మంచి మాట

సుఖశాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవానుడు సృష్టించిన ఈ సృష్టి మహోన్నత మైనదే కాదు మహాత్కృష్టమైనది కూడా. అందునా మానవ జన్మ ఇంకా మహత్తరమైనది. సమస్త జంతు జాలముతోపాటు మానవ మనుగడకు ఈ ప్రకృతి యే వరప్రసాదము. సృష్ట్యాదినుండి ఈ ప్రకృతి యే మనలను సంరక్షిస్తూ రక్షిస్తుంది. మానవుడు ఆధునిక సమాజములో నూరేళ్లు నవ్వుతూ గడపాలంటే పరి పూర్ణ ఆరోగ్యం ఉండాలి. సర్వకాల సర్వావస్థలలోను ప్రకృతి మాతయే సమస్త జంతు జాలమునకు మార్గదర్శి. ప్రకృతియే మనకు పాఠాలు బోధిస్తుంది. వ్రేలు పట్టుకుని నడిపిస్తుంది. అయినా మనం నిర్లక్ష్యంతో సోమరితనంతో, తృణీకార భావంతో ప్రవర్తిస్తూ రోజు రోజుకూ రోగాల బాటలో పయనిస్తున్నాము. మన ఇంట్లో ఒక రోగి ఉంటే అంతా అశాంతే.
మన నిత్య జీవన శైలిలో దిన చర్యలతోనే సమస్త రోగాలకు సుఖ పోషణ జరుగుతుందనడంలో ఎలాంటి సందేహాలకు తావులేదు.
మనిషి ఆరోగ్యం మనస్సుకు సంబంధించినది. మనస్సు మనిషికి సంబంధఇంచింది. ప్రకృతి మనిషికి ఎంతో అవినాభావ సంబంధమున్నది. ఇది జన్మ జన్మల అనుబంధం. ఈ పెనుబంధం నుంచి దూరమైన వారే అనారోగ్య వంతులు. ప్రకృతి జీవన విధానాన్ని అవలభించిన వారు సమాజంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. దేశాన్ని, సమాజాన్ని , వాతావరణాన్ని ఆరోగ్య వంతమైన బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే ప్రతి వ్యక్తి తమ యథాశక్తి పరిసర వాతావరణాన్ని పరిరక్షిస్తూ ప్రకృతితో మమేకమై ఆరోగ్య వంతులై చిరాయువు పొందుటకు ప్రయత్నించాలి.
‘‘ఆరోగ్యమే మహాభాగ్యం’’ అన్నారు పెద్దలు. మనకు ఎంత సంపదున్నా అష్ట ఐశ్వర్యాలతో తులతూగినా ఆరోగ్యం లేకుంటే జీవితమే వృథా అనిపిస్తుంది. ఆధునిక కాలంలో కల్మష వాతావరణంలో కల్మషారములతో కల్మష హృదయాలలో మనిషి ముప్పది యేళ్లకే మధు మేహవ్యాధితో సుఖానికి దూరవౌతున్నారు. ఈ రోజుల్లో మానవుడు ఆహార విహాల్లో సులోచనలలో దానవుల లాగా అనేక పొరపాట్లు చేస్తూ శారీరకంగా మానసికంగా హాయిని సుఖాన్ని అందుకొనలేక పోతున్నారు. మనం వచ్చిన కార్యం నెరవేర్చకుండానే నూరేళ్ల జీవితాన్ని స్వల్ప వ్యవధిలో ముగిస్తున్నాము.
ఒక ఉత్తమ లక్ష్యాన్ని సాధించుటకు మనకు ఈ మానవ జన్మ వచ్చింది. ఆ లక్ష్యంతోనే గమ్యం చేరేవరకు ఈ శరీరాన్ని ఒక సాధనంగా మ లుచుకొని వినియోగించుకోవాలి. శరీర మాద్యం ఖలు ధర్మసాధనం. అని పెద్దలు చెప్పే వున్నారుకదా. ధర్మసాధన చేయాలంటే ఈ శరీరం సదా ఆరోగ్యంగా ఉండాలి. మానసికంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రతి వ్యక్తి కి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అపుడే ఏ వ్యక్తి అయినా ఏ రంగంలో నైనా ప్రగతి సాధిస్తాడు. సాధించి జీవితాన్ని సద్వినియోగం చేసుకొంటాడు.
మనం వేరు ఈ శరీరం వేరు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాని మనస్సు కు వాహనం ఈ శరీరమే. ఏదేని ఒక వాహనం మంచి స్థితిలో ఉంటే నే కదా మనం గమ్యం చేరేది. వాహనంతో పాటు ఇంధనం కూడా పరిశుభ్రమైనదే కావాలి. పెట్రోలు తో నడిచే కారులో నువ్వుల నూనెను పోస్తే పని చేస్తుందా? చేయదు. అందువల్ల ఈ శరరమను వాహనం నడుచుట కూడా ఇంధనంగా పరిశుభ్రమైన మంచి ఆహారాన్ని వాడినపుడే దేహమనే ఈ వాహనం ఏ ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుంది.
అందుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను మనమే కారణం అవుతాం.
అందువలన మానవుడు పరిపూర్ణ ఆరోగ్యం పొంది నూరేళ్లు శతమానం భవతి... అనేలా హాయిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆహారపు అలవాట్లకు ఆయుష్షుకు అవినాభ సంబంధం ఉంది. ఇది గ్రహించి మనమందరమూ ఆరోగ్యంగా ఉండేదుకు ప్రయత్నించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని సార్థకం చేయాలి. పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంటే ప్రపంచంలో అన్నీ ఉన్నట్లే. ముఖ్యంగా సుఖ శాంతులు మన చెంతనే ఉన్నట్లుగా ఉంటుంది. అందుకు మనమందరం ప్రయత్నిద్దాం. అనుభవజ్ఞుల మాటను పదిమూటగా భావించుదాం.

పెండెం శ్రీధర్