మంచి మాట

వినాశహేతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదురుడు ధృతరాష్ట్రునితో ‘‘్ధర్మరాజు అజాతశత్రువు. మీరు దుశ్శాసనుణ్ణి పంపి ఆయనకు తమ పక్షాన క్షమాపణ కోరమని చెప్పండి. రాజ్యము సింహాసనము ధర్మరాజుకు అప్పగించండి’’ అని హితబోధ చేశాడు. పుత్ర ప్రేమకు వివశుడైన ధృతరాష్ట్రుడు ఎవరి సలహాలను వినే దశలో లేడు. ‘నీవు పాండవ అభిమానివి. నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే నీవు కూడా అడవులకు వాళ్ళతోనే ఉండిపో’ అని అన్న మాటలకు కలత చెందిన విదురుడు కామాక్యవనం ప్రవేశించి ధర్మజునితో తనకు జరిగిన పరాభవాన్ని వివరించి కొద్దిరోజులు వారితో అక్కడే వుండిపోయాడు.
ఒకరోజు సంజయుడు ధృతరాష్ట్రుని పనుపున కామ్యకావనానికి వచ్చి విదురునితో ‘‘్ధృతరాష్ట్రునకు కళ్లు లేకపోయినా ఆయనకు ఎప్పటికప్పుడు తగు సూచనలిచ్చి ఆయనకు మనశ్శాంతి కలుగజేస్తూ వచ్చావు. నిన్ను అన్నమాటలకు ధృతరాష్ట్రుడు బాధపడి నిన్ను తిరిగి పిలుచుకుని రమ్మని చెప్పాడు. అందుకే నేను వచ్చాను’’. ఈ మాటలకు తృప్తిజెందిన విదురుడు తిరిగి ధృతరాష్ట్రుని వద్దకు చేరుతాడు.
ఒకసారి వేదవ్యాసులవారు ధృతరాష్ట్రుని వద్దకు రాగా ‘‘మీరే దుర్యోధనునికి నచ్చచెప్పండి’’ అని ప్రాధేయపడతాడు. అపుడు వ్యాసులవారు ‘‘నేను మైత్రేయిని పంపుతాను. అతను దుర్యోధనుడితో మాట్లాడతాడని’’ చెప్పి వ్యాసులు వెళ్లిపోయారు.
వచ్చిన మైత్రేయిని ధృతరాష్ట్రుడు సాదరంగా ఆహ్వానించాడు ‘నీవే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాజ్యం పాండవులకు అప్పగించమని ధృతరాష్ట్రునకు మైత్రేయి మహాముని సలహా ఇచ్చాడు. వీరి సంభాషణ జరుగుతున్న సందర్భంగా దుర్యోధనుడు అక్కడికివచ్చాడు. ఈ మాటలను విన్న దుర్యోధనుడు ఈ సాధువులు, మునులు, రుషులు మా నాన్న మనసు చెడగొట్టడానికి వస్తున్నారని నిర్ణయానికి వచ్చాడు. ముందుకు వచ్చి మర్యాదరహితంగా తొడలు చరిచి వెళ్లిపోయాడు. దుర్యోధనుని ఈ ప్రవర్తనకు మైత్రేయ మహాముని కినుక చెంది ‘‘ఒక రోజు నీ ఉరువులు భగ్నం కావడం తప్పదు. భీముని చేతిలో నీకు నికృష్టపు చావు రాసి ఉంది’’ అని శపిస్తాడు. తాటకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవన్నట్టు అహంకారంతో ‘‘ఈ బైరాగులంతా పాండవ పక్షపాతులే’’ అంటూ విసుగ్గా వెళ్లిపోయాడు. ధృతరాష్ట్రుడు మైత్రేయుని శాప ఉపసంహరణ చేయమని ప్రార్థించగా ‘‘నీ కొడుకు పాండవులతో సంధి చేసుకొంటే అతడు క్షేమంగా ఉంటాడ’’ని చెప్పి తన దారిన ఆయన వెళ్లిపోయాడు. దుర్యోధనుని ఊరుభంగానికి ఇది ఒక కారణమని చెబుతారు.
బాల్యంలో ఒకసారి గాంధారి తన కొడుకు పాండు పుత్రులపై చేస్తున్న ఆగడాలను గ్రహించి ఎపుడైనా ముప్పు వస్తుందని ఊహించి ‘‘ఒకసారి నీవు నా గదిలోకి నగ్నంగా రమ్మని చెప్పింది. చిన్నవాడయినా బట్టలు అసలు ఏమీ లేకుండా వెళ్లడానికి సిగ్గువేసి తొడల ప్రాంతంవరకు ఉడుపులు ధరించి అక్కడికి వెళ్లాడు. కళ్లకు గంతలు కట్టుకొన్న ఆవిడ తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న సంజీవి పసరు పిల్లవాడి శరీరమంతా రాసింది. అప్పుడు ఆమెకు తెలిసింది, తొడల భాగానికి ఆ పసరు తగలలేదని. కాని ఇంక ఏమీ చేయలేమని ఆమె గుండె రాయి చేసుకొంది.
యుద్ధంలో భీముని ధాటికి తట్టుకోలేక ఓ మడుగులో దాగిన దుర్యోదనుడు పాండవుల నిష్టురపు మాటలు భరించలేక బయటకు వచ్చిన దుర్యోధనుడు భీమునితో ద్వంద్వ యుద్ధం చేస్తున్నపుడు యుద్ధ్ధర్మానికి భిన్నంగా తొడలపై గదాప్రహారం చేయడంతో దుర్యోధనుడు కూలిపోయాడు. బలరాముడు అక్కడకు చేరి భీముని దండించబోతాడు. అప్పుడు కృష్ణుడు ‘‘అన్నా! దుర్యోధనుడు ద్రౌపదిని తన తొడలమీద కూర్చోమని చెప్పినందున భీముడు తొడలను విరగగొట్టవలసి వచ్చిందని’’ సర్ది చెబుతాడు.
ఈ విధంగా మైత్రేయి శాపం దుర్యోధనుని మరణానికి దారితీశాయి.
అందువల్ల మనం ఎవరికీ అపకారం చేయగూడదు. అన్యాయపుటాలోచనలకు దారితీయకూడదు. అపుడు భగవంతుడు నీతినియమాలను, సత్యధర్మాలను ఆచరణలో పెడుతున్న మనలను కాపాడితీరుతాడు. ఈ సంసార సాగరంనుంచి అనాయాసంగా ఒడ్డుకు చేర్చి తన దరికి చేర్చుకుంటాడు. దానికి దేవుని గురించి స్తుతిపాఠాలకన్నా నెమరువేయాల్సింది నీతినియమాలు, సత్యధర్మాలే.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం