మంచి మాట

మితమే హితం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడు సంఘజీవి. సంఘం లేని మానవుని జీవితాన్ని ఊహించలేము. మానవుడు సంఘంలో పలువురితో కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు ఏవో కొన్ని కారణాల చేత అప్పుడప్పుడు మనఃస్పర్థలు, భేదాభిప్రాయాలు, కోపతాపాలు రావడం సర్వసాధారణం. అలాగే నలుగురితో కలిసి జీవించడంవలన సంతోషము, సుఖము కలగడం కూడా సర్వసాధారణమే.
కోపతాపాలు కలుగుతాయని, భేదాభిప్రాయాలు వస్తాయని మనిషి ఎవ్వరితో మాట్లాడకుండా ఉండలేడు. సంబంధం పెట్టుకోకుండా జీవించనూ లేడు. ఎందుకంటే మానవులు మూగజీవులు కాదు. వన్యప్రాణులు కారు. సమాజంలో జీవిస్తున్న మానవులు ఇతరులతో సత్సంబంధాలను ఏర్పర్చుకుని ఆనందమైన జీవితాన్ని గడపాలి. అయితే కొన్ని నిబంధనలను మానవులు అనుసరించాలి. వాటికి లోబడే జీవించాలి. ప్రేమించి, ద్వేషించినా అవధులు దాటకూడదు.
ఏది చేసినా అతిగా ఉండకూడదు. ప్రతిది మితముగా ఉండాలి. మితమే మనిషికి హితమైతే బాగుంటుంది. అందుచేత అతిగా కరుణ చూపడంకానీ, అతిగా కాఠిన్యం చూపడంగానీ, అతిగా ఉపేక్ష చేయడంగానీ, అతిగా చనువు ఇవ్వడంగానీ, అతిగా మాట్లాడటం గానీ, అసలు ఏమి మాట్లాడకుండా ఉండడంగానీ, అతిగా సుఖపడడంగానీ- ఇలా మంచి చెడు ఏ విషయంలోనైనా అతిగా ప్రవర్తించడం మంచిది కాదు. ప్రతి విషయంలో మితంగా వుండడమే శ్రేయస్కరమని భావించాలి.
ఎటువంటివారైనా కొన్ని సందర్భాల్లో మంచి చెడులో అతిగా ప్రవర్తిస్తారు. అతిగా మంచిని ప్రదర్శించిన, చెడు చేసిన అతివలన మనిషికి అనర్థం కలుగుతుంది. ఎందుకంటే కొన్ని సమయాలో మనిషి అందరూ నా మాట ప్రకారమే నా ఇష్టం ప్రకారమే నడుచుకొనాలంటారు. దీనికి ఏదైనా ఆటంకం కలిగిన అసంతృప్తికి లోనై అతిగా ప్రవర్తిస్తాడు. ఇటువంటి సందర్భంలోనే మనిషి సహనం వహించాలి. వాదోపవాదాలకు దిగకూడదు.
సంఘంలో మనం అందరితో కలిసిమెలిసి ఉండలేకపోతున్నామంటే మనలో లోపాలున్నాయని భావించాలి. ఈ లోపాలకు కారణం అతియని గ్రహించాలి. అతివలన జరిగే నష్టం ఇంతా అంతా కాదని భాగవతంలోని గజేంద్రుని కథ వింటే అంతా బోధపడుతుంది.
సంఘంలోని మానవులందరూ మంచివారు. ఎందుకంటే వారు ఏదో ఒక మంచి పని చేస్తారు. అందుకే అందరిపట్ల మనకు సద్భావన ఉంటే సమస్యలే దరిరావు.
ప్రతి మనిషికి కొన్ని మంచి చెడు వ్యననాలు వుంటాయి. బలహీనతలు ఉంటాయి. వాటిని మనం గ్రహించి మెదలాలి. అందరితో కలిసి మెలిసి ఉండాలి కాని కొంతమందితో మాత్రమే స్నేహంగా ఉండాలి. కొద్దిమందితోనే సన్నిహితంగా ఉండాలి. అందరితో కాదు. అందరితో స్నేహం చేస్తే ఎంత తొందరగా స్నేహితులమవుతామో అంతే తొందరగా భేదాభిప్రాయాలు వచ్చి విడిపోతాము.
మనం అతిగా ప్రవర్తించడంవల్ల విమర్శలు వస్తాయి. అవమానాలు ఎదురవుతాయి. అప్పుడు మన మనస్సు బాధ పడుతుంది. అతి లేకుంటే ఏవీ రావు. అందుకే ప్రతి ఒక్కరు హితమే మతమని నమ్మాలి. కోపతాపాలు, భేదాభిప్రాయాలు అసంతృప్తి, అసహనం, పంతాలు, పట్టింపులు లేకుండా మితంగా కలిసిమెలిసి ఉండాలి. అప్పుడే జీవితం సుఖంగా, సాఫీగా ఆనందంగా సాగుతుంది.

***
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

-జాధవ్ పుండలిక్‌రావు