మంచి మాట

ధర్మో రక్షతిః రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మో రక్షతిః రక్ష అనేది మన వేద వాక్కు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అనే భావం. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అనేది మతానికి, ఓ వర్గానికి సంబంధించి కాదు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని, మానవతా విలువలు మార్గదర్శనం చేసేది ధర్మం. ధర్మం అంటే ధారణ, ఆచరించి మన జీవితంలో విలువల ద్వారా వ్యక్తియొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది.
ధర్మము అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మన స్వధర్మం గురించి తెలుసుకోవటం అవసరం. ప్రప్రథమంగా నేనెవరు అనేది అవగాహన అయినపుడే ఆధ్యాత్మిక చింతనకు నాంది ప్రారంభం అవుతుంది. నేను అనగా గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని.. ఈ ఐదు తత్త్వాలతో తయారైన ఈ శరీరాన్ని అని భ్రమిస్తుంటారు. ఈ శరీరంలో దాగివున్న ఓ చైతన్య శక్తి, ప్రకాశ స్వరూపం ఆత్మ అనేదే ఈ నేను అని అర్థం చేసుకోవాలి.
నా యిల్లు, నా పిల్లలు, నా వ్యాపారం అనియు, నేను, నేను అనియు అనేకమార్లు ఉపయోగించుతుంటాము. నేను అనే మాట ఈ శరీరాన్ని, కర్మేంద్రియాలను నడిపించే ఆత్మకు సంబంధించిన విషయం. నాది అనే మాట ఈ భౌతిక శరీరానికి సంబంధించిన విషయం అని బ్రహ్మకుమారీలు ఆత్మతత్త్వాన్ని బోధిస్తున్నారు. ఆత్మ అనే సత్యాన్ని పరిశోధన చేసినట్టైతే ఆత్మ యొక్క ధర్మం శాంతి, ప్రేమ, ఆనందం, కరుణ, పవిత్రత.. ఈ గుణాలన్నీ కూడా ఆత్మ యొక్క సహజ స్వరూపాన్ని తెలియజేస్తుంది. నేను అనగా ఆత్మను జ్యోతి స్వరూపాన్ని అనే సత్యాన్ని గ్రహించినపుడు నేను అనగానే మన స్వధర్మం గురించి తెలుసుకోవాలనే ఆరాటం, తపన ప్రారంభం అవుతుంది.
స్వధర్మం శాంతి అనేది అవగతం అవుతుంది. ఎప్పుడైతే మనిషి స్వధర్మం శాంతిస్థితిలో స్ధితి అవుతాడో అపుడే శాంతియుత జీవితాన్ని కోరుకుంటాడు. సమాజంలో పరిస్థితుల ప్రాబల్యంవల్ల మనిషి ఆవేశానికి లోనవుతుంటాడు. అలాంటి సమయంలో నాకు కోపం వచ్చింది అనడం సహజం. కోపం వచ్చింది అనగా కోపం అనేది మన స్వయం గుణం కాదు. బయటినుడి వచ్చింది అన్నట్లే కదా.
వచ్చినవారు వెళ్లిపోతారు. కాని శాశ్వతంగా ఉండేవారు కాదు అనేది గ్రహించాలి. క్రోధం స్వధర్మం కాదు స్వధర్మం శాంతి. ధర్మరక్షణ అనగా మనం శాంతి సద్భావనలతో జీవన యాత్రలో వున్నట్లైతే ధర్మాన్ని రక్షించినవారం అవుతారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు వారి స్వధర్మం శాంతితో, శుభభావనతో వ్యవహరించినట్లైతే ప్రపంచ శాంతి, విశ్వ నమ నిర్మాణం జరుగుతుందని బ్రహ్మకుమారీల శుభ సంకల్పం.
నేను నాది అనే మాటలకు దూరంగా ఉంటూ నలుగురి మంచిని కోరుకుంటూ పనిచేయాలి. పరులకు హితం కలిగించేవాటిని ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఒకరికి ఆపద సమయంలో ఆదుకుంటే వారి కళ్లల్లో కనిపించే ఆనందం చూడాలి. ఆపన్నులను ఆదుకోవాలనే తలంపు నిత్యనూతనంగా ఉండితీరాలి. ఆకలితో అలమటించే వారిని అక్కున చేర్చుకుని వారి ఆకలి తీరే మార్గం చూపాలి. అలాంటి పనులు చేస్తే చాలు మన మన ధర్మాన్ని ఆచరించినట్లే అవుతుంది.

**
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు.
రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

-బ్రహ్మకుమార్ సాంబమూర్తి