మంచి మాట

గురు మహిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నది ఒక్కటే. దృష్టిని బట్టి దృశ్యము పలురకాలుగా ఉంటుంది. సత్యం ఒక్కటే కాని విపులీకరించే విశే్లషించే విధానాలు పలురకాలు. సత్యా సత్యాలలోకాని, ధర్మాధర్మాలలో కాని వ్యత్యాసం లేశమాత్రమే ఉంటుంది. దాన్ని గుర్తించే నైపుణ్యం సాధారణ మానవులకు అంతగా ఉండదు. అందుకే మంచి త్రోవను చూపి, దైవం పట్ల ఆరాధనను, ధర్మం పట్ల, సత్యం పట్ల నిర్ధిష్టమైన దృష్టిని కలిగించడానికి సద్గురువు కావాల్సి ఉంటుంది. అందువల్లనే గురువును ప్రతివారు ఆరాధిస్తారు. పురాణాలన్నీ గురువు మహిమను కొనియాడుతున్నాయ. హైందవం గురువును ఒక వ్యక్తికాదు ఒక శక్తి, ఒక వ్యవస్థ గా భావిస్తుంది.
తిమిరాంధకారాన్ని పారద్రోలేవానిగా గురువు మహోన్నతస్థానంలో కీర్తించ బడుతాడు. గురు అనుగ్రహాన్ని పొందిన వారికి త్రిమూర్తులు సైతం కింకరులుగానే ఉంటారు. మానవ జాతి ఉద్ధరించడానికి వేద వ్యాసమహర్షి 18పురాణాలు, 18ఉపపురాణాలు, బ్రహ్మసూత్రాలు, పంచమవేదంగాఖ్యాతి వహించిన భారతం, హరివంశం అంటూ 39 మహోత్తమమైన గ్రంథాలను మానవజాతికి అందించారు. అపార వేదరాశిని ఋగ్వేద, సామ, అధర్వణ, యజుర్వేదాలనే నాలుగు విభాగాలు చేసి వాటి ప్రచారానికి నలుగురు శిష్యులను తయారుచేశారు. ఆషాఢపూర్ణిమను వ్యాసభగవానుని జయంతి కనుక ఆరోజును గురుపూర్ణిమగా సంభావించడం జరుగుతోంది.
ఇంత చేసిన వేదవ్యాస మహర్షి సామాన్య మానవునికి ఇవన్నీ అర్థం అవడానికి సమయం పడుతుందేమోనని ఒక్క వాక్యంలో పరపీడనమే పరమపాపమని పరోపకారమే పరమశ్రేష్ఠమంటూ తాను రచించిన ఎన్నో కథల్లో చెప్పారు. ఉన్నదాంట్లో కాస్తంత దానం ఇవ్వడమే మహోన్నతనమైన దానం అనీ చెప్పారు. కలియుగంలో ఎందరో గురువులు ఎనె్నన్నో విశేషాలను చెప్పారు. వ్యాస జననం అయన ఆషాఢ మాసంలోని పూర్ణిమ తిథి నాడు ఎవరైనా బ్రహ్మజ్ఞానులను సంతృప్తిపరిచి అర్ఘ్యపా ద్యాదులను సమర్పించి వ్యాసమహర్షిని ధ్యానం చేస్తే వారికి ఆ మహర్షి దర్శనం కలుగుతుందని పెద్దలు అంటారు. తల్లి తండ్రి గురువు దైవసమానులు అనే భారతీయం అజ్ఞానాన్ని పారద్రోలి తమస్సు నుంచి ఉషస్సుకు దారిచూపే గురువుకు మహోన్నత స్థానాన్ని ఇచ్చింది. ద్వైత భ్రాంతిని పోగొట్టి అద్వైత మార్గాన్ని చూపే గురువు నిజగురువు.‘గురుర్ గురుతమో ధీమ సత్యః సత్య పరాక్రమః’ అనే విష్ణు సహస్రనామం జపిస్తూ లోకానికకంతా జ్ఞాన మార్గాన్ని చూపిన వ్యాసుల జయంతి రోజున ‘విష్ణుపురాణం’ దానంచేస్తే శాశ్వత విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
అవతారపురుషులైన శ్రీరామకృష్ణులు సైతం గురువును సేవించడంలోని పరమార్థంఇదే. గురువుల బాటలో పయనించమనే భారతీయం పరోపకారం మిదం శరీరం అని బతకమని చెప్తుంది. గురువును పూజించడమంటే దేశోన్నతికి సహకరించడమే. ఎన్ని విపత్తులు వచ్చినా సత్యాన్ని వీడకుండా ధర్మాన్ని తప్పకుండా ఉంటే చాలు గురువును పూజించినట్లే అవుతుంది.
‘‘గురులేక ఎటువంటి గుణికి తెలియగబోదు’’అన్న పెద్దల మాటను గుర్తుంచుకుంటూ బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్నట్టుజీవించడమే గురుమార్గంలో పయనించడమే. మహోన్నత జీవన పథాన్ని చూపిన వ్యాసమార్గంలో జీవిస్తూ మనమూ వ్యాసస్వరూపులం కావాలి. సత్యధారుణులం కావాలి. ధర్మపరాయణులం కావాలి. అదే మనం వ్యాసునికిచ్చే నివాళి.

- చివుకుల రామమోహన్