మంచి మాట

మానవ ప్రయత్నము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మిథ్యారూప జగత్తునందు మనుజుడు జనన మరణమనే భ్రాంతి చక్రములో పరిభ్రమించుచున్నాడు. కాని సర్వకాల సర్వావస్థలయందు ఆత్మరూపుడై అనుభవించుచున్నాడు. వర్ణాశ్రమ ధర్మములలో నిర్దేశించిన కర్మలు చేపట్టి నిర్వర్తించుట దైవ నిర్ణయం. లౌకిక ప్రపంచ జీవనములో సమస్త పదార్థాములు ఉత్తమ పురుష పయత్నముచే జనించుచున్నవని యోగ వాసిష్ఠములోని ముముక్షు ప్రకరణము తెలియచేయుచున్నది. పురుష ప్రయత్నమనగా మహిమాన్వితులైన సాధుపుంగవులు ఉపదేశించు మార్గమున పయనిస్తూ చేపట్టే ప్రయత్నమునే పురుష ప్రయత్నమనబడునని వసిష్ఠులు శ్రీరామచంద్రునకు బోధించెను. పట్టిన పట్టు విడవక శాస్త్ర ప్రమాణమును పాటించుచూ, మధ్యలో వెనుదిరగక ముందుకు పోవువాడే తన లక్ష్యమును సాధించగలడు.
పూర్వజన్మను మన సనాతనము పూర్తిగా విశ్వసించినది. అనేక ఇతర మతములు కూడా సనాతన భావమును అనుసరించి పూర్వజన్మను, పునర్జన్మను సమర్థించినవి. గత జన్మ వాసనలవల్ల, ఇహజన్మలో చేపట్టే కృత్యములవల్ల పురుష ప్రయత్నము సఫలమగును. పూర్వజన్మ వాసనలను గ్రహించి ఈ జన్మలో తీవ్ర ప్రయత్నము చేసినవారికే గత జన్మలో లభించని ఫలము ఈ జన్మలో లభించును.
ఆధ్యాత్మిక సాధకులకు గత జన్మ సువాసనలు లీలామాత్రముగా గోచరించుట మనం గమనించవచ్చు. ఎవరైతే సాధనతో వాటిని విశే్లషించి తమ మార్గమును నిర్దేశించుకొందురో వారే ముముక్షువులు. అనేక జన్మలు లభించినా ఆత్మ సాక్షాత్కారమును పొందలేకపోవుటకు కారణము కేవలం పురుష ప్రయత్న లోపము. కనుక ఆత్మను తెలుసుకొనుటకు నిరంతరం తపన అవసరం.
శాస్తమ్రు నిర్దేశించిన కర్మల నాచరించుట వలన మాత్రమే పురుష ప్రయత్నము శుభఫలము పొందగలదు. స్వధర్మాచరణ మాత్రమే అర్థవంతమైయుండును. పరధర్మాచరణ అనర్థకము మరియు వ్యర్థము.
సనాతనము నందు శాస్త్ర ప్రమాణములనగా వేద వేదాంగములు, వాటినుండి ఉద్భవించిన పురాణ, ఇతిహాసములు. అలాగే పురుష ప్రయత్నమనగా మానవ కృషి. ఆధ్యాత్మిక మార్గములో స్ర్తి, పురుషులు ఒకే శక్తిని కలిగియున్నారు.
నిన్న కలిగిన ఆహార దోషమును ఈ రోజు ఔషధముతో శమింపచేసుకొన్నట్లు, గత జన్మలోని ప్రారబ్ద ఫలము అశుభమైనా ఈ జన్మలో చేయు సంచిత కర్మల వలన శుభయోగమును పొందవచ్చును. సంచిత ప్రభావమే ఆగామిగా రూపొంది జన్మ రాహిత్యమా! లేక శుభవాసనాకృతమైన పునర్జన్మా! అనేది నిర్ణయింపబడును.
శుభపురుష ప్రయత్నము శోభను, అశుభ ప్రయత్నమువలన కీడు కలుగునని, అదృష్టమనునది అసలు లేదని వసిష్ఠుడు శ్రీరామచంద్రునకు విశదపరచి సదా లోకోపకారమైన ప్రయత్నమును చేయవలెనని నిర్దేశించినాడు.
పురుష ప్రయత్నము సూచించే శ్రమను విడిచి అదృష్టమును నమ్మినవాడికి సంపద అనే లక్ష్మి దరిచేరక పారిపోవును. ఎవరైతే బుద్ధిని ప్రశాంతమొనర్చి సంసార సాగరమును దాటునో వారు మోక్షమునకు అర్హులు. దుష్కర్మలు పశ్చాత్తాపమనే ప్రాయశ్చిత్తమువలన సత్కర్మలుగా మారి శుభములు చేకూర్చునని యోగవాసిష్ఠము తెలియచేయుచున్నది. భుజించేవానికే ఆకలి తీరును. నడచుట మొదలుపెట్టినపుడే గమ్యము దగ్గరగును. మంచి వక్తయే బోధించగలడు. కనుక ఆత్మను తెలుసుకొనుటకు శోధన అవసరము. వీటన్నింటికీ పురుష ప్రయత్నము అత్యంత అవశ్యము.
ఈ ప్రయత్నములో సమయము అత్యంత కీలకము. కలియుగములో స్వల్పమైన జీవిత అవధిలో క్షణమైనా వృధా కానీక సాధన మొదలుపెట్టవలెను. బాల్యమునుండే సత్సంగము, సత్యశాస్త్ర పఠనము అలవరచుకొనవలెను. అప్పుడే ప్రవర్థమానుడైన పిదప సత్కార్యములు చేపట్టి లోకోపకారుడగును. తనను తాను ఉద్ధరించుకొని లోకమును ఉద్ధరించును.

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు