మంచి మాట

అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడి నిర్ణయాలు, మనుషుల కర్మ ఫలాలు కలిసి మానవ జీవితం నిర్మించబడి లోకంలో మనుగడ సాగిస్తుంది. సృష్టించిన కర్త, కర్మలకు బాధ్యతను ఆయా జీవులకే వదిలివేస్తాడు. మంచి చెడ్డలు, పాప పుణ్యాలు ‘చేసుకున్నవారికి చేసుకున్నంత’ అనే ప్రాప్తానికి కట్టుబడి ఉంటుంటాయి. కష్టసుఖాలు, కలిమిలేములు భూమిపై జన్మించినవారికి దాదాపు అన్ని వర్గాలవారికి వర్తిస్తాయి. ఏదీ మన చేతిలో ఉండదన్న విషయం విదితమే.
కావాలనుకున్నవి అందరికీ దొరికితే సమస్యే లేదు. కానీ ఆకార వికారాదులనుండీ ఎదుటివారితో పోల్చుకోవడంతోనే అసంతృప్తులు పుట్టుకువస్తాయి. ఎవరికీ ఏ సహాయం, స్వార్థం లేకుండా చేయని నేటి సమాజంలో, ధనప్రాబల్యంతో, అనురాగాలు అంతరించి, అసూయలతో ప్రబలే రాగద్వేషాలు ఎక్కువ కావడంతో, చాలామంది జీవనంలో విచారమే అలుముకుంటోంది. ఎవరి అదృష్టాలకు వారే బాధ్యులు. మనం ఇతరులకు తోడ్పనప్పుడు, వారి జోక్యం మనకు అనవసరంగా భావించాలి. ఒకరి వృద్ధి ఓర్వలేనపుడు ఎవరి పని వారే చేసుకుంటే, ఆనందంగా తృప్తిగా ఉండవచ్చు. మనకు లభించనవి, వేరొకరిలో వుంటే సంతోషిస్తూ, చేతనైన సహాయంతో వారిని అభినందించడంలో తృప్తే వేరు.
ధనికులు పేదలకు సౌకర్యాలు కల్పించాలి. ధనాన్ని సద్వినియోగం చేయాలి కానీ ఇంకా ఇంకా పెట్టుబడులతో పైకి రావాలనుకోవడం దురాశ. ఇందులో తృప్తి లభించదు. పైగా రక్షణ ఉండదు. అనుక్షణం భయంతో కాలం గడపాలి. ఫలితం అనారోగ్యాలు. ఉన్నది చాలు, ఎక్కువ ఉంటే దానధర్మాలు చేయాలి అని ఆలోచించేవారికి దుఃఖం దరికిరాదు. ఉపవాసాలు, తీర్థయాత్రలలో లభించని తృప్తి, సాటి మనిషికి సాయం చేయడంలో ఉంటుంది. కనపడని దైవాన్ని మనసులో ధ్యానంతో పూజించవచ్చు. ఎట్టఎదుట ఈతిబాధలు పడేవారికి, భాగవంతులు బాసటగా నిలవాలి.
అది పేరుకోసం కాకూడదు. ధర్మో రక్షిత రక్షతగా, మనం చేసే మంచి పనులు సత్ఫలితాలు ఇస్తాయి. ఆపదలో మనిషే భగవంతుడై కాపాడవచ్చు. పాపాలు చేస్తూ మంచి ఫలితాలను ఆశించరాదు. ఏమీ లేని పేదవారు పూటకు అందింది ఆస్వాదిస్తూ, తృప్తిగా నిద్రపోగలడు. హాయిగా నవ్వగలడు. కృత్రిమత్వంతో జీవించేవారికి ఆ హాయి అలభ్యం. మనస్ఫూర్తిగా, మంచిని గ్రహించలేనివారు, పనికిరాని పరిశీలనలతో తాము తప్ప ఇతరులందరూ అన్ని విధాలుగా బాగున్నారనుకుంటారు. బ్రతుకును సార్థకం చేసుకునేవారికి అందని అదృష్టం ఉండదు.
ఆకాశం అంచులు అందుకున్నామనే భ్రమతో బ్రతికేవారికి, చివరికి జరామరణాలతో క్రిందికి దిగిరాక తప్పదని తెలియాలి. శ్రమ విలువతో, నిత్య జీవనంలో, పరులకోసం పాటుపడేవారికి తృప్తిరూపంలో భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అసంతృప్తులకు, ఆ పరమాత్ముడు కూడా మనశ్శాంతిని ప్రసాదించలేడు.

............................
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు.
రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి.
మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి.
ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

- యం.వి.రమణకుమారి