మంచి మాట

వైశాఖ విశేషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాధవ మాసం వచ్చిందంటే మాధవుని భక్తులకు పండుగే. ఈ వైశాఖంలో మండే ఎండలకు ఉపశమనంగా మజ్జిగ, నీరు, గొడుగు, చెప్పులు, మామిడిపండ్లు, ఇతరమైన వాటిని, వాటికి మించిన అన్నదానం, వస్తద్రానం ఇలాంటి వాటిని దానం చేయడంవల్ల మాధవుడు సంతృప్తి చెంది పుణ్యఫలాలనిస్తాడని పురాణ వచనం. వైశాఖ స్నానాలు సైతం విశేషఫల ప్రదాలు.
ఈ నెలంతా సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానంచేయడం ఈ మాస ప్రత్యేకత. అలా నదీస్నానం చేయలేనివారు వారివీలును బట్టి కనీసం త్రయోదశి, చతుర్ధశి, పూర్ణిమ తిథుల్లో స్నానం చేసినా విష్ణు అనుగ్రహాన్ని పొందవచ్చునని శాస్తవ్రాక్యం. నదీస్నానాలకు వీలు లేనివారు గంగా యమునా కావేరి లాంటి పుణ్యనదులను స్మరించుకుని స్నానం ఆచరించినా వారికి అనేక పుణ్యఫలాలను మహావిష్ణువు అనుగ్రహిస్తాడు. తులసీ దళాలతోను, మల్లెలతోను లక్ష్మీసమేత విష్ణువును అర్చించాలని ఈ మాస ప్రత్యేకతగా పురాణాలు చెబుతున్నాయి . మహావిష్ణువు లక్ష్మీదేవి సమేతుడై ఈ మాసంలో భూలోకంలో సంచరిస్తాడని పెద్దలు చెబుతారు. అందుకనే అందరి నోట విష్ణునామాన్ని జపించితే మంచిదని అంటారు.
జమదగ్ని, రేణుకల పుత్రుడు పరశురాముడు. తన తల్లి పడే బాధను చూడలేక తన తండ్రిని అంతం చేసిన క్షత్రియులందరిని చంపివేసి తన తండ్రి తలను తెచ్చి జమదగ్ని శరీరానికి అతికించి తండ్రిని పునర్జీవితుడిని చేసిన పరశురాముడిని భార్గవ రాముడుగా ఖ్యాతి కెక్కాడు. అరాచాకాలకు పాల్పడే క్షత్రియులను 21 సార్లు దండయాత్ర చేసి క్షత్రియ నాశనం చేసిన పరశురాముడు తాను గెలుచుకున్న భూమినంతటిని కశ్యపునకు దానం ఇచ్చిన వీరుడు. మహాశివుని మెప్పించి పరశువును పొందిన పరశురాముని జయంతి ఈ మాసంలో వస్తుంది.
కేరళలోని కాలడీ గ్రామంలో శంకరుని అంశతో జన్మించిన శంకరులు జనుల్లో భక్తి బీజాలను నాటిన అపూర్వ దార్శనికులు. ఆ ఆదిశంకరుల జయంతి, మానవులంధరూ భగవంతుని బిడ్డలే కనుక భగవంతుడిని పూజించడానికి సర్వులూ యోగ్యతను కలిగి ఉన్నవారే అని చెప్పి తనకు తన గురువు అనుగ్రహించిన మహామంత్రాన్ని సర్వులకూ ఉపదేశించిన లోకకల్యాణకారుడెన భగవద్రామానుజుల జయంతినీ వేడుకగా ఈ మాసంలో చేస్తారు.
దుష్ట శిక్షణార్థం నరమృగ రూపంలో ఆవిర్భివించి హిరణ్యకశపుని ఆయన కోరిన విధంగా అటు పగలు, ఇటు రాత్రి కాక సంధ్యా సమయంలో ఏ ఆయుధాలు లేకుండా కేవలం గోర్లతోనే దుష్టశిక్షణ గావించిన నారసింహుని జయంతిని కూడా ఈ మాసంలోనే జరుపు తారు. అట్లానే సత్యనారాయణ స్వామి కల్యాణం, మోహినీ ఏకాదశి, బుద్ధ పూర్ణిమ లాంటి పర్వదినాలకువైశాఖం ప్రత్యేకతను వహించిఉంది.
రావిచెట్టు మొదళ్లను బాగా నీటితో తడిపి రావికి ప్రదక్షిణ నమస్కారాలు చేసినవారికి పితృదేవతల ఆశీర్వాదం లభ్యమవుతుంది. ఈవైశాఖంలోనే అక్షయ తృతీయ వస్తుంది. ఈఅక్షయతృతీయనాడు ఏది దానంచేసినా అది అక్షయమైన ఫలాలను ఇస్తుంది. ఒక్క విష్ణుసహస్రనామ పారాయణ చేసినా మహావిష్ణువు అనుగ్రహం అక్షయంగా లభ్యమవుతుంది.
సింహాచల అప్పన్నకు చందనోత్సవాన్ని ఈ తృతీయ నాడు చేస్తారు. ఈ వరాహ నరసింహస్వామి చందన ప్రసాదానికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు సింహాచలానికి తరలి వస్తారు. ఈ రోజున పెరుగన్నం దానం చేస్తే సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని శాస్తవ్రాక్యం.
శ్రీరాముని భక్తుడు, సీతమ్మ అనే్వషణలో ప్రధాన పాత్ర వహించిన వాడు, అమేయమైన ధైర్యశాలి, అవిక్రమ పరాక్రమ శాలి, సుఖలాలసలో మునిగిపోయ ఇచ్చిన మాటను మరిచిన సుగ్రీవుణ్ణి కర్తవ్యోన్ముఖుడిని చేసినధీశాలి. లంకలో ప్రవేశించడమే కాక రావణుని కోటకు వెళ్లి రావణునికి బుద్ధి గరిపిన బుద్ధిశాలి. పట్టుదలకు మారుపేరైన తేజశ్శాలి, భూతప్రేత పిశాచాదులకు అతిభయంకరుడు, అధర్మపరులకు అన్యాయం చేసేవారికి భయోత్పాన్ని కలిగించేవాడు. అటువంటి శ్రీరామ భక్తుడైన వాయునందనుడు ఈమాసంలోని బహుళ దశిమిని నాడు జన్మించాడని హనుమజ్జయన్తివేడుకలూ చేస్తారు.

- నాగలక్ష్మి