మంచి మాట

భావన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వ జగత్తు ఈశ్వరమయం అనేది ఉపనిషత్తు వాక్యం. పరమాత్మ ఈ ప్రాపంచిక వస్తువులన్నింటిలోనూ జీవులన్నింటిలనూ వ్యాపించి ఉన్నాడు. దాన్ని నిరూపించ డానికే చెట్లు స్వచ్ఛమైన గాలినిస్తున్నాయ. నీరు సర్వప్రాణికోటికి దాహార్తిని తీరు స్తున్నాయ. ప్రకృతి మనిషేకాక ప్రాణికోటి యావత్తు జీవించడానికి ఉపయుక్తమై ఉంది. కనుక బుద్ధిజీవులైన మనుష్యలందరూ కూడా త్యాగధనులై ఉండాలనేది పెద్దల భావన.
ప్రాణులందరినీ ప్రేమభావనతో సంరక్షించుకోవాలి. అంతేకానీ నీది నాదని తత్వానికి తావివ్వకూడదు. మనుష్యులు ఏ కర్మ చేసినా కర్మను కర్మఫలితాన్ని కూడా భగవంతునికి నివేదన చేయడం అలవాటు చేసుకొన్నారు. దానే్న సులభంగా అర్థం చేసుకోవాలంటే....మనం వండిన అన్నాన్ని భగవంతునికి నివేదన చేసి తిరిగి ప్రసాదంగా తీసుకోమన్నారు. ఇక్కడ భగవంతుడు ఇచ్చిన పదార్థానే్న తిరిగి భగవంతునికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకొంటే అది ఔషధంగా పనిచేసి మనలను రుగ్మతలనుంచి కాపాడుతుంది.
సృష్టిలోని మాట్లాడశక్తి లేని ఏప్రాణికైనా కాస్తంత నీరు పోస్తేనో అన్నం పెడితేనో అవి వాటి ప్రేమభావాన్ని వ్యక్తం చేస్తాయ. నోరులేని ప్రాణి తన అనుబంధాన్ని ఇంత చక్కగా వ్యక్తం చేస్తుంటే, ఇంత ఆలోచనా శక్తిగల మనం మనతోటివారితో, మనకు మేలు చేసినవారితో ఎంత అనుబంధాన్ని పెంచుకోవాలి? ఎలా అభివ్యక్తీకరించాలి? అనిఆలోచన కూడా లేకుండా ఉండడం మనలను మనుష్యలనిపించుకోవడంలో భావ్యం ఉంటుందా?
ఎన్నో కఠిన తరమైన తపస్సులకు మరెన్నో యజ్ఞయాగాదులు చేసినా దొరకని పరమాత్మ దర్శనం కేవలం ప్రేమపూరితమైన భావనకే లభిస్తుంది. ఇది ప్రేమకున్న శక్తి. ఏప్రాణులనైనా ప్రేమాభిమానాలతో చూస్తే వారిని అప్యాయంగా పలుకరిస్తే చాలు వారు తినడానికి పెట్టకపోయనా ప్రేమతో వశమైపోతారు. ముక్కుమొహం తెలియకపోయనా కొన్నాళ్లకు వారు మిత్రులౌతారు. మంచి సాంగత్యంతో చెడు వ్యసనాలకు దూరం కావచ్చు. మంచితనాన్ని అలవాటు చేసుకొన్నారు. దానగుణం అలవడుతుంది. స్వార్థ్భావన ఇంచుక కూడా లేకుండా నశించిపోతుంది. ఇక సమాజంలో మనం ఒకరిగా కాదు ఒక సమిష్ఠి శక్తిగా కనపడుతాం. దీనికి కేవలం తనపర అన్న భేదాన్ని విడనాడాలి. తనకోసం అని కాక మనకోసం అని పనులు చేయాలి. స్వప్రయోజనాలకు విలువ ఇవ్వకుండా నలుగురికీ మంచి జరిగే పనులకు శ్రీకారం చుట్టాలి.
మనమాటల ద్వారా, చేతల ద్వారా తోటివారికి మనం ఆదరపూర్వకమైన బంధుజనంగా భావించబడేలాగా మసులుకోవాలి. వారితో అవినాభావ సంబంధం పెంచుకోవచ్చు. ‘జంతూనాం నరజన్మ దుర్లభమ్’ అన్నారు. అంత దుర్లభమైన మానవ జన్మ పొందాక దాన్ని సార్థకం చేసుకోవాలి. దీనికి మానవత్వంతో బాటు ప్రేమతత్త్వం పెంచుకుంటే చాలు సర్వజనులు బంధుజనులే అవుతారు. హిరణ్యకశపుడు లోకాలన్నింటిని నేను అధీశ్వరుడను అందరూ నాకేలొంగి ఉండాలి అని కోరుకుని నానాహింసలు పెట్టి అందరినీ తన అధీనంలోకి తెచ్చు కోవడానికి ఆఖరికి తన ప్రియపుత్రుణ్ణిని కూడా హింసలకు గురిచేశాడు.
కాని నామదేవుడు జ్ఞానదేవుడు లాంటి భక్తులు కేవలం ప్రేమభావనతో భగవంతుణ్ణే తన హృదయకుహరంలో కట్టేపడేశారు. ఈ భక్తులమదిలో ఉన్నది కేవలం భక్తియుతమైన ప్రేమనే. ఈ ప్రేమనే సర్వప్రాణులనే కాక భగవంతుణ్ణి సైతం వశపరుస్తుంది. కనుక మనం పట్టు పట్టి నేర్చుకోవాల్సింది ప్రేమతత్వానే్న. నలుగురితో మంచిగా ఉండండి అని పెద్దలు చెప్పేనానుడిలోను ఇదే భావన ఉంది. ఎవరికీ అర్థం కాని భగవంతుడు కూడా కేవలం ప్రేమకే కట్టుబడుతాడు. యశోదాదేవి తన కొడుకుగా భావించి తరించిది కనుకనే ఆమెకు తానెవరో ఎరుక పర్చడానికి తన నోట పదునాల్గు భువనాలను చూపించాడు పరమాత్మ. తననే నమ్ముకున్నవాడు కనుక అర్జునునికి రథసారథిగా ఉండి విజయకేతనాన్ని ఎగురవేయడానికి సాయం అందించాడు పరమాత్మ. కనుక ఏ చింతనలు లేక పరమాత్మను స్మరిద్దాం.

- సాయశ్రీ