మంచి మాట

సంప్రదాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజం సక్రమంగా నడవడానికి అందులోని మనుష్యులు సజ్జనులుగా ఉండడానికి పెద్దలు పూర్వీకులు కొన్ని నియమాలను ఏర్పరిచారు. ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మానవాళికి కల్యాణం జరగాలని కొన్ని ఆచార సంప్రదాయాలు కట్టుబాట్లును ఏర్పరిచారు. ఈ నియమాలను, ఆచార సంప్రదాయాలను గౌరవించి వాటిని ఆచరించినవారికి సుఖసంతోషాలు కలుగుతాయ.
ఈ పనులు సమాజ శ్రేయస్సుకు ఎంతో ఉపయుక్తమనీ, సమాజాన్ని సన్మార్గంలో నడపడానికి ఎంతో అవసరమనీ తలచినవారు వాటినే ‘సత్సంప్రదాయాలు’ అని అన్నారు. ఆ పనులు మంచిని సర్వత్రా వ్యాపింపచేస్తాయ.
కట్టుబాటు చేసుకొన్న ఆ సంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకొనే వాళ్లు ఎవరైనా సమాజ వ్యతిరేకులుగా తయారు అవుతారు. వారి వల్ల సమాజం అస్తవ్యస్తం అవుతుంది. అందుకనే వాటిని అందరూ పాటించాలని పూర్వులుచెప్తారు.
సంప్రదాయాల్లో దైవికమయినవనీ, లౌకికమయినవనీ, భౌతికమయినవిగా ఉంటాయ. దైవ సంబంధమైన పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, ఊరేగింపులూ, పండుగలూ, జాతరలు మొదలైనవిఉంటాయ. ఈ దైవ సంబంధ విషయాలు అన్నీ పవిత్ర చిత్తంతో నిర్వహించాల్సిఉంటుంది. దేవాలయ సందర్శన కూడా ఈ సంప్రదాయాల్లో ముఖ్యమైన విషయం. ఈ దేవాలయ సందర్శనలో భౌతికశుచి, అంతర్గత శుచి ప్రధానం. వీటిని ఆచరించడానికి సమాజంలో ఎవరూ కూడా ఆక్షేపణలు చేయరు. అందరూ భగవంతుని భక్తులుగా మారడానికి ప్రయత్నిస్తారు. అందుకనే అక్కడ ఏర్పరిచిన నియమావళిని తప్పక పాటించే ప్రయత్నం చేస్తుంటారు. దేవాలయ సందర్శకులు నాస్తికులు అయనప్పటికీ వారు ఈ నియమావళి ఆరోగ్య రీత్యామంచిదని కూడా చెబుతారు.
కాని కొన్ని భౌతిక పరమైన అంటే లౌకికమైన సంప్రదాయాల్లో కొన్నింటిని కొందరు వ్యతిరేకిస్తారు. అవి నేటి సమాజానికి అవసరం లేదని వీరి వాదన. హేతుబద్ధంగా ఆలోచించి వాటిని పాటిస్తే అవి మానవ కల్యాణానికి దారితీసేవే ఎక్కువగా ఉంటాయ. కాని కొందరు స్వార్థపరులు వీటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ అమాయకులైన ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. వీరి వల్ల కూడా సమాజాభివృద్ధి కుంటుపడుతుంది. అందుకే పాటించే నియమాలను హేతుబద్ధంగా తర్కయుతంగా ఆలోచించి అవి మానవసమాజాభివృద్ధికి తోడ్పడేవిగా ఉండేలాగా చూడాలి.
పండుగలు, పబ్బాలు, ఉత్సవాలూ ఊరేగింపులూ జాతరలూ ఏయే సమయాల్లో ఎలా నిర్వహించాలి అనేవి కూడా సంప్రదాయానుసారమే నిర్వహించబడతాయి. పండుగల సందర్భాల్లో అభ్యంగన స్నానాలు చేయడం, కొత్త బట్టలు ధరించడం, దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం, దానాదులు చేయడం అనేవి సమాజంలో జరిగే సత్సంప్రదాయాలుగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనుష్యుల్లో మంచి పనులు చేయడానికి ప్రేరకాలుగా ఉపయోగపడుతాయ.
కులమతాల భేదాన్ని మరిచి అందరూ ఒకటే నన్నభావాన్ని కలిగించేవి సంప్రదాయాలను నేటి తరమూ పాటించాల్సిందే. ఈ కట్టుబాట్లను ఆచార వ్యవహారాలను అర్థం చేసుకొంటూ అందులోని మర్మాన్ని తెలుసుకొంటూ ముందు తరాల వారికి ఆదర్శప్రాయంగా మెలగడం అలవరచుకోవాలి. సత్సంప్రదాయాలను ఆచరించడం సజ్జన లక్షణంగా భావించాలి. ప్రతి మానవుడు అట్టి సన్మార్గంలో నడవటానికి ప్రయత్నించాలి.
మానవులంతా ఒక్కటే నన్న భారతీయతత్వాన్ని అర్థం చేసుకొని భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరుగా ఉండే భారతీయాన్ని ప్రపంచం యావత్తు కీర్తించేవిధంగా భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించే దిశలో ప్రతివారు మెలగవలసి ఉంటుంది. అపుడే వ్యక్తిగా సుసంపన్నుడు అవుతాడు. ఆదర్శపురుషుడుగా కీర్తించబడుతాడు.

- రామానుజాచారి