మంచి మాట

పుణ్యఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దానములన్నింటికన్నా అన్నదానం గొప్పది అంటారు. మన పెద్దలు పూర్వికులు దానధర్మాలు చేయడంవలన ఉత్తమ ఫలం లభిస్తుందంటారు. మానవుడు తన విధి విధానంలో ధర్మప్రవర్తనతో మసలుకోగలగాలి. ధర్మార్థ కామ మోక్షములలో ప్రధానమైనవి దానగుణం. పూర్వం శిబి చక్రవర్తి, దాన వీర శూర కర్ణగా కర్ణుడు అత్యంత దానశీలురుగా పేరుగాంచారు. దానము చేసే శక్తి తమకు లేకపోయినా దానం చేయాలనే సంకల్పం ఇతరుల ద్వారా సిద్ధింపచేయడం కూడా పుణ్యకార్యమే అనిపించుకుంటుంది.
మనిషి తను సంపాదించినది తనకు తనివితీరా లభించినప్పటికీ తనకున్నదానిలో కొంత దానం చేయగలగాలి. దానం చేసిన తరువాత ప్రచారం ఎక్కువ చేసుకోరాదు. గుప్తదానాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దానములు అనేక రకములుగా వున్నవి. గోదానంవలన మహాపుణ్యదానఫలం లభిస్తుంది. గోవు చాలా పవిత్రమైనది. గోవు బ్రాహ్మణునికి దానం ఇవ్వడం చాలా మంచిది. ఉత్తమమైన ఫలం లభించగలదు. దానములలో అనేక రకాలైన దానములు వున్నాయి. ధనం దానం, ధాన్యం దానం, ఫలం దానం, విద్యాదానం, గృహదానం, స్థలదానం, కన్యాదానం, అన్నదానం, పంటల దానం వంటివి ఎన్నో వున్నాయి. దానధర్మాలు చేయడం ఒక పుణ్యకార్యం.
అన్నదానం అనేది ఆకలి తీర్చడం కనుక గొప్పదానంగా పేరుపొందింది. అందుకే అన్ని దానములకంటే అన్నదానం గొప్పదని పండితులు పేర్కొన్నారు. యజ్ఞం, దానం పుణ్యకార్యాలను చేసేటపుడు మనుషులు మంచి భావంతో వుండాలి. పరులకు సాయం చేసే స్వభావం కలిగినవారు గొప్పదాన శీలురుగా నిలుస్తారు.
విద్యాదానం వెలలేనిది. విలువైనది. పదిమందికీ నేర్పించే విద్యాదానంవలన ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. విద్యాదానం ఎంతో విలువ కలిగి సామాజిక సేవ కలవారికి ఆదర్శమార్గం చూపుతుంది.
తృప్తితో చేసిన దానం విలువైనది. వస్తద్రానం కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. వస్తద్రానం అంటే శరీరంపై బట్టలు లేనివారికి, చినిగిన వస్త్రాలు ధరించువారికి నూతన వస్త్రాలు దానము చేయడంవలన సంపూర్ణ ఆయుష్షు చేకూరుతుంది. కనుక పాత బట్టలు వేసుకున్న కడు పేదవారికి కొత్త బట్టలు ఇచ్చి మనం ఆదుకోవాలి. భక్తిశ్రద్ధలతో దానం చేయడం అలవర్చుకున్నవారికి సకల పుణ్యఫలములు సిద్ధించగలవని వేదములు చెబుతున్నాయి. ఆపదలోనున్నవారిని ఆదుకోవడం ద్వారా దాన ఫలములు పొందగలం. దానము అనేది ఎటువంటిది చేసినా పుణ్యకార్యమే. దానం చేసిన వారు ఉత్తమ ఫలాలు పొందగలరు.
దైవ సంబంధమైన కార్యక్రమాలలోనూ, యజ్ఞ యాగాది కార్యక్రమాలలోను దానం చేసిన యెడల అధికంగా పుణ్యఫలం అనుభవిస్తారు. సంతోషంతో చేసే దానం సంతృప్తినిస్తుంది. సాధువు అయిన బాటసారి తన ఇంటికి వచ్చినపుడు విసుగు కానక వారికి సపరిచర్యలు చేసి ఆశ్రయమిచ్చి అన్నదానం, ధనసాయం చేయడంవలన సౌఖ్యాభివృద్ధి సౌభాగ్యం లభిస్తాయి. పేదరికంలో వున్న కుచేలుడిని శ్రీకృష్ణుడు ఆప్యాయతతో ఆదరించి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాడు. అందుకే ఈ స్నేహదాన ఫలం లోకం మరచిపోలేదు. దానం చేసినవారికే దానఫలం సమృద్ధిగా లభించగలదు.

----

మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-ఎల్.ప్రపుల్లచంద్ర