మంచి మాట

ఆరాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమనేభక్తి అంటారు. అపారమైన కృపారాశి యైన భగవంతునిపై నిశ్చలమైన ప్రేమనే భక్తి అంటారు. త్రికాలవేత్త, ఎల్లవేళలా భగవంతుని నామాన్ని విడవక భజించేవాడు అయన నారదుడే భక్తి సూత్రాలను ప్రవచిస్తూ ప్రేమనే భక్తి అని అన్నారు. భగవంతునిపై కలిగిన ప్రేమను వ్యక్తపరచడానికి పలు మార్గాలున్నా వాటిల్లో ప్రముఖమైనవి తొమ్మిది విధాలు.. వాటినే నవవిధ భక్తిమార్గాలన్నారు. ప్రతినిముషమూ భగవంతుని గూర్చిన వివరణాత్మకమైన కథలను వింటూ ఉంటే భగవంతుణ్ణి కీర్తించే కీర్తనలు విన్నా దానే్న శ్రవణము అన్నారు. భకత్రపహ్లాదుడు చెప్పినట్టుగా నడుస్తున్నా నిలబడి ఉన్నా, కూర్చున్నా, తాగుతున్నా, భగవంతుని మర్చిపోకుండా సదా ఆయన నామానే్న వింటూ నామానే్న జపిస్తూ ఉండడమే భక్తి అన్నారు. అట్లానే భగవంతుని కథలను గానం చేస్తే దానే్న కీర్తనం అంటారు. ఎందరెందరో వాగ్గేయకారులు, సంగీతజ్ఞులు ఇంకెందరో స్వామిని గూర్చి పలుతెరంగుల విజ్ఞానాన్ని వారి వారి సుమధుర గళంతో కీర్తిస్తారు. వారంతా ఆ భగవంతుని మీద ప్రేమతో తన్మయత్వం చెందుతుంటారు. వారి గానాన్ని విన్నవారు సైతం భగవంతుని గుణనామ కీర్తనలో మునిగిపోతారు.
భగవంతుని సౌందర్యానికి మురిసిన వారు భగవంతుణ్ణి వారికి నచ్చిన మూర్తిలో ఆవాహన చేసుకొని భగవంతునికి అలంకారం చేసినట్లు ఊహించుకుంటూ ఈ మూర్తికి అలంకారాదులను చేసి అర్చిస్తారు. ఇంకొంతమంది భగవంతుని మూర్తిని పూజిస్తున్నా వారికి అందులో భగవంతుడు నిత్యచైతన్యుడై కనబడుతాడు. ఒక భక్తురాలు ముక్కింటిని ముందు కూర్చుబెట్టుకొని నానావిధ ఉపచారాలు చేస్తూ తన్మయత్వం చెందితే మరొక భక్తురాలు మహావిష్ణువును తన విభుడుగా ఎంచి ఆయనతోనే ప్రేమైక జీవితాన్ని చవిచూచి చివరకు ఆ మహావిష్ణువులోనే లీనమై మహావిష్ణువు ఇల్లాలుగా కీర్తించబడుతుంది. నన్ను బ్రోవమని చెప్పవే మా యమ్మ సీతమ్మ తల్లీ అంటూ మరికొందరు భగవంతుణ్ణి తమ తల్లితండ్రిగా భావించి కీర్తిస్తారు.
మరికొందరు సఖ్యభక్తిని భగవంతునితో నెరుపుతారు. కుచేలుడనే భక్తుడు శ్రీకృష్ణుణ్ణి తన ప్రియనేస్తంగా భావించాడు. కృష్ణునితో ఆడుకున్నాడు, పాడుకున్నాడు, చదువుకున్నాడు. గృహసాథ్రశమం తీసుకొన్న తరువాత ఎవరింటికి వారు వెళ్లారు. కాని మనసున వారిద్దరూ మంచి స్నేహితులే. ఒకసారి కుచేలుని భార్య మన దరిద్రాన్ని పోగొట్టేనాథుడు శ్రీకృష్ణుడొక్కడే. మీరు వెళ్లి మీ చిన్నప్పటి స్నేహాన్ని గుర్తుచేసి మన దారిద్య్రానికి తిలోదకాలు ఇచ్చేట్టుగా వ్యవహరించండి అని సలహాఇచ్చింది. తన భార్య మాట విన్నకుచేలుడు కృష్ణుడు దగ్గరకు వెళ్లాడు. కృష్ణుడూ ఎంతో ఆదరంతో కుచేలుణ్ణి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసాడు. మహాదానందంతో ఇంటికి తిరుగుముఖం పట్టాడు. కాని దారిద్య్రాన్ని పోగొట్టమని కుచేలుడు అడగలేదు. కృష్ణుడు పోగొట్టుతా నని చెప్పలేదు. కాని వారి దారిద్య్రం పోయంది. శ్రీకృష్ణుని పై ఉన్న స్నేహం మరింత గట్టిపడింది. ఇట్లానే దాసాంజనేయుడుగా కీర్తిపొందిన కేసరి నందనుడు తన భగవంతుడు శ్రీరాముడని ఎంచుకున్నాడు. దాసాను దాసుడై శ్రీరాముని పాద సేవా భాగ్యంలోను, శ్రీరాముని మాట నిజం చేయడంలోను తాను శ్రమించాడు. తన్మయత్వం చెందాడు. రామ రామ రామ శ్రీరామ అనే నిత్యమూ నోరారా పలుకుతూ శ్రీరామపాదసేవా దురంధురునిగా పేర్గాంచాడు. లక్ష్మణుడు సైతం తన అన్ననే తనకు సర్వస్వం అని అనుకొని సేవాపరాయణుడయ్యాడు.
సఖ్యము, శ్రవణము, దాస్యము,అర్చనము, కీర్తనము, ఇవే కాక వందనము, సేవనము, ఆత్మనివేదనము, చింతనము అన్నవి కూడా భగవంతుని పై ఉన్న ప్రేమను వ్యక్తపరుచడానికి మార్గాలే. సర్వభూతాలు ఎవ్వని లోపలనున్నవో, ఏ పురుషుని చేత ఈ సర్వజగత్తు వ్యాపించబడి యున్నదో, అట్టి పరమపురుషుడు అనన్య భక్తి చేతనే పొందదగినవాడు- అని భగవద్గీత వివరించింది. కనుక భగవంతుని సృష్టిలో ఉన్న మనం మరలా భగవంతుని దగ్గరఅవడానికి మార్గాలే ఈ నవవిధ భక్తిమార్గాలు.

- సాయకృష్ణ