మంచి మాట

కర్తవ్యపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రపంచంలో జరిగే యుద్ధాలు, విధ్వంసాలు అనేక అనర్థాలకు, కరువు కాటకాలకు, ఎడతెగని దుఃఖాలకు హేతువులని అనేక యుద్ధాల అనంతర పరిణామలా, అనుభవాలు చెబుతున్నాయి. ఓడినవారు గెలిచినవారు కూడా తరువాత పాశ్చాత్తాప దగ్ధులు అవుతారు. అందుకు మహాభారత యుద్ధం మనకు మంచి ఉదాహరణ! విజయం సాధించిన పాండవులు కూడా ఎందరో బంధువుల్ని, మిత్రుల్ని, పుత్రుల్ని కోల్పోయారు.
ఆ విషాదాంతాన్ని ముందే ఊహించిన మేధావి, తార్కికుడు అర్జునుడు! అతని చింతన, కృష్ణ్భగవానునితో అతని వాదన, ఎంతో విజ్ఞతతో హేతుబద్ధతతో సాగింది. అది భావి తరాలవారిని ఆలోచింపజేసేదిగా వుంది. అదే అర్జున విషాదయోగం! అది భగవద్గీతలోని పదునెనిమిది ఉత్తమ అధ్యాయం. గురుభక్తిలోగాని, తాత్విక చింతనలోగాని, కృష్ణ్భక్తిలో గాని, అర్జునునికి సాటి రాగలవారులేరు.
యుద్ధ సన్నద్ధులై వున్న కౌరవ, పాండవ సేనల మధ్య రథం నిలపమని అర్జునుడు కృష్ణ భగవానుని కోరాడు. పార్థసారథి కృష్ణుడు కౌరవ సేనలోని ప్రముఖ యోధులైన భీష్మ ద్రోణ, కృపాచార్య, కర్ణ, శల్య, భూరిశ్రవాది యోధులకు అభిముఖంగా రథం నిలిపాడు. అందరినీ పార్థుడు పరిశీలనగా తేరిపారజూశాడు.
తన ముత్తాత శంతనునికి తమ్ముడు అయిన బాహ్లికుడు, ఆయన కుమారుడు, భీష్మునికి తమ్ముడు అయిన సోమదత్తుడు, ఆయన కుమారుడు, పాండురాజుకు తమ్ముడు అయిన భూరిశ్రవుడు, కౌరవ పక్ష సైన్యంలో కనిపిస్తున్నాడు. వారందరికీ పాండు కుమారుల పట్ల ప్రేమ వున్నా వారంతా హస్తినాపుర సామ్రాజ్యానికి అధీనులు కనుక కౌరవ పక్షంలో వుండాల్సి వచ్చింది. అర్జునునికి కనిపిస్తున్న కౌరవ సైన్యంలో అన్నలు, తమ్ములు, ఆచార్యులు, బావలు, మరుదులు, మామలు, మేనమామలు, తాతలు, తండ్రులు, తనను ఎంతో ప్రేమించే సోదర సమానులైన మిత్రులు వున్నారు. ఈ యుద్ధంలో మహావీరుడిగా పేరు గడించిన నేను శత్రువధకు మారుగా మిత్రవధకు పాల్పపడాలా! బంధు వధకు పాల్పడాలా! నాకు వున్న దివ్యాస్త్ర శక్తితో, ధనుర్విద్యా కౌశలంతో, ధైర్య సాహసాలతో, వీరిని చంపి సాధించేది విజయమా? పాపమా? ఈ విజయం నాకు వద్దు! ఈ పాపం మూటగట్టుకోలేను! అని అర్జునుడు అశ్రుపూర్ణాకులేక్షణుడు అయ్యాడు. కన్నీరు ధారలై జారింది. గాండీవం చేతిలోనుండి జారింది. రథంపై కూలబడ్డాడు.
ఈ పరిణామాన్ని ముందే ఊహించిన మాయానాటక సూత్రధారి, రథసారథి కృష్ణ్భగవానుడు అలా శోకంలో మునిగి వున్న అర్జునుణ్ణి ఓదార్చి తిరిగి యుద్ధసన్నద్ధుడిని చేసే ప్రయత్నాన్ని ప్రారంభించాడు.
అర్జునా! యుద్ధసన్నద్ధుడివై ఈ సమరాంగణానికి వచ్చి ఈ సమయంలో శోకించటం తగదు. ఇది అనార్యజుష్టం! (శ్రేష్ఠునికి తగనిది) అస్వర్గం! (స్వర్గానికి చేరనీయనిది) అకీర్తికరం (నీ కీర్తిని నశింపజేసేది)! ఈ మనోదౌర్బల్యాన్ని వదిలెయ్యి. ఇది హీనమైనది! లే! యుద్ధానికి సిద్ధపడు! అని ఎన్నో విధాలా పురికొల్పాడు.
శ్రీకృష్ణ్భగవానుడు తన వాక్చాతుర్యంతో పార్థుడికి నచ్చచెప్పి, విభూతి యోగంతో తన సర్వశ్రేష్ఠతలు వివరించి, విశ్వరూప సందర్శనతో విజయుని విషాదాన్ని అంతంజేసి, యుద్ధోన్ముఖుణ్ణి చేశాడు. విజయుడు ప్రధాన యోధుడుగా పాండవ పక్షం విజయం సాధించినా, ఇరుపక్షాలలో అపార జన నష్టం జరిగింది. యోధాగ్రేసరులందరూ హతులయ్యారు. అర్జునుడు చెప్పింది అక్షరాలా సత్యమైంది.
కనుకనే ఈ క్షణభంగురమైన జీవితంలో ఎప్పుడూ పోరాటాలే కాక దైవం పైన ఆరాటంతో ప్రతి క్షణం పుణ్యకార్యాలతో సద్వినియోగం చేసుకొని చివరాఖరకు నిత్యము సత్యమూ అయన పరంధాముని సన్నిధికి చేరుకోవాలి.

- పారుపల్లి వెంకటేశ్వరరావు