మంచి మాట

మహాజ్ఞాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొట్టమొదట శ్రీరాముడు కిష్కింధలో సాధువేషంలో తన వద్దకు వచ్చిన మారుతిని మహాజ్ఞానిగా గుర్తించాడు. శ్రీరాముణ్ణి ప్రధమ దర్శనంలోనే తన వినయ విధేయతలతో, వాక్చాతుర్యంతో, పాండిత్యంతో మెప్పించి ప్రసన్నుని చేసుకున్నాడు. ఇదే విషయం పక్కనున్న లక్ష్మణుడికి తెలియజేశాడు.
హనుమంతుడు నూరు యోజనాల సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమైనప్పుడు తన సామర్థ్యంపై తనకుగల విశ్వాసం ఏమిటో నిరూపించాడు. సముద్ర లంఘనంలో మైనాకుడు, సురస, సింహికలు అవాంతరాలు కల్పించినపుడు భయపడి వెనుదిరిగి పోకుండా తన బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని లంకలో ప్రవేశించాడు. విజయం సాధించాడు.
రావణ సభలో ఎంతమంది రాక్షసులు చుట్టుముట్టి ఉన్నప్పటికీ రావణుడితో ధైర్యంగా మాట్లాడిన ధీరుడు హనుమంతుడు.
రాక్షసులు తన తోకకు నిప్పంటించి, నగర వీధుల్లో ఊరేగించడాన్ని హనుమంతుడు అవమానంగా భావించి క్రుంగిపోలేదు. దాన్ని ఓ అవకాశంగా వినియోగించుకొని లంకను సర్వనాశనం చేశాడు. శతృబలాన్ని నిర్వీర్యం చేశాడు.
సీతమ్మ కోసం లంకంతా గాలించాడు. కానీ సీతమ్మ జాడ కనుగొనలేని ఈ నా జన్మ ఎందుకని ఆత్మహత్య చేసుకోవాలని క్షణిక ఉద్వేగనికి లోనయ్యాడు. మానసిక స్థైర్యాన్ని, బుద్ధిబలాన్ని పరీక్షించేవి ఇలాంటి క్లిష్టపరిస్థితులే. హనుమంతుడు ‘బుద్ధిమతాంవర్థిష్టమ్’- బుద్ధిమంతులలో అగ్రగణ్యుడు కాబట్టి. వెంటనే అతని మనసులో ఆత్మహత్య చేసుకుంటే అన్నీ దోషాలే. కానీ జీవించి ఉన్నట్లైతే ఎన్నో శుభాలను బడయవచ్చు అని తలంచి నిరాశ నుండి బయటపడ్డాడు.
సీతానే్వషణ తిరిగి ప్రారంభించి, సఫలీకృతుడయ్యాడు. హనుమ ఇచ్చిన ఈ మహామంత్రం నిత్యం మననం చేసుకోగలిగితే క్షణికోద్వేగం, నిత్యం బాధలనుండి బయటపడగలుగుతాం.
రాముడు హనుమను కార్యనిర్వహణా సమర్థునిగా, పండితునిగా గుర్తించి ప్రశంసించాడు. శ్రీరాముడు ఇన్ని మాటల చెప్పినా హనుమంతుడిలో అహంకారం లేశమంతైనా కలుగలేదు. తనకు తాను రామదాసుగా దూతగా భావించాడు. ఇదే విషయం రావణుడితో చెప్పుకున్నాడు. సీతమ్మతో రాముని అంతర్ణిక భక్తునిగా చెప్పుకున్నాడు. ఆమె సందేహాలన్నీ తీర్చాడు. రాముడిచ్చిన అంగుళిమును అందజేసి ఆమె ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా తీసుకున్నాడు.
హనుమంతుడు హృదయంతో పనిచేస్తాడు. శ్రద్ధతో పనిచేస్తాడు. ఆవేశంతో పనిచేస్తాడు. ఆచనతో చేస్తాడు. ఆ పని వెనుక ఆ శ్రమ వెనుక, రామభక్తి ఉంటుంది. ఆత్మ సంతృప్తి ఉంటుంది. తాను ప్రకృతికి, సమాజానికి ఇవ్వగలిగింది ఇస్తున్నాననే ధన్యత కనిపిస్తుంది. అందుకే ‘మారుతి మహాజ్ఞాని’ అయినాడు. ‘జ్ఞానగుణసాగరుడు హనుమంతుడు’. సర్వాదులకన్న, పరమపదం కన్న, లాలా విభూతే తనకు ప్రీతి పాత్ర తలంపుతో రామనామ సంకీర్తన, సంశ్రవణం కోసం నిలిచి ఉన్నాడు. యత్ర యత్ర రఘునాథ సంకీర్తనం తత్ర తత్ర కృతమస్తుకా..... శ్రీరామాయణ పఠనంలో ఉన్న సమయంలో హనుమ వచ్చి కూర్చుంటాడనే విశ్వాసం ఉంది.
మారుతీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, జీవించగలిగితే, మానసిక సమస్యలన్నీ సమసిపోతాయి. ‘బలమే జీవనం బలహీనతే మరణం’ అన్న స్వామి వివేకానంద సందేశాన్ని ఆచరణాత్మకం చేయగలుగుతాం. ఆనంద జీవితం సాగించగలుగుతాం.
నేడు మనిషి మరమనిషిగా మారుతున్నాడు. అలసత్వం, అశ్రద్ధ, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ యంత్రాలను కాక ఆదర్శపురుషునికి దాసుడుగా ఉన్న శ్రీ హనుమంతుఢున్న సుందరాకాండ చదివితే మారుతీలాగా ఆలోచనతో చేస్తాడు. ఏ పనైనా శ్రద్ధతో చేస్తాడు. శ్రమతో చేస్తాడు. ‘శ్రద్ధా లభతే జ్ఞానం’. కనుక మారుతి గురించి తెలుసుకొందాం. మారుతి లాగా జీవిద్దాం.

- జమలాపురం ప్రసాదరావు