మంచి మాట

విజయసోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స హనం వహించడం అంటే భయపడ్డంకాదు. క్లిష్టపరిస్థితులకు దూరంగా వెళ్ళడం అసలు కాదు. విరక్తి చెందడం కానే కాదు. చేతకానితనం అంతకన్నా కాదు. ఎట్టి క్లిష్ట పరిస్థితులనైనా భరించగలిగే స్థితి సహనం. సహనం అనేది మనికి ఒక తపస్సులాంటిది. కొంతమంది ఒక కార్యాన్ని తలపెట్టి సరియైన శ్రమలేని కారణం చేతనో లేదా ఏ ఇతర కారణం చేతనో విఫలం అయితే విపరీతమైన అసహనాన్ని ప్రదర్శిస్తారు. సజ్జనులు కష్టదశను పొందినా వృక్షము, చంద్రునివలె మళ్లీ అభివృద్ధిలోకి రావచ్చునని బాధపడరు. ఏది ఇబ్బంది కలిగిస్తుందో దానిపట్ల సానుకూలంగా ఆలోచించడమే సహనం. సహనం ఒక నిగ్రహశక్తి, ఒక మానసిక పరిపక్వతగల స్థితి. ఎదుటివారిలోని ఏ గుణం మనకు కోపాన్ని తెప్పించి సహనాన్ని పోగొడుతుందో దానిని మనలోకి ఆవహింపచేసుకోవడమే సహనం.
శ్రీకృష్ణుడిని దుర్యోధనుడి దగ్గరకు రాయబారానికి పంపే సమయంలో ధర్మరాజు ‘‘పగను పెంచుకోకూడదు, దానిని అణచుకోవడమే శుభం. పగతో పగ ఎప్పుడూ చల్లారదు. నిప్పుతో నిప్పు చల్లారదు కదా’’ అని ఎంతో సహనంతో మాట్లాడుతాడు ధర్మరాజు. ఆ సహన గుణంతోనే అంతిమంగా విజయం సాధించాడు.
శ్రీరామచంద్రమూర్తి సహనశీలత గురించి వేరే చెప్పనవసరం లేదు. కైకేయి విషపు కోరిక పట్లగాని, అరణ్యవాసంలోగాని, చివరకు రాక్షసుల విషయంలోగాని సహనం ప్రదర్శిస్తూనే ధీరోదాత్తుడై విజయం చేకూర్చుకున్నాడు. అరణ్యంలో లక్ష్మణుడు, భరతుడు సైన్యంతో రావడం చూసి తొందరపాటుతో తిరగబడబోయాడు. అప్పుడు రాముడు వ్యతిరేక దృష్టితో చూడకు. తొందరపడి ఆవేశపడకు, సహనంతో ఉండు అని చెప్పడంవల్ల పెద్ద ప్రమాదం తప్పింది.
ఎంతో సహనంగా ఉన్న కౌసల్య కూడా భరతుడు కనబడగానే తనను తాను నిగ్రహించుకోలేక భరతుడ్ని నానామాటలు అంది. యువకుడైనప్పటికీ భరతుడు ఓర్చుకొని ఆమెను గౌరవిస్తాడు. సహనంతో కౌసల్యకు ఆనందం కలిగిస్తాడు.
శమీక మహర్షి పట్ల పరీక్షిత్తు అకారణంగా అనూహ్యంగా అపరాధం చేస్తాడు. పరీక్షిత్తు శ్రీకృష్ణ వరప్రసాది. మహామేధావి, సుగుణశీలి. ఒక్క క్షణం సహనం కోల్పోయి ప్రవర్తించడంవల్ల ఎంతో నష్టపోయాడు.
అన్నీ సక్రమంగా వున్నప్పుడు అందరూ సహనంగా ఉంటారు. కానీ వ్యతిరేక పరిస్థితులలో ఉద్రేకపడకుండా ఉండడమే సహన స్వరూపం. ధృవుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి విష్ణుమూర్తిని సాక్షాత్కరింపచేసుకుని, తపస్సుకు సహనం ముఖ్యమని దానితోనే విజయం సాధించగలమని చూపాడు.
భగీరథుడు పట్టుదల, సహనం మరియు దీక్షతో ఎంతటి ఘనకార్యం సాధించాడో మనకు తెలిసిందే. హరిశ్చంద్రుడు సహనంతో సత్యాన్ని గెలిపించాడు. ‘సత్యమేవ జయతే’ అని ముండకోపనిషత్ చెబుతోంది. అయితే సత్యాన్ని గెలిపించడానికి సహనం తప్పనిసరి. సహనం ప్రదర్శించడం అనేది పిరికితనం కాదు దానికి అంతులేని ధైర్యం ఉండాలి. అబ్రహం లింకన్‌కు ఎదురైన పరాజయాలు ఇంకెవరినైనానైతే కృంగదీసేవేమో! ఎన్నో అపజయాలు తనను అవహేళన చేసినా సహనంతో వేచి వేచి ఏకంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు.
థామస్ అల్వా ఎడిసన్‌ను ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయుడు చదువుకు పనికిరాడని హేళన చేశాడు. కానీ తన తల్లి ప్రత్యేక శ్రద్ధతో తర్ఫీదునిచ్చింది. ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్ఫ్ ఆవిష్కరణకు ముందు అనేక విఫలాలు ఎదుర్కొన్నాడు. తరువాత ఏకంగా ఒక వేయి ఒక నూతనావిష్కరణలు ప్రపంచానికి ఇచ్చాడు. మహానుభానవుడు అబ్దుల్ కలాం బాల్యం నండి సత్సాంగత్యము, పెరిగిన వాతావరణము తనకు అంతులేని సహనశీలతను అలవరచుకునేలా చేసి ఈ రోజు మన భారతదేశానికి ఒక మరువలేని యోగిలా నిలిచాడు. చరిత్రలో కీర్తిప్రతిష్ఠలు సంపాదించిన వారిలో అధికులు సహనమును సాధనామంత్రముగా ఆచరించి అభ్యున్నతిని అధిరోహించినవారే.

-చావలి శేషాద్రి సోమయాజులు