మంచి మాట

కలియుగదైవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సకల చరాచర సృష్టిలో భగవంతుడు సర్వాంతర్యామి. ప్రతి జీవియందు పరమాత్మ వుంటాడన్నది జగమెరిగిన నిత్యసత్యం. మనకై భగవంతుడు దశావతారాలు దాల్చినా.. ఇంకా ఏదో చేయాలన్న తపనతో ఈ ఇలలో వెలసిన దైవం శ్రీ షిర్డీ సాయిబాబా. మనం పిలిస్తే పలికే కలియుగదైవం బాబా. ఎక్కడ పుట్టాడో ఎలా పెరిగాడో కేవలం మనకై మన మధ్య తిరుగాడిన ఇలవేల్పు బాబా. చెప్పుకోలేని దారుణ మారణాలు, విపత్తులు, వినాశాలు జరుగుతున్న ఈ కలియుగంలో ఇంకా భక్తి ఏదో మూల దాగుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం బాబా. ఎవరో మహాత్ములు చెప్పినట్లు సందుకో బాబావారి ఆలయం వెలుస్తుందనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు బాబా ఆలయాలు.
అలాంటి బాబా చెప్పిన ఏకాదశ సూత్రాలను ఓసారి మనసారా మననం చేసుకొందాము. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖపరిహారం, ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి, ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖ సంపదలందగలరు. ఈ భౌతిక దేహానంతరం సైతం నేనప్రమత్తుడనే, నా భక్తుల రక్షణ నా సమాధి నుండియే వెలువడును. నా సమాధినుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును. నా సమాధి నుండి నా మానుష శరీరము మాటలాడును. నన్నాశ్రయించువారిని, నా శరణుజొచ్చినవారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యం. నాయందెవరికి దృష్టిగలదో, వారియందు నా కటాక్షము కలదు. మీ భారములను నాపైబడవేయుడు, నేను మోసెదను. నా సహాయముగాని సలహానుగాని కోరినచో తక్షణమే ఇద్దును. నా భక్తుల గృహములయందు లేమియను శబ్దము పొడసూపదు.
ఇప్పుడు చెప్పండి! ఎంతటి మహాఅద్భుత సూత్రాలు ఇవి. ఇక్కడ ఎవరి నమ్మకం వారిది ఎవరి మనోభావాలు వారివి. ఈమధ్య ఇద్దరు మహానుభావులు బాబా గురించి నానా రచ్చ చేస్తారు. ఇది ఎంత మాత్రం భావ్యం కాదని గ్రహించాలి.
బాలుడిగా దర్శనమిచ్చిన బాబా.. అనుకోకుండా ఫకీరుగా మనకై ప్రత్యక్షమయ్యాడు. బాబా పలికే గొప్ప మాట- ‘అల్లా మాలిక్ హై! సబ్ కా మాలిక్ ఏక్‌హై!’- అంటే అందరికీ భగవంతుడు ఒక్కడే అని. ఎంత గొప్ప మాట అది. మానవత్వం లేని మతాలు. కుళ్ళు కుతంత్రాలు నేర్పే కులాలు.. మనకెందుకు? భగవంతుని దృష్టిలో అందరూ సమానులే అని బాబా చెప్పిన మాట ఎంత గొప్పదో.. మానవులుగా మనమే ఆలోచించాలి. బాబా చెప్పిన మరో గొప్ప మాట శ్రద్ధ, సబూరీ. మనం ఏమి చేసినా ఏ పని చేసినా శ్రద్ధ చాలా అవసరం. లేదంటే అంతా అస్తవ్యస్తం అవుతుంది.
అలాగే సబూరీ అంటే నిదానం, ఓపికగా ఉండాలి. తొందరపడితే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఈ రెండు మాటలు మనిషి మహోన్నతుడిగా ఎదగటానికి. బాబా ఏ పని చేసినా అందులో ఏదో మర్మం, ధర్మం దాగి వుండేవి. ఉదాహరణకు బాబా వస్తధ్రారణ, అతని నడవడి ఎన్నో రహస్యాలకు నిలయం. ఇల్లిల్లూ భిక్షమెత్తి వారు చేసిన పాప కర్మల భారం మోసాడు. వచ్చిన తెచ్చిన ఆహారాన్ని నోరులేని మూగజీవాలకు పంచాడు. ప్రజలను పట్టి పీడిస్తున్న ఎన్నో అరిష్టాలను తన శక్తితో పారద్రోలాడు. అడగకుండానే అన్నీ ఇచ్చాడు బాబా! అని తల్చిన వెంటనే తల వాకిట్లో నిల్చిన నిదర్శనాలు ఎన్నో.. ఎనె్నన్నో. సారుూ అని పిల్చినా.. అల్లా అని పిల్చినా.. జీసస్ అని పిల్చినా పలికే దైవం బాబా. చిరిగిన వస్త్రాలు ధరించినా.. యోగమాయను చూపించినా అన్నింటా మన క్షేమం, మేలు కోరేవాడే బాబా. గొప్పతనం మనం ధరించే దుస్తుల్లోనూ, నివసించే భవంతుల్లోనూ లేదని చెప్పిన మహనీయుడు బాబా. తన పాదాల చెంత గంగా యమనను చూసినా భక్తుల రోగాలను ఊదితో నయం చేసిన మహోన్నతుడు షిర్డీ సాయి. భక్తుల పాలిట కొంగు బంగారమై.. మనకై ఇలలో వెలసిన కలియుగ దైవం శ్రీ షిర్డీ సాయిబాబా. మనం హరియన్నా.. హరయన్నా.. సాయి అన్నా భగవంతుడు నీడలా మన వెన్నంటే వుంటాడు. ఎందరో అన్నార్తులకు అనుదినం ఆకలి తీరుస్తున్న సాయి నిలయాలు అన్నపూర్ణయై నిరంతరం అమ్మలా ఆదరిస్తున్నాయి. సదా కలియుగదైవం బాబాను తలుద్దాము. సుఖంగా జీవిద్దాము.

-కురువ శ్రీనివాసులు