మంచి మాట

జగమంతా రామమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్ర శుద్ధ నవమి నాడు అయిదు గ్రహాలు ఉచ్ఛ స్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్య పుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాము.
‘రామ’ యనగా రమించు అని అర్థం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయ కమలమందు వెలుగొందుచున్న ఆ శ్రీరాముని కనుగొనుచుండవలెను. అగ్నిని మనము తెలిసియో, తెలియకో తాకినచో అది ఎట్లు దహించునో, అట్లే శ్రీరామనామ ధ్యానంతో మన పాపాలన్నీ దహించివేయబడును.
మనము శ్రీరామ నామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరుచుకుని మనలోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి. అలాగే ‘మ’ అనే అక్షరాన్ని ఉచ్చరించినపుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే పాపాలు ఏవి మనలోకి ప్రవేశించలేవు. అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మ రాహిత్యాన్ని కలిగిస్తుంది.
చైత్ర శద్ధ నవమి చాలా పవిత్రమైనది. శ్రీరామచంద్రమూర్తి కళ్యాణమూ, శ్రీరాముడు రావణుని వధించి సీతా సమేతుడై దిగ్విజయంగా అయోధ్యకు వచ్చినదీ కూడా ఈ శ్రీరామనవమి నాడే. మరునాడు అనగా దశమినాడు శ్రీరామచంద్రమూర్తికి సార్వభౌమునిగా శ్రీరామ పట్ట్భాషేకము జరిగింది కనుకనే ఈ నవమికి ఇంత విశిష్టత యున్నది.
శ్రీరామ పట్ట్భాషేకమూ, సీతారామ కళ్యాణమూ రెండూ కూడా రామ జననం రోజే జరిగినవి. అందువల్ల అందరూ కళ్యాణోత్సవం, పట్ట్భాషేకోత్సవం కూడా శ్రీరామనవమి నాడే చేస్తారు అనాదిగా.
ఒకనాడు దేశంలో క్షాత్రశక్తి సంకోచించుకుపోయింది. ధర్మాన్ని, ధర్మాచరణ చేసే ప్రజలకు చక్రవర్తి రాజు లేడు. ప్రతి వ్యక్తీ మోహ నిద్రలో పడి వుండిన కాలమది. రావణాసురుని ఆగడం మితిమీరింది. ఋషులూ, మునులూ, సామాన్య ప్రజలూ సుఖంగా నిద్రపోయే యోగానికి నోచుకోలేదు. అలాంటి సమయాన శ్రీరామచంద్రుడు కోదండం చేత ధరించి, రాజ్యాన్ని, స్వీయజనాన్ని, సుఖాన్ని వదలి పదునాలుగేండ్లు వనవాసంలో తిరుగుతూ రాక్షసులను సంహరించి లోక కంటకుడైన రావణాసురుని వధించాడు. పామరుడైన పడవ నడిపే గుహుని నుండి మహా తపస్సంపన్నులైన ఋషుల దాకా- గిరిచర వనచరులతో సహా సమాజాన్ని సంఘటితపరచి, రావణాసురునిపై దాడిచేసి లోకాన్ని బాధాముక్తం చేశాడు.
శ్రీరాముని చరిత్రే ఒక మహాద్భుత సందేశం. సహస్రార్జునుడు జమదగ్నితో కయ్యానికి దిగి, తనతో క్షాత్ర జగత్తునంతటినీ సంహరించి, పరుశురాముని సృష్టికి కారకుడైనాడు. అలాంటి పరుశురాముని కశ్యపాది ఋషులు దాదాపు నిష్కాసనం చేసినట్లు తొలగిస్తారు. ఆ తరువాత సాగిన వశిష్ఠ విశ్వామిత్రుల వైరం సాగి సాగి చివరకు శ్రీరాముని జన్మతో ఈ రెండు ధారలు ఏకమై రామరాజ్య ప్రతిష్ఠకు దోహదం చేశాయి. సమాజ స్వయంభూశక్తిని రాజశక్తి తృణీకరించరాదు. రాజశక్తిని సమాజ స్వయం భూశక్తి ధిక్కరించరాదు. రెండింట సమన్వయాన్ని సాధించి జన్మించిన భారత సంస్కృతీ స్వరూపుడు శ్రీరామచంద్రుడు.
భారతీయుల దృష్టిలో శ్రీరాముడు ఆదర్శ రాజు, ఆదర్శ సోదరుడు, ఆదర్శ పతి, ఆదర్శ పురుషుడు. భారతీయతే ఆయనగా అవతరించిందంటే అది సనాతన సత్యం. భారతీయులకే కాదు మానవ ధర్మమైన సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి వ్యక్తికీ అంతా రామమయం, జగమంతా రామమయమై తెలిసింది. అందుకే నాడే కాదు నేడు కూడా వాడవాడలా శ్రీరాముని జన్మదినాన ఆయన ఆరాధన జరుగుతూనే వున్నది.
శ్రీరామచంద్రుని స్మరించే వారిని ఏ చెడు గ్రహముల బాధలూ కలుగవు. గ్రహబలమేమి, రామానుగ్రహం బలముగాని’ అని కదా రామభక్తుడైన శ్రీరామదాసు తన కీర్తనలో శ్రీరాముని కరుణను కీర్తించాడు.

-ఆళ్ళ నాగేశ్వరరావు