మంచి మాట

కర్మఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవకోటిలో మానవ జన్మ సుకృతమైనది. దీన్ని మరిచిన కొందరు స్వార్థానికి ఇచ్ఛ వచ్చినట్లు మాట్లాడుతూ తాము కోరిన పనులు చేస్తుంటారు. దానివల్ల ఇతరులు కష్టపడతారనో లేక ఇతరులకు నష్టం వాటిల్లుతుందనో విషయాన్ని గ్రహించరు. దీనివల్ల ఆ పని చేసేవారికి పాపమొస్తుందని తలంపే ఉండదు. పాపాభీతి ఉండడం దైవం పట్ల నమ్మకం ఉంటే వారు తప్పక పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు. ఈ నాది నేను అనే అహంకారం వల్ల ఎన్నో పాపకృత్యాలకు అలవడి గర్వాన్ని అతిగా పెంచుకుంటారు.
ఇంకొందరు ఆలోచించకుండా తప్పుమీద తప్పులు పుంఖానుపుంఖాలుగా చేస్తూ ఉంటారు. చేసిన కర్మకు తాను అతీతడనని కర్మఫలం తన నంటదని లోకానికి చాటుతూ ఎదుటివారిలోని దోషాలను మాత్రమే ఎంచుతుంటారు.
కర్మసిద్ధాంతాన్ని నమ్మే భారతీయులు కర్మఫలాన్ని అందరూ అనుభవించవలసిందే అంటారు. దీనికి ఆధారంగా ఎన్నో పురాణ కథలున్నాయ. వాటిలో భీష్ముని కథ ఒకటి. భీష్ముడు కాశీరాజు కుమార్తెలు
విచిత్రవీర్యుని వివాహం కోసం కాశీరాజు ముగ్గురు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలను వారి స్వయంవరం నుండి సాల్వరాజును ఓడించి మరీ తీసుకువస్తాడు. కాని భీష్ముని వెంట రావడానికి అంబ ఇష్టపడక తాను సాల్వరాజును మాత్రమే పెళ్లి చేసుకొంటానని చెప్పింది. భీష్ముడు అంబమాటను వినిన తన్ను సాల్వరాజు దగ్గరకు పంపించాడు. కాని సాల్వరాజు మాత్రం తాను బీష్మునితో ఓడినందువల్ల అంబను స్వీకరించలేనని చెప్పాడు. అంబ దీనికి కారణం భీష్ముడని అనుకొంది. తాను పరమేశ్వరుని కోసం తపస్సు చేసి వరాన్ని పొంది శిఖండిగా మారి భీష్ముని మరణానికి కారణమైంది. అపుడు తాను స్వయంవరంలో చేసిన దోషానికే ఈవిధమైన శిక్షను అనుభవించానని అనుకొన్నాడు.
అట్లాగే భీష్ముడు ఓసారి తన రథానికి ఓ సర్పపు పిల్ల అడ్డుగా వస్తేరథం కింద పడిపోతే ప్రాణం కోల్పోతుందని భావించి తన బాణపు ములుకు తీసి దూరంగా విసిరాడు. కాని ప్రమాదవశాత్తు ఆ సర్పం కాస్త ముళ్లకంచెలో ఇరుక్కుని ఎటూ రావడానికి బయటపడడానికి వీలులేక చివరకు అక్కడే ప్రాణాలు విడిచిందట. దాని వల్ల భీష్ముడు కూడా మరణావస్థను అంపశయ్య పై అనుభవించాడంటారు. ఇవన్నీ శాస్త్ధ్రారాలు లేనివని అనుకొన్నా ఇతరులకు కీడు చేస్తే ఆ కీడు ఇబ్బడి ముబ్బడిగా మనకు ప్రాప్తమవుతుందనే నీతిని గ్రహిస్తే పాపాచరణకు దూరంగా ఉండవచ్చు.
పాపాచరణ వల్ల ఈవిధమైన కీడు వస్తే లేశమైనా పుణ్యకార్యం చేస్తే భగవంతుడు అమితంగా సంతోషించి ఆ పుణ్యకార్యానికి వేయరెట్లు ఫలితాన్ని ఇస్తాడనీ చెప్తారు. రామాయణంలో రాముడు రావణునితో పోరు కు వెడుతూ సముద్రం పై వారథి కట్టే నేపథ్యంతో వానరులు సాయం చేయడం చూచిన అల్పప్రాణి ఉడుత తన శక్తిమేరకు ఇసుకలో పొర్లాడి వంతెనపై వచ్చి తన శరీరాన్ని విదిలిస్తూ ఉండేదట. ఇలా ఎందుకు చేస్తున్నావంటే నేను కూడా వారధినిర్మాణంలో పాల్గొన్నాలన్న ఉత్సుకతతో నా శక్తిమేరకు ప్రయత్నిస్తున్నానంటే దాన్నిచూచిన రాముడు ఎంతో ముదమంది ఉడుతను దగ్గరకు తీసుకొని ఆ ఉడుత వీపుపై నిమెరాడట. ఇపుడు మనకు కనిపించే ఉడుతపై చారలు రాముని చేతి వ్రేళ్లేనంటారు.
ఇంత చిన్న సాయానికి వంశమంతా ఆనందించేట్టు వరమిచ్చిన ఆ రాముడు భగవంతుడేకదా. అందుకే ఎవరినీ కష్టపడక చేతనైనంత మంచిని చేస్తుంటే దాన్ని భగవంతుడు మెచ్చుతాడు. ఆ మంచికార్యమే పుణ్యకార్యమై వంశోన్నతికి కారణవౌతుంది. అంతేకాక మానవసిక శాంతిని కలుగుచేస్తుంది. మానవజీవన వికాసానికి కారణం అవుతుంది. కనుక చెడు పనుల జోలికి వెళ్లక చేతనైనంత మంచిని పెంచే పనులు చేయడం ఉత్తముల లక్షణం. మానవత్వ లక్షణాలను మనం పరిపోషించుకుంటూ జీవన యాత్రను నడిపించడం ఉన్నతుల గుణంగా కీర్తించబడుతుంది.

- రాంప్రసాద్