మంచి మాట

ఇంటింటా తులసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గోవిందుడు’ అనగా ‘శ్రీకృష్ణుడు’ తనను క్షణమైనా విడువలేని ‘గోపిక’లతో కలసి ‘బృందావన’ విహారం చేసేవాడని పూర్వకాలంలో ఇంటింటా చెప్పుకున్న విషయం పరమప్రసిద్ధమైనదే.
అందువల్ల ‘బృందావనం’ ఎంతో ‘పుణ్యప్రదమైనది’గా భావింపబడుతున్నది.
అన్ని చెట్లు పూవులు, పండ్లు ఇచ్చినందువల్ల ప్రత్యేకత నొందితే తులసి ‘ఆకులే తులసిమొక్కకు ప్రత్యేకతను ఆపాదించుతుంది.
‘తులసి వృక్షాన్ని’ ప్రతి ఇంటి ముందునా ఒక చదరపు అడుగు మేర కోట కట్టి, దానిలో రెండడుగుల ఎత్తు మాత్రమే పెరిగే మొక్కగా పెంచుతుంటారు. ప్రతి కుటుంబంలోని స్ర్తిలూ రోజూ ఈ ‘తులసి మొక్కకు’ నీరుపోసి, పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత గానీ ఆహారం స్వీకరించక పోవడంమన సనాతనమైన, విశిష్టమైన ఆచారం. ఈ ‘తులసి పూజ’ కేవలం భారతదేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ జరుగుతుంటుంది.
‘తులసి’కి ఉన్న ఔషధశక్తి వల్లే విశ్వవ్యాప్త ఆదరణ, ఆరాధన, ప్రాముఖ్యం లభించాయి- అంటే అన్ని రకాలైన రుగ్మతలకూ ‘తులసి’ ఔషధం లాగా సత్వరంగా సత్ఫలితాలను ఇస్తుంది.
అన్నిరకాలైన సాధారణ జ్వరాలూ, తలనొప్పులూ, కీటకాల కాట్లు, ప్రసూతి నొప్పులు, వికారం, వాంతులు, శ్వాసకోస సమస్యల పరిష్కారానికి ‘తులసి’ చాలా ప్రయోజనకారి. ఇంత ప్రయోజనాన్ని కలిగిఉన్న తులసిని హిందూ దేశంలో లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.
శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణ చైనా, థాయ్‌లాండ్, మలేషియాలలో కూడా ‘తులసి’కి ప్రజాదరణ ఉంది. ‘తులసి’ని ఆంగ్లంలో ‘హోలీబేసిల్’ అంటారు. అతి ప్రాచీన కాలంనుండి గ్రీకులూ రోమన్లతో సహా విశ్వవ్యాప్త ప్రజలందరూ ‘తులసి’కి ఎంతో విలువ ఇచ్చారు. ఇస్తున్నారు.
‘తులసి’ చెట్టులోని ‘వేరు’ల నుండి ‘చిగురుటాకుల’వరకు అనేక రోగాల నివారణకు ఉపయోగపడతాయి.
ముఖ్యంగా ఇంటి పరిసరాలలోనుండి దోమలను తరిమివేయించిన తులసి చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. మలేరియా, డెంగ్యూ జ్వరాలకు ‘తులసి ఆకులు’ విరుగుడుగా పనిచేస్తాయి. తులసి ఆకుల రసాన్ని తేనెలో కలుపుకొని త్రాగితే దాదాపుగా అన్ని రోగాలూ నయం అయిపోతాయి. శరీరం బరువు పెరిగినవారు క్రమం తప్పకుండా తులసి రసం త్రాగితే కావలసినంతమేరకు బరువు తగ్గిపోగల్గుతారు.
తులసి ఆకుల డికాక్షన్‌తో నోరు నింపుకొని పుక్కిలిస్తే దంత వ్యాధులూ చిగుళ్ల వ్యాధులు తగ్గిపోతాయి. అనేక చర్మరోగాల నివారణలో ‘తులసి’ రసం ప్రతిభావంతంగా పనిచేయడమేకాక చర్మాన్ని నిరంతరంగా కాపాడుతూ యవ్వనాన్ని కొనసాగిస్తూ ముసలితనాన్ని దరికి చేరకుండా చేస్తుంది.
తులసిలో పర్యావరణ పరిరక్షణ గుణాలు సైతం ఉన్నాయి. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో ‘తులసి చెట్లు’ ప్రముఖ పాత్ర వహిస్తాయి. తులసి మననుండి ఈగలను, దోమలను, ఇతర కీటకాలకూ దూరంగా ఉంచివేస్తాయి.
తులసి రసం, అల్లం రసం కలిపి అనేక రుగ్మతలకు ఔషధంగా వాడుకొనవచ్చు. దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరాల నివారణలో తులసి రసం, అల్లం రసం, నల్ల మిరియాల రసం కలిపి సేవిస్తే సత్వరంగా రోగ నివారణ జరుగుతుంది. ఆరోగ్య రక్షణలో ‘తులసి’ ప్రభావం ఎంతో అనుభవ పూర్వకంగానే ఎవ్వరికైనా తెలుస్తుంది. జీవిత పరిరక్షణకు తులసి మూలస్తంభంలాంటిది అని ఆయుర్వేదం పేర్కొంటున్నది. తులసి ఎంతో పవిత్రం అయినదనీ, సర్వరోగహారి కనుక ఆధ్యాత్మికంగాను, వైద్యపరంగాను తులసి మహత్తర శక్తి గలది. కనుక ప్రతివారు తులసిని పెంచడం ఆరంభిస్తే రోగాలకు దూరం కావచ్చు. భగవంతునిపై నమ్మకాన్ని పెంచుకోవచ్చు.

- సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి