మంచి మాట

గీతాపారాయణ ఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ ధర్మం ఎంత సనాతనమైనదో, సదా అంతా నూతనమైనది కూడా. అజ్ఞాన వివశుడై, అహంకారగ్రస్తుడై, అభిమాన మదోన్మత్తుడై, పశుప్రవృత్తితో పతనం కాకుండా, విద్యావినయ సంపత్తితో, వివేకంతో, విచక్షణాజ్ఞానంతో, సహనంతో సమాజ సేవ చేస్తూ, అణువణువున భగవంతుని దర్శిస్తూ, మాధవునికభిముఖంగా జీవితాన్ని కర్తవ్య భావనతో గడపమని, ఋగ్వేదం నుండి నేటి ఉత్తమ సాహిత్యం వరకూ, మానవునికి ప్రబోధం లభిస్తూనే ఉంది.
చక్కని సంస్కారంతో, మానసికంగా అంత ఎత్తు ఎదిగి శ్రద్ధతో ఉపయోగించుకొంటున్నవారు ఉన్నారు. ఏ విధమైన భేదభావన లేకుండా ‘లోకాస్సమస్తాస్సుఖినోభవంతు’ అని ఆకాంక్షించిన జాతి మన భరతజాతి. మన భావితరాలు, తన సుఖాల్ని లెక్కచేయకుండా, తోటివాని క్షేమానే్న ముందు ఆలోచించే ఉత్తమ సంస్కారం, చరిత్ర మనకున్న అమూల్య సంపద, ఆభరణాలు. భగవంతుని వ్యక్తస్వరూపమైన ఈ సమాజాన్ని సేవించడం ద్వారా మాధవసేవ చేయమని పరితపించిన దైవీ పరంపర మనది. ఇలాటి మహోదాత్తమైన ధర్మానికి మన తత్త్వశాస్త్రం మూలస్తంభంలాంటిది. భారతీయ తత్త్వ శాస్తస్రారమే భగవద్గీత.
భగవద్గీత ఈశ్వరుని హృదయం. ‘గీతా మే హృదయం పార్థా’ అని స్వయంగా ఈశ్వర స్వరూపుడైన శ్రీకృష్ణుడే చెప్పాడు. కావున గీత సకల శాస్త్ర సారం, సర్వస్వం. గీతను నిత్యం అధ్యయనం చేస్తూవుంటే, సంపూర్ణ శాస్తజ్ఞ్రానం లభిస్తుంది. భగవంతుని పొందుటయే గీతాశాస్త్ర పరమ ప్రయోజనం, అంతిమ ధ్యేయం.
గీతలోని మొదటి ఆరు అధ్యాయాలు కర్మోపాసనను గురించి విస్తారంగా, సవివరంగా బోధిస్తాయి. తరువాతి ఆరు అధ్యాయాలు భక్తి గురించి అనగా దైవోపాసన గురించి చెపుతాయి. చివరి ఆరు అధ్యాయాలు జ్ఞాననిష్ఠను గురించి ప్రబోధిస్తాయి. జ్ఞాన తత్త్వాన్ని ప్రతిపాదిస్తూ, సవివరణతో నిలుస్తాయి. అందుకే వీటిని కర్మషట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము అని వ్యవహరిస్తారు. భక్త్భివ శ్రేష్ఠత ఏమిటంటే అచంచల భక్తి ద్వారా కర్మ పవిత్రవౌతుంది. ఆ పవిత్ర కర్మ ద్వారా జ్ఞానం సులభంగా లభిస్తుంది. అందుచేతనే శ్రీకృష్ణుడు గీతలో భక్తికే అధిక ప్రాధాన్యత ఇచ్చి, బోధించాడు. ప్రతి అధ్యాయంలో ఏదో విధంగా భక్తి బోధ విస్తారంగా మనకు అందుతుంది.
కనుక కర్మ, భక్తి, జ్ఞానముల సమ్మేళనమే, సమన్వయమే గీతా ప్రసాదం. శాస్త్ర నియమానుసారంగా కర్తవ్య కర్మలను నిష్కామభావంతో ఎలా ఆచరించాలో గీత బోధిస్తుంది. జీవ, ఈశ్వర జగత్తులను గూర్చిన జ్ఞానం ఎలా సంపాదించాలో, అచంచల విశ్వాసంతో, అనన్య భక్తితో మానవులు తమ హృదయాన్ని భగవంతునికి ఎలా సమర్పించుకోవాలో విశదీకరిస్తుంది గీత. ఇవే మానవుని ముఖ్యకర్తవ్యాలుగా ప్రబోధించి, ఈశ్వర సన్నిధికి చేరే మార్గం సుగమం చేస్తుంది.
మరొక విశేషమేమంటే వ్యక్తిగత ఆత్మోద్ధరణకే గాకుండా, లోకకళ్యాణానికి తోడ్పడే వివిధ క్రియల్ని, ప్రబోధాల్ని ఎత్తిచూపే సర్వోత్కృష్ట గ్రంథం విశ్వసాహిత్యంలో భగవద్గీత ఒక్కటే. ఇంకొక విషయం కూడా గుర్తించాల్సి వుంది. ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రములవలె కాకుండా, గీత కర్మాచరణనే లక్ష్యంగా ప్రబోధిస్తుంది. అందుచేత ప్రతి నిత్యము ఒక్క అధ్యాయమైనా పారాయణం చేస్తే మనకు సకల శుభాలు ఒనగూడుతాయి. నిత్య వ్యవహారాల్లో పారాయణాన్ని విధిగా ఆచరించడం, అలా అలవాటుచేసుకోవడం ఆత్మోన్నతికి అత్యావశ్యకం. ఆచరణలో కృతార్థులమై, మనం పరమాత్మ కృపకు పాత్రులగుదాముగాక!

-పి.పాండురంగారావు