మంచి మాట

కర్మయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న హి కశ్చిత్ క్షణమపి.... అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినది అక్షరసత్యం. మనిషిగా పుట్టిన ప్రతీ ఒక్కరూ ఏ కాలంలోనైనా క్షణమాత్రం కూడా కర్మను చేయకుండా వుండలేరు. కర్మ చేయుటలో వయోభేదం, లింగభేం ఉండదు. మనుష్యులందరూ ప్రకృత జనితములైన గుణములకు లోబడి కర్మలు చేస్తూంటారు.
ప్రతీ వ్యక్తి కర్మలను చేస్తూంటారు. ప్రతీ మనిషి నిద్ర లేచినది మొదలు మరలా నిద్రపోయేవరకూ శరీరంతోనో, మనసుతోనో ఏదో ఒక కర్మ చేస్తూనే వుండడం జరుగుతుంది.
కర్మలు చేయనిచో శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. త్రిగుణాత్మకమైన తత్వాలు సముదాయము, గుణవిభాగముగాను వాటి పరస్పర చేష్టలనే కర్మ విభాగంగా చెప్పబడ్డాయి. మానవులచే కర్మలన్నీ ఐదు రకాలుగా ఉంటాయన్నారు. 1.కర్మ 2.అకర్మ 3.వికర్మ 4.సకామ కర్మ 5 నిష్కామకర్మలుగా చెప్పడం జరిగింది.
కర్మ- పనిచేయడం, అకర్మ- ఏ పని చేయకపోవడం, వికర్మ-నిషిద్ధ కర్మలు చేయడం, సకామ కర్మ-ప్రతిఫలాపేక్షంగా పనిచేయడం, నిష్కామకర్మ- ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా ఉండడం.
కర్మలు జరగడం అనేది కర్మల రకాల్లోనే జరుగుతుంటాయి. కర్మలు చేసే మానవులు తప్పనిసరిగా సకామ కర్మలకే సిద్ధపడతారు.
నిషిద్ధ కర్మలను (వికర్మల) ఆలోచన కూడా చేయకుండుటయే మానవ ధర్మమని చెప్పారు. నిషిద్ధ కర్మలు ఇహపరలోకాలలో హానిచేస్తాయి.
ఆత్మను జాగృతం చేసేవి పరమాత్మకు దగ్గర చేసేవి నిష్కామ కర్మలే అని కృష్ణ్భగవానుడు స్వయంగా చెప్పాడు. ఏ పని చేసినా (వికర్మలు కాకుండా) అంతర్యామి అయినా పరమాత్మ ధ్యానంతో పనిచేయడం కర్తవ్యంగా పని ఫలితం భగవంతునికే విడిచిపెట్టగలగడం చేయాలంటారు.
ఇంద్రియాలను అదుపు చేయు మనోశక్తిని కలిగి ఉండటంవలన నిష్కామ కర్మలు సాధ్యమవుతాయి. పనే కర్మయని అందరికీ తెలిసిన విషయం కదా! ఏ పని చేసినా ఫలితము కంటే ముందు శ్రద్ధతో ఏ ధ్యాస మనసులో లేకుండా మనసు ఆ పనిమీదనే ఉంచి పని చేయగలగాలి.
పనిచేస్తున్నపుడు ఎవరూ చూడరులే, ఎలా చేస్తే ఏంటి అంటూ మన యిల్లు శుభ్రం చేస్తూ చెత్తను ప్రక్క వాకిట్లో పడేయడం కాదు. ఏ పని ఎలా చేస్తే ఎవరూ చూడరులే అన్న భావన చాలా విషయాలలో చాలాచోట్ల జరుగుతూంటుంది.
పూర్వం గురుకులంలో గురువుగారు ఇద్దరు శిష్యులను పిలిచి చెరో మామిడిపండు యిచ్చి ఎవరూ చూడకుండా తినమని చెప్పారుట. ఒకటవ శిష్యుడు ప్రక్కకు వెళి లతినేసాడట. రెండోవాడు ఎన్నో చోట్ల తిరిగి పండు పట్టుకుని గురువుగారి వద్దకు వచ్చి తినలేకపోయానని చెప్పాడట.
గురువుగారు, మీరు ఎవరూ చూడకుండా తినమన్నారు. ఎక్కడికి వెళ్లినా ఎవరో చూస్తున్నట్లనిపించింది. అందుకే తినలేకపోయానన్నాడట.
మనం ఏ పని చేసినా సర్వాంతర్యామి దృష్టి దాటి చేయలేము. భగవంతుడు అంతటా ఉండి మనం చేసే ఏ పని అయినా అతడే సాక్షీభూతుడు అని ఆ శిష్యుణ్ణి మెచ్చుకున్నాడట.
అలాగున ఎవరు ఏ పని చేసినా మనలో ఉన్న అంతరాత్మే అంతటా ఉన్న సర్వాంతర్యామి అని జ్ఞానం ఎరుకతో పనిచేయాలి. బాధ్యతనుకుంటే బరువుగా, వంతులుగా అనిపిస్తుంది.
అలా కాకుండా కర్తవ్యంగా, కల్మషం లేనిదై ఫలితం ఆశించకుండా చేయమని శ్రీకృష్ణ భగవానుడు ఉద్బోదించారు.
కర్మలు ధర్మబద్ధంగా, కర్తవ్యంగా, సేవ, ప్రేమతో కూడి జరిగినపుడే కర్మయోగమవుతుంది. అపుడే కర్మయోగం సిద్ధిస్తుంది.

-జి.కృష్ణకుమారి