మంచి మాట

తొలి ఏకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీ సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలిఏకాదశి’గా అంటారు. పూర్వకాలమందు ఈ తొలి ఏకాదశితోనే సంవత్సర ప్రారంభంగా చూసేవారు. ఈ రోజును ‘శయన ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఎందువలన అనగా శ్రీమహావిష్ణువు ఈ రోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశివరకు యోగనిద్రలో ఉంటాడని, నాటినుంచి శ్రీహరి భక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్త్తిక శుద్ధ ఏకాదశి ‘ఉత్థాన ఏకాదశి’ వరకు ఆ నాలుగు మాసాలు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమే కాదు, సంసారులు, వయో లింగభేదము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తారు.
ఈ తొలి ఏకాదశినాడు గోపద్మవ్రతం చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు. ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది.
గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్ములయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీ దేవతలు, నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణ భాగమున వరుణ కుబేరులు, వామభాగమునందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మి, పాదాగ్రంబున ఖేతరులను, అంబా అంబా అంటూ అరిచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని, గోమాతకు ఇంత పుణ్యస్థానమిస్తూ అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నోగాథలున్నాయి.
అట్టిగోమాత నివసించే గోశాలను ఈ తొలి ఏకాదశి దినమందు మరింతగా శుభ్రము చేసి, అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది, గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్ఫై మూడు పద్మాల ముగ్గులు పెట్టి శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆ పద్మములపైనుంచి వారిని విధి విధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క అప్పడాన్ని వాటిపై ఉంచి, ఆ అప్పడాలను, వాయనాలను, దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణుని సంతుష్టునిగావించి, గోమాతను పూజించువారికి సకలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. పైవిధంగా గోపద్మవ్రతం చేయాలి.
ఏకాదశి వ్రతాన్ని ఆచరించదలచినవారు, దశమినాడు రాత్రి నిరాహారులై ఉండి, ఏకాదశినాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్ర్తి సాంగత్యం పనికిరాదు. కానిపనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయానే్న కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి.
అన్నదానం చేయటడం చాలా మంచిది. ముఖ్యంగా ఉపవాస దీక్షకు గల కారణాలు ఏమంటే, విష్ణువు వరంవల్ల అన్నంలో దాగిన పాపపురుషుడేగాక బ్రహ్మసాల ప్రదేశం నుంచి క్రిందబడిన చెమట బిందువు రాక్షసుడిగా అవతరించి నివాసమునకు చోటీయమని అడిగినపుడు, బ్రహ్మ ఏకాదశినాడు భుజించువారి అన్నంలో నివశించుమని వరమీయడంతో ఇద్దరు రాక్షసులు ఆ రోజు అన్నంలో నిండి వుంటారు గనుక ఉదరములో చేరి క్రిములుగా మారి, అనారోగ్యం కలుగుతుందన్న హెచ్చరికను పరోక్షంగా వెల్లడిస్తున్నాయి మన పురాణాలు.

- ఆళ్ళ నాగేశ్వరరావు