మంచి మాట

దీపం దర్శయామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హద్దులుమీరి ఇతరులపైబడి దౌర్జన్యములు కొనసాగిస్తున్నప్పుడు, కొంతకాలం ఓపిక, ఓర్పు పట్టటం సజం. సహనం అంతరిస్తే, అవతలివారిపై దాడి తప్పదు. దురాగతాలు, దౌర్జన్యాలు కొంతకాలం వరకే సాగేది. అన్యాయాలు, అవినీతి, అహంకారాలు మితిమీరినప్పుడు యుద్ధం అనివార్యమగును. తగు సమయంలో వారికి బుద్ధి చెప్పకపోతే ధర్మం నాల్గు పాదాలపై నిలబడలేదు.
దుష్టశక్తులు లోకంలో ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ పుడుతూనే ఉంటాయి. అవి తమ కండబలంతోనో, వరబలంతోనో తమ ఆధిక్యతను పెంచుకొంటాయి. అమాయక జనులు, సాధువులు, పిల్లలు, ముసలివారు స్ర్తిలపై తమ ప్రతాపం చూపుతారు. దేనికైనా సమయం రావాలని వారు బలవంతంగా కష్టనష్టాలు ఎదుర్కొంటారు. తమ చేతిలో లేనపుడు ఆ పైవాడిని ప్రార్థనలు చేసి తమ విన్నపాలు పంపుతారు. అవి క్రమక్రమంగా అధిష్ఠానానికి చేరతాయి. రాక్షస శక్తులపై తగిన సమయంలో తగు నిర్ణయాలు చేసి ప్రజలను కాపాడి సుఖశాంతులను ప్రసాదిస్తారు.
లోక కంటకులు పుట్టి వర బల గర్వితులై ప్రజలను నానా విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. వారిని అంతంచేసి ధర్మాన్ని పునఃస్థాపితం చేస్తే అది లోకులందరికీ హర్షదాయకం. కష్టాలనే అంధకారాన్ని దూరం చేసి వెలుగు అనే సుఖసంతోషాలను దూరం చేస్తాడు భగవంతుడు. కనుక ఈ సుఖసంతోషాలను దీపప్రజ్వలనంతో సూచిస్తారు. అట్లాంటి పండుగే దీపావళి. ఈ దీపావళి తర్వాత వచ్చే కార్తికంలోను ప్రతిరోజు దీపాలవరుసలను పేరుస్తారు. ఈ కార్తిక దీపాల అనేక జన్మల పాపరాశిని దగ్ధం చేస్తాయ. కార్తికంలో చేసే శివనామం దర్శించేదీపం వల్ల జన్మజన్మల పాపరాశి దగ్ధమవడమే కాక పుణ్యసంపద ఒనగూరుతుంది.
వేలాది సంవత్సరాలనుండి నిబిడీకృతమై వున్న అంధకారం ఒక్క వెలుగు దివిటితో అంతమైపోవును. ఒక్క కిరణపు ప్రభలవలన చీకటి సామ్రాజ్యం అంతమైపోవును. నిరంతరం ఈ లోకాలకు వెలుగునిచ్చేది సూర్యభగవానుడు. రాత్రి వెలుగులు చిందేవి నక్షత్రాలు, చందమామ. కాని ఒక్కొక్కసారి అవి తమ వెలుగులు ప్రస్ఫుటంగా చిందించలేవు.
యుగయుగాలనుండి మనుషుల జీవితాల్లో నైరాశ్యములను, కష్టాలను, బాధలనుండి ముక్తి చెందటానికి సుఖసంతోషాలు వెదుక్కోవటం మానవ నైజం. ఆ సంతోషాన్ని నలుగురితోను, బంధు మిత్రులతోను, ఆత్మీయులతోను పంచుకుంటే మహానాదంనం కలుగుతుంది. ఎన్నో సామాజిక, మానసిక ఆరోగ్య సూత్రాలు పండుగలల్లో నిబిడీతమై ఉన్నాయి. దీపాలు సుఖానికి శాంతికి చిహ్నాలు. చీకట్లు బాధలకు అజ్ఞానానికి అవివేకితనానికి చిహ్నాలు. చీకట్లు వీడడమంటే సౌఖ్యమొందటమేగదా!
దీపం లక్ష్మీదేవితో సమానం. దీపం విద్యకు సంకేతం. అజ్ఞానం చీకటి కాగా సుజ్ఞానం వెలుతురులకి సంకేతాలు.ఈ మాసంతో అఖండదీపార్చనలు ఆలయాల్లో ఇండ్లల్లోను చీక ట్లను పారద్రోలుతాయి. పుణ్యదినాలు ఆత్మను పరిశుద్ధం చేసే సూచకాలు దీపాలు. అందుకే దీపం దర్శయామి. మరి నేటి నాగరికత వలయంలోకూడా ప్రమిద పెట్టి నూనె వేసి, వత్తులు వేసి అనునిత్యం దీపారాధన చేయడం అంటే మన సంప్రదాయాలను మనం గౌరవించినట్లే.
ఇపుడు మనం ఇలా పండుగలు పబ్బాలు చేయడం వల్ల మన ముందు తరాలవారికి మన ఆచార సంప్రదాయాలను సంస్కృతీ వైభవాన్ని అందించడమే అవుతుంది. పండుగలు వాటి ప్రాధాన్యత పిల్లలకి తెలపటం అంటే మన సంస్కృతి నాగరికతలను కాపాడుకున్నట్లే.
ఆత్మలోని చీకట్లు పారదోలుకొని నిర్మల భావి జీవితాలకు తోడ్పడేదే దీపావళి పండుగ. కావున దీపం దర్శయామి, పాపం పరిహారయామి.

-లక్కరాజు శ్రీనివాసరావు