మంచి మాట

శివసతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్ష ప్రజాపతి, అసిక్నిల కుమార్తె సతీదేవి. దక్షుడు ఈమెను శివునకిచ్చి వివాహం చేశాడు. బ్రహ్మవేత్తలు తలపెట్టిన యజ్ఞాన్ని చూడబోయిన దక్షుణ్ణి చూసి సభలోనివారంతా లేచి గౌరవాన్ని ప్రకటించారు. శివుడు మాత్రం దేహాభిమానం కల పురుషులకు నమస్కరించడం తగినది కాదని, భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి శరీర నమస్కారం తగదని భావించి లేవలేదు. నమస్కరించలేదు. భరించలేని దక్షుడు శివుని తూలనాడాడు. శివుడు సైరించాడు. అది మొదలు దక్షునికి శివునిపై ద్వేషం పెరిగిపోయింది. దక్షుడు పరమేశ్వరుణ్ణి ధిక్కరించి వాజపేయం అనే యజ్ఞం చేశాడు. బృహస్పతి సదనమనే యజ్ఞం చేయడానికి పూనుకున్నాడు. ఈ యాజ్ఞానికి దేవతాది గణాలన్నీ తరలిపోసాగినాయి. అది చూసి కుతూహలంతో సతీదేవి పతి పరమశివునితో ఈ విషయం చెప్పింది. ఋషులు జరిపించే ఆ మహాయజ్ఞాన్ని చూడాలన్న కోరిక కలిగిందన్న ఆశను బయటపెట్టింది. మీచే సృష్టించబడిన సత్త్వరజస్తమోగుణాత్మకమైన ప్రపంచం మీకు ఆశ్చర్యం కలిగించదు కానీ నేను స్ర్తిని కాబట్టి ఒక్కసారి నా పుట్టిల్లు చూడాలని అనుకుంటున్నాను, మిమ్ములను వేడుకుంటున్నాను అని ప్రార్థించింది. మునులు, ప్రజాపతులు, దేవతల సమక్షంలో వైభవోపేతంగా తండ్రి ఇంట జరుగబోతున్న శుభకార్యాన్ని చూడాలనిపించడం సహజమైనదే కదా. ఎందుకంటే తండ్రి, గురు, మిత్రుడు, రాజు మొదలైన వారి ఇళ్ళకు పిలవకపోయినా సజ్జనులు వెళ్ళడం సమర్థనీయమే అని సమర్థించుకుంది. శివుడు నచ్చచెప్పబోయాడు. మందబుద్ధులు మదోన్మత్తులై మహాత్ముల గొప్పదనాన్ని గుర్తించలేరు. అటువంటి కపట బుద్ధులైన ఇళ్లకు చుట్టరికాన్ని పాటించి వెళ్లడం వివేకవంతులకు తగదు. శరీరమంతా తూట్లుపడినా భరించవచ్చుకానీ దగ్గరి బంధువుల దురహంకార దుర్భాషలు వ్యక్తిని మరింత క్రుంగదీసి కృశింపజేస్తాయి.
ఏ పాపమూ ఎరుగని నన్ను పూర్వం ప్రజాపతులు చేసే యజ్ఞంలో నీ తండ్రి నిందించి పరాభవించి నాతో విరోధం కొనితెచ్చుకున్నాడు. నీకు అక్కడ అవమానం ఎదురవుతుంది అని జశివుడు హెచ్చరించాడు. సతీదేవి సందిగ్ధంలో పడింది. తనలో సగమిచ్చి గౌరవించిన పరమశివునిపై మక్కువ కంటే పుట్టింటిమీది మమకారమే ఎక్కువగా అనిపించింది. చివరకు శివుని వద్దనకుండాజేసింది. అతిశయించిన ఉత్సాహంతో ఒంటరిగా వెళుతున్న సతీదేవి వెంట ప్రమథులూ, యక్షులూ ప్రయాణమైనారు. వృషభ వాహనంలో తీసుకువెళ్ళారు. అక్కడకు చేరుకోగానే తల్లీ తోబుట్టువులూ అనురాగంతో ఆదరించారు. సభలో వున్నవారు దక్షునికి భయపడి ఆమెను గౌరవించకుండా ఊరకున్నారు. తండ్రి మాత్రం తలెత్తికూడా చూడకుండా అవమానించాడు. తన కోపాగ్నిలో లోకాలను బూడిద చేయాలన్నంత కోపం వచ్చింది. శివుని ద్వేషించి దురహంకారంతో యజ్ఞం చేస్తున్న దక్షుణ్ణి హతమారుస్తామని ముందుకురికిన ప్రమథగణాలను వారించింది. ఈ విశ్వంలో ద్వేషబుద్ధి లేనివారు, అందరికంటే అధికుడు, దేవదేవుడు అయిన శివుని నీవు తప్ప మరెవ్వరూ ద్వేషించరు అని శివుని గుణగణాలను ప్రస్తుతించింది. శివనిందను వహించిన వారే మరణించాలి. శివనిందను వినకూడదు అని ధర్మజ్ఞులు అంటారు కాబట్టి నేను నీ కుమార్తెను అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నీవల్ల ప్రాప్తించిన ఈ దేహాన్ని పరిత్యజించి పవిత్రురాలను అవుతాను అని చెప్పింది. పరాభవాగ్నితో ఆమె రగిలిపోయింది. తిరిగి శివుని వద్దకు వెళ్ళడానికి ఆమెకు మనస్కరించలేదు. అభిమానం అడ్డు వచ్చింది. శుచియై వౌనం దాల్చి నేలపై కూర్చుని యోగమార్గం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టాలని నిశ్చయించుకుంది. ప్రాణాపానాలను నిరోధించి నాభి ప్రదేశంలో ఏకం చేసి దానిని ఉదానం వరకు పైకి కొనిపోయి బుద్ధితో కలిసి భ్రూమధ్యభాగానికి చేర్చింది. ఏకాగ్రమైన మనస్సుతో పరమ శివుని పాద పద్మాలను ధ్యానించింది. ఆ దేవదేవుడు ఆదరించే తన దేహాన్ని దక్షుని నిర్లక్ష్యానికి ప్రతీకారంగా పరిత్యజించడం కోసం తనలో యోగాగ్నిని రగుల్కొలిపింది. ఈ విధంగా గతకల్మషమైన సతీదేహం ఆ త్యాగమయి యోగ సమాధినుండి పుట్టిన అగ్నిలో భస్మమైంది.

-కె.లక్ష్మీ అన్నపూర్ణ