మంచి మాట

ఆశీర్వాద బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి హృదయం నుంచి వెలువడే శుభకామన దీవెన. ఇదియే హృదయపూర్వకమైన ఆశీర్వచనం. దీవెన, ఆశీర్వాదం అన్న వ్యవహారాలకు చాలా ప్రాధాన్యత వుంది. మానవ జీవితంలో పుట్టిన దగ్గరనుంచి జీవి మట్టిలో కలిసేవరకు సర్వ సృష్టికారకుడైన పరమాత్ముని కరుణా కటాక్షాలతోనే మనగలుతున్నాననే ప్రగాఢ విశ్వాసము విశ్వమంతా విస్తరించి ఉన్నది. అత్యంత స్వల్ప సంఖ్యాకులైన జనాల నమ్మకాన్ని ప్రక్కనపెడితే భగవంతుని అస్థిత్వంపై అచంచల విశ్వాసం కలిగిన ఆస్తికులు, మతవాదులే కాకుండా రమారమి సర్వమానవాళి దీవెనలో ఉండే బలం, అది అందించే స్ఫూర్తి, చేకూర్చే ఆత్మస్థయిర్యంపైననే ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారని చెప్పక తప్పదు. మానవ ప్రయత్నం ఎంత చేసినప్పటికీ.. విద్యార్జన విషయంలో గాని, ఒక కార్యాన్ని, లక్ష్యాన్ని సాధించే క్రమంలోగాని, ఒక విజయాన్ని చేజిక్కించుకునే అంశంలోగాని దైవకృప లేనిదే, పెద్దల ఆశీర్వాద బలం లేనిదే కార్య జయం సాధ్యపడదు అని నమ్మేవారి శాతం సమాజంలో అత్యధికం.
ఏ కార్యం సఫలం కావాలన్నా, చేబూనే పనిలో విజయం చేకూరాలన్నా ఆ ప్రయత్న కార్యసిద్ధికి మానసిక బలం కావాలి. ఏ పనిని ఉపక్రమించినా, ఆ కార్య నిర్వహణలో ఘన విజయం అందించమని భగవంతుణ్ణి భక్తిపూర్వకంగా అర్థించడంలో మానవ ప్రయత్నానికి ఏదో క్రొత్త బలం చేకూరినట్లుగా మానవ హృదయం భావిస్తుంది. ఆ భావనా బలం, ప్రయత్నం కలిసి ప్రయత్న కార్యంలో విజయానికి దోహదపడతాయి. విద్యార్జన, ఉద్యోగ బాధ్యతల స్వీకరణ, నూతన వ్యాపార బాధ్యతల్ని ప్రారంభించడం, వాణిజ్య సంస్థలను ఆరంభించడం, అలాగే గృహంలో శుభకార్యాల్ని తలపెట్టినపుడు ప్రతి ఒక్కరూ దేవున్ని ఆరాధించిన తర్వాతే పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాతే, తమ స్వీయ కుటుంబంలో సభ్యులైన జన్మనిచ్చిన తల్లిదండ్రులు,వారి తల్లితండ్రులను ఇతర పెద్దల ఆశీర్వాదం తీసుకుని కార్యక్రమ నిర్వహణకు సిద్ధపడతారు. ఆ పని చెయ్యడంలో వారి వ్యక్తిగత శ్రమ, కృషి ఎంత ఉన్ననూ మానవ ప్రయత్నానికి భగవంతుని దీవెన, తల్లిదండ్రుల, పెద్దల గురువుల ఆశీర్వాదబలం తోడయినదని నిండైన నమ్మకంతో బలమైన సంకల్ప బలంతో ముందడుగు వేస్తారు. కేవలం భగవంతుని కృప, పెద్దల, గరువుల ఆశీర్వాదబలమే కార్య జయానికి ముఖ్య కారణమని విశ్వసించేవారి సంఖ్య చాలా అధికం.
దేవుని దీవెనకు, పెద్దలు, గురువుల ఆశీస్సుకి నిజంగా బలముందా! అలా అయితే మానవ ప్రయత్నమెందుకు చెయ్యాలి! అన్న వితండ వాదాన్ని విడిచిపెడితే మనస్సునుండి పుట్టిన సంకల్పంవలననే అన్ని పనుల్ని మానవుడు నిర్వహిస్తున్నాడు. మనస్సే మనిషిని నడిపించే సాధనం శాస్ర్తియ కోణంలో విశే్లషించినా. మనస్తత్వ శాస్తవ్రేత్తల అభిప్రాయం కూడా మనస్సు కారణంగానే సానుకూల, ప్రతికూల స్పందనలు కలుగుతున్నాయి. మానవుని ప్రతి చర్యకు మనస్సు, అది స్పందించే క్రమమే ప్రధాన కారణం. మనస్సే మనిషి చేసే అనుకూల, ప్రతికూల నిర్ణయాలను ప్రభావితం చేసేది. ఈ సిద్ధాంతం రీత్యా మనస్సుకు, దాని భావనకు భిన్నంగా ఎవరూ ప్రవర్తించలేరు. ప్రవర్తనా రీతుల్ని ప్రభావితం చేసే శక్తి మనస్సుకి మాత్రమే ఉంది. భగవంతునిపై భక్తి, దేవుని దీవెనపై నమ్మకం అన్న భావన మనస్సునుంచి ఉద్భవించివే.
ఈ క్రమంలో ఆలోచిస్తే.. దీవెనకు, ఆశీర్వాదానికి ఎంత ప్రభావం, మరెంత శక్తి ఉన్నదో అవగతవౌతుంది. ఆ విషయాన్ని ప్రగాఢంగా నమ్మవలసి వస్తుంది. అన్ని సంకల్ప వికల్పాలకు మూలహేతువైన మనస్సు కోరే భగవదాశీర్వాదానికి, పెద్దలు, గురుతుల్యులు, సమాజంలో పూజ్యనీయులైన వారి దీవెనకు విజయాన్ని చేకూర్చే శక్తి ఉన్నది అన్న నమ్మకం చాలా సందర్భాలలో అనుభవైక వేద్యం కావడంవలననే ఈ నమ్మకం ప్రపంచమంతా ప్రబలి ఉంది.

-రాజ్‌కుమార్