ధర్మపరిరక్షణకు రామచంద్రస్వామి రావణాసురున్ని అంతమొందించాడు.
దుష్టశిక్షణ జరిగింది. సన్మార్గులరక్షణ జరిగింది. దేవతలతో సహా సజ్జనులంతా ఆనందించారు. నరలోకంలోను, దేవలోకంలో ఆనందోత్సవాలు జరిపారు. తిరిగి రామచంద్రుడు మహావిష్ణువు స్థానంలోకి వెళ్లాడు.

-పర్లా చంద్రశేఖర్