మంచి మాట

సీతారాములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిగ్రహం, సదాచారం లాంటి సద్గుణాలు ఎవరికి ఉన్నాయ అని నాడు వాల్మీకి నారదుణ్ణి అడిగి తెలుసుకొన్నా, మాతృప్రేమ, పితృప్రేమ, భ్రాతృప్రేమ, ఏకపత్నీవ్రతం, ఎవరి లక్షణాలు అని పరిశోధించినా, పఠనం చేసి తెలుసుకున్నా జవాబుమాత్రం రాముడే. రామ అన్నపదం.... శబ్దం.... విన్నంతనే మధురమైన ఆనందభావనతోపాటుగా సజ్జనులకు మనసున మలయమారుతాలు వీస్తే శత్రువుల గుండెల్లో అతిభీకరమైన ప్రచండమైన ప్రళయం సంభవిస్తుందని నాడు మారీచుడు రావణుడికిచెప్పినట్టు, నేడు కూడా రామనామం వింటేచాలు కొందరు హాయననుభవిస్తే మరికొందరు మండిపడతారు. వారిని ఏ జాబితాలో చేర్చాలో మనం మారీచుని సహాయం అడగ క్కర్లేదు.
మునులు, సిద్ధులు, సాధువులే కాదు సాధారణులు కూడా రామనామంతో చిరపరిచితులైనట్లుగా ఆనందాన్ని అనుభవిస్తారు. తార తన భర్తను మృత్యువాత పడేట్లు చేసినా రాముణ్ణి కించిత్తు మాట అనకుండా వాలి అధర్మమే తన్ను గూల్చింది అని వాపోయంది. రాముడు ధర్మమూర్తి కనుక అంగదుణ్ణి యువరాజు ను చేయమని, సుగ్రీవుణ్ణి తారను సముదాయంచమని ప్రోత్సహించాడు. ఒక్క తారనే కాదు మండోదరి కూడా తన ప్రాణనాథుడు చేసిన అన్యాయానికే లంకంతా నాశనమయంది. సుతులను, నాథుణ్ణి కూడా నేను కోల్పోయేలా చేశాయని అంది. అధర్మప్రవర్తనుడైన ఏ భర్తనుంచైనా భార్యలు ఈవిధమైన శోకానికే గురవుతారని శోకించింది. అంతేకాని రాముణ్ణి తప్పు చేశావని అనలేదు. రావణాసురుడు కూడా రాముని వీర పరాక్రమానికి అచ్చెరు వొందాడు. తన సుతసోదరులతో పాటుసర్వ సైనికులనూ కోల్పోయాను కనుక ఇపుడు పిరికిపందగా వ్యవహరించి రామునిముందు మోకరిల్లను విజయమో వీరస్వర్గమో చూస్తాను అని అన్నాడే కాని రాముడు అధర్మం చేస్తున్నాడని అనలేకపోయాడు ఇదీ రాముని అరివీరభయంకరమైన పరాక్రమము.
ఇటువంటి ధీరచరిత్ర కలిగిన రామునికి సీత సహధర్మచారిణి. అక్కడక్కడా సీత సున్నితహృదయురాలుగానో, లేక అనుమానించే అబలగానో కనిపించినా అదంతా కూడా తన మాటను నెగ్గించుకోవడానికి వేసిన పథకపుటాలోచనలే అనిపిస్తాయ. వనవాస ప్రయాణకాలంలో రాముడు భూమిజను వద్దంటే నీవు పురుషరూపంలో కనిపించే స్ర్తివని అందరూ అనుకొంటారు. మానాన్న గారేమో నీవు పురుషోత్తముడవని, శూరుడవని నీకిస్తే వనవాసకాలంలో వచ్చే ఆపదలకు వెరచి నీవు నన్ను అంతఃపురంలో వదలిపెట్టి పోతావా అంటుంది. అపుడు ఈ సీత హృదయం రామునితో పాటు పద్గునాల్గేండ్లు వనవాసం చేయాలన్న కోర్కె తీర్చుకోవడమన్న దానిపైన లగ్నమైఉన్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి మనసే మనకు వనవాసంలో మాయలేడి అనే్వషణలో వెళ్లిన రామునికి ఆపదను నివారించడానికి తోడు వెళ్లమనే సీతలోను కనిపిస్తుంది.
రామునికి ఏంకాదు ఏ భయమూ లేదు.నేను నీ చెంతనే ఉంటాను. నీకే రక్షణ కావాల్సింది అమ్మా అనే లక్ష్మణుణ్ణి చూచి సీతమ్మ అపరిమితమైన కోపాన్ని ప్రదర్శిస్తుంది. నీ ఆలోచన నాకు అంతా ముందే తెలుసు. ఒకవేళ నీవు నీ ఆలోచనను అమలు చేద్దామనుకొంటున్నావేమో నేను ఇపుటికిపుడే యమసదనానికి వెళ్తాను అని గట్టిగా మాట్లాడుతూ కన్నీరు కారుస్తుంది. ఈ సంఘటననుచూచి సీత బేల అనుకొంటే పప్పులో కాలేశామే. ఎందుకంటే ఇక్కడ సీతమ్మకు కావాల్సింది కేవలం లక్ష్మణుడు రామునికి తోడుగాపంపించడమే ఏమి మాట్లాడితే అక్కడ్నుంచి లక్ష్మణుడు వెళ్తాడో అని ఆలోచించి అట్లా చెప్పింది. అదే సీతమ్మ రావణుని చెరలో ఎక్కడా భయపడినట్టు కనిపించదు. పైగా రావణునికి బుద్ధిమాటలు చెప్తుంది. నీ రాజ్యంలో నీకు మంచి బుద్ధులు చెప్పేవారే లేరా అంటుంది అంటే రాజ్యంలోని వారందరూ రాక్షసులు అక్కడ్నుంచి తప్పించుకోవడానికి వీలులేదు అతడి ఆధీనంలోను, రాక్షస స్ర్తిలకాపలాలో ఉంటున్న సీత రావణుని ప్రలోభాలకు తలవొగ్గలేదు. పైగా రాముడే గొప్పవాడని నీవేవిధంగా గొప్పకాదు నీచబుద్ధి కలవాడివని అంటుంది. ఇక్కడ సీతలోని నిజమైన ధీరోదాత్తత కనిపిస్తుంది. స్థితప్రజ్ఞత కనిపిస్తుంది. సీతారాములు అందుకే అనురూపులం టారు.

- రాంప్రసాద్