మంచి మాట

తరగని ఆస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రి మాట విన్న శ్రీరాముడు కీర్తిపొందాడు. దశరథుడి అంతరంగాన ఉన్న బాధను అర్థం చేసుకుని శ్రీరాముడు కైకేయి చెప్పినట్లు శ్రీరాముడు అరణ్యవాసం చేసి కీర్తిపొందాడు.
తండ్రిమాట విన్న పరశురాముడు తల్లిని చంపి తిరిగి ఆమెను బ్రతికించుకుని తను కీర్తి పొంది శ్రీరాముడిలో ఐక్యం పొందాడు. అంతరంగ రాముడైనాడు.
తండ్రి మాట విని జీవితాంతము బ్రహ్మచారిగా ఉండిపోయిన భీష్ముడు పురాణ పురుషుడైనాడు, కీర్తి పొందాడు. విష్ణుసహస్రనామం లోకానికందించాడు. తనయులకు తండ్రి మాట మూలధనం అని భావించే వాడికి ప్రస్తుతానికి తెలియకపోయినా భవిష్యత్తులో ధనవంతుడు, కీర్తిమంతుడు కాగలడను నాభాగుని వృత్తాంతం తెల్పుచున్నది.
నాభాగుడు చిన్న వయసులోనే ఆధ్యాత్మిక విద్యను అభ్యసించుటకు గురుకులానికి వెళ్తూ వృద్ధుడగు తండ్రిని, పొలమును చూసుకోమని చెప్పి వెళ్తున్న నాభాగునికి, అన్నలు తప్పక చూసుకుంటామని భరోసా ఇచ్చారు. తండ్రి కూడా అంగీకారము తెలిపిన తరువాత అతడు నిర్భయంగా విద్యనభ్యసించుటకు గురుకులానికి వెళ్ళాడు.
గురుకులంలో విద్య పూర్తిచేసుకొని గురువు ఆశీర్వచనము పొంది ఇంటికి తిరిగి వచ్చాడు. స్వార్థపరులు, అన్నలు, నాభాగా! నీ వంతు ఆస్తి నాన్నగారే. ఆయన వద్దకు వెళ్లి కావాల్సింది తీసుకో అని చెప్పారు. సోదరుల మోసం తెలుసుకుని నాభాగుడు మనస్తాపం చెంది తండ్రి వద్దకు వచ్చి, విషయం చెప్పి, తండ్రీ! నేను దైనందిన జీవితం గడపడానికి ఏం చేయాలి? అని అడిగాడు.
నాభాగా! దిగులు చెందకు, నేను చెప్పినట్లు చేస్తే నీవు కోరుకున్న సంపదను పొందుతావు అని ధైర్యం చెప్పాడు. అంగీరస మహర్షి అనుయాయులైన మునులు మన వనంలో సత్రయాగం చేస్తున్నారు. 12వ రోజైన నేడు వైశ్వదేవసూక్తాలను ఉచ్చరించాలి. కానీ వారికి ఆ సూక్తాలను గురించి అంతగా తెలియదు. అవి తెలిసిన నవ్వు అక్కడకు వెళ్లి వారికి సహకరించు. వారు యాగంలో మిగిలిన అపార సంపదను, తక్కిన వస్తువులను నీకు దక్షిణగా సమర్పిస్తారు అని తెలియజేయగా, తండ్రి మాట తరగని ఆస్తి అని, పెద్దలు పెరుమాళ్లు మాట అంటూ నాభాగుడు చెప్పిన చోటుకు వెళ్ళాడు. దూరమైనా, కష్టమైనా ప్రయాణం సాగించాడు.
మనవనంలో సత్రయాగం కోసం మునులంతా సమావేశం అయినారు. కానీ వారికి వైశ్వదేవుని గూర్చిన సూక్తులు తెలియక, తెలిసిన మహనీయుడి కోసం ఎదురుచూచుచుండగా నాభాగుడు వచ్చాడు. అయ్యా! భగవత్కృపతో వాటిని నేను నేర్చాను. అనుగ్రహిస్తే నేను చదువుతానని వారి అంగీకారంతో యాగం పూర్తిచేశాడు. యాగం పూర్తిఅయిన తరువాత సంపదంతా నానాగునికిచ్చారు.
నాభాగుడు సంపదంతా మూట గట్టుకుని సంతోషంగా వస్తుండగా, ఒక యక్షుడు అడ్డుతగిలి యాగంలో మిగిలింది నాకే సొంతం. దక్షయజ్ఞం నుండి ఈ అనవాయితీతో పరిపాటి అని తెల్పాడు. కాదు కాదు ఈ సంపదంతా నాకే, నా కష్టానికి ఋషులు ఇచ్చిన పారితోషికమని, దయచేసి అంగీకరించమని బ్రతిమాలాడు. కాని యక్షుడు వినలేదు. తండ్రిని అడిగితే యక్షునికే సంపద దక్కుతుందనిచెప్పగా నాభాగుడు యక్షుడు నాభాగుని సత్యనిష్ఠకు మురిసిపోయ సంపదనంతా నాభాగుడికే ఇచ్చివేశాడు. ఆతరువాత యక్షుడే పరమేశ్వరుని రూపంలో కనబడగా పరమేశ్వరా! మీరే యక్షునిగా వచ్చారా! మీ కారుణ్యమే కారుణ్యం అని నాభాగుడు ప్రార్థించాడు.
నాభాగా! నీ త్యాగం, నీ ప్రేమ ఈ రెండు గుణాలే భగవంతునికి దగ్గరగా చేసినాయి. లోగడ నీవు గురుకులంలో గొప్ప త్యాగం చేశావు. సంపాదించిన భిక్షలో సగం అనాథ పిల్లలకు దానం చేశావు. ఈ దానగుణమే నీకు సత్ఫలితం ఇచ్చింది. నీ ఇంట లేమి ఉండదని ఆశీర్వదించాడు. నాభాగుడికి శివపార్వతులు దర్శనమిచ్చి అతనికి తండ్రి మాట విన్నందుకు సర్వ సంపదలు ఇచ్చి ఆశీర్వదించారు.ఇలా తండ్రి మాట వింటే తరగని ఆస్తికి వారసులవుతారు.

- జమలాపురం ప్రసాదరావు